Tenant Movie Review: An interesting murder mystery thriller (Rating:3.25)

మర్డర్ మిస్టరీ సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాని తీయగలిగితే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం చాలా సులభం.అందుకే దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి వాటికి ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారు. మన చుట్టు పక్కల జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను చూసి... ఇన్ స్పైర్ అయ్యి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులను చాలా నాచురల్ గా, రియల్ స్టిక్ గా తెరమీద చూపించడం వల్ల ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. తాజాగా సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటగా ‘టెనెంట్’ పేరుతో ఓ మర్డర్ మిస్టరీ సినిమాని దర్శకుడు వై.యుగంధర్ తెరకెక్కించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

స్టోరీ: గౌతమ్(సత్యం రాజేష్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తనకు ఓ అందమైన భార్య సంధ్య(మేఘా చౌదరి) ఉంటుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దంపతులుగా ఆ అపార్ట్ మెంట్ లో గుర్తింపు పొందుతారు. సంధ్య, గౌతమ్... ఇద్దరూ చాలా డీసెంట్. ఇంత అన్యోన్యమైన దాంపత్యజీవితం సాగుతున్న వీరి జీవితంలోకి పక్క ఫ్లాట్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు రమ్య పొందూరి, మేగ్న పరిచయమవుతారు. సంధ్యతో క్లోజ్ అయ్యి... ఆమెతో పరిచయం పెంచుకుంటారు. ఈ పరిచయం వీరి మధ్య స్నేహానికి దారితీస్తుంది. అయితే ఓ రోజు ఉన్నట్టుండి సంధ్య శవాన్ని ఓ సూట్ కేసులో గౌతమ్ వేసుకుని పోయి... నగరానికి దూరంగా ఓ నిర్మాణుషంగా ఉండే ప్రదేశంలో శవాన్ని తగులబెడతాడు. అయితే తన భార్య కనిపించడంలేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లేడీ ఆఫీసర్(ఏస్తర్)ని నియమిస్తారు. మరి ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా చేధించింది? సంధ్య మరణానికి కారకులు ఎవరు? ఆమె శవాన్ని తన భర్త ఎందుకు రహస్యంగా కాల్చాల్సి వచ్చింది? వీరి జీవితంలోకి ఎంటర్ అయిన మరొక జంట ఏమైంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే...
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ప్రధానంగా ఉండాల్సింది... ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో కూడా అదే ప్రధాన ఆకర్షణ. ఎక్కడా ప్రిడిక్ట్ అనేది లేకుండా ఆడియన్స్ లో ఎంతో ఉత్కంఠ ను రేపుతూ సినిమా చివరిదాకా సాగిపోతుంది. మర్డర్ మిస్టరీని చివరిదాకా రివీల్ చేయకుండా బాగా మెయింటైన్ చేయగలిగారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా స్టోరీ ఏమీ రివీల్ కాకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. సంధ్య మరణానికి గల కారకులు ఎవరు? ఎలాంటి పరిస్థితులు ఆమె మరణానికి కారణం అయ్యాయి... అమెరికాకు వెళ్లాల్సిన గౌతమ్... కెరీర్ అన్యాయంగా ఎలా ముగిసింది.. తమ ప్రమేయం లేకుండానే ఎంతో అన్యోన్యంగా ఉండే జంట... అర్ధాంతరంగా తనువులు చాలించాల్సి వచ్చిందనేది ప్రేక్షకుల హృదయం ద్రవించేలా సినిమా క్లైమాక్స్ ను ముగించారు. నేటితరం అమ్మాయిలకు ఓ మంచి మెసేజ్ ఇస్తుంది ఈ సినిమా. పరిచయం లేని వ్యక్తులతో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఇందులో చక్కగా చూపించారు. అమ్మాయిలకు ‘టెనెంట్’ ఓ అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది.

నటీనటుల పనితీరు ఎలా ఉందంటే...

సత్యం రాజేష్... చాలా డీసెంట్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం పోలిక లేకుండా ఉండే ఓ ఎమోషనల్ పాత్రలో నటించారు. క్లైమాక్స్ లో తన మీద ప్రేక్షకులకు తప్పకుండా జాలి కలుగుతుంది. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా చాలా సాంప్రదాయ బద్ధంగా కనిపించింది. ఓ డీసెంట్ ఫ్యామిలీలో అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి పాత్రను చక్కగా చేసింది. గృహిణి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇందులో మరో యువ జంట కూడా ఉంది. చందన పయావుల... ఇంతకు వెబ్ సిరీస్ తో అందరికీ సుపరిచితురాలే. చాలా క్యూట్ గా నటించింది. హోమ్లీగాళ్ గా కనిపించి మెప్పించింది. ఆమెకు పెయిర్ గా నటించిన భరత్ కూడా తన పాత్ర పరిధి మీరకు నటించి ఆకట్టుకున్నాడు. నెగిటివ్ రోల్ పోషించిన దిలీప్... కాసేపు చేసినా నెగిటివ్ రోల్ కు ప్రాణం పోశాడనే చెప్పొచ్చు. అతనితో పాటు నటించిన చందు, అనురాగ్, రమ్య, మేఘ్నా అంతా... తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే...

దర్శకుడు యుగంధర్... ఓ మెసేజ్ ఓరియంటెడ్ ప్లాట్ ను ఎంచుకోవడం నేటి తరం అమ్మాయిలకు ఎంతో ఉపయోగం. ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీస్ లో జీవించే అమ్మాయిలకు ఇలాంటి సినిమాలు ఎంతో కనువిప్పు కలిగిస్తాయి. అలాగే అపార్ట్ మెంట్ కల్చర్ లో కూడా ఎలాంటి జాగ్రత్తలతో వ్యవహిరించాలనే దాన్ని చాలా చక్కగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. ఓ డీసెంట్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ అయితే నప్పుతుందో దాన్ని చక్కగా క్యారీ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటను అందంగా చూపించారు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమా నిడివి కూడా రెండుగంటల లోపే ఉండటం సినిమాకి పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఈ వీక్ రైట్ ఛాయిస్ ఈ మూవీ. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%