‘Ruslan’ is an extraordinary movie. It is very wonderful. I want the film to be a big success: Veteran writer Vijayendra Prasad at the meet and greet event

'రుస్లాన్' ఎక్స్ ట్రార్డినరీ మూవీ. చాలా అద్భుతంగా వుంటుంది. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

బాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షనర్ 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ని నిర్వహించింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. శివకి కథపై చాలా పాషన్ వుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేకపోతున్నాను. అంత అద్భుతంగా వుంటుంది. ఈ టీజర్ చాలా సార్లు చూశాను. చూసిన ప్రతిసారి కొత్త కోణం కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ గారితో సినిమా జరుగుతున్నపుడు ఆయుష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసేవారు. తనని చూసినప్పుడే హీరోలా కనిపించారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీగా చేశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంది. రాధామోహన్ గారు చాలా పాషన్ వున్న నిర్మాత. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. జగపతి బాబు గారు ఎన్నో హిట్స్ చూశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ సినిమాని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.

జగపతి బాబు మాట్లాడుతూ... ఆయుష్ శర్మ, సుశ్రీ, రాధమోహన్ టీం అంతా కలిసి పెద్ద హిట్ ఇవ్వబోతున్నారు. మనం అంతా ఆదరిద్దాం. ఈ సినిమా చాలా స్పెషల్. అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది ఆయుష్ ది ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్. సుశ్రీ పాత్ర కూడా చాలా కీలకంగా వుంటుంది. ఇందులో నేను చాలా డిఫరెంట్ డైమెన్షన్ వున్న పాత్ర చేస్తున్నాను. ఇది నా రెండో హిందీ చిత్రం. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ డైమెన్షన్ వున్న పాత్ర చేస్తున్నాను. మీ అందరిఆదరణ వుంటే తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు.

హీరో ఆయుష్ శర్మ మాట్లాడుతూ... ఈ వేడుకకు విజయేంద్ర ప్రసాద్ గారు రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనే మొదటిసారి నాపై నమ్మకం ఉంచారు. సుల్తాన్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాను. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారే నన్ను నటుడిగా లాంచ్ చేస్తే బావుంటుందని చెప్పారు. అలా నా జర్నీ మొదలైయింది. కెకె రాధమోహన్ గారు బ్రేవ్ హార్ట్ ప్రొడ్యూసర్. ప్యాసన్ కి మారు పేరు. చాలా అంకిత భావంతో ఈ సినిమాని నిర్మించారు. ఆయన బ్యానర్ లో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ గొప్ప విజయాన్ని చేకూర్చుతుందని నమ్ముతున్నాను. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. ఖచితంగా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

హీరోయిన్ సుశ్రీ మిశ్రా మాట్లాడుతూ..రుస్లాన్ చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఏప్రిల్ 26న సినిమాని మీ అందరికీ చూపించడానికి ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్ లోనే ఈ సినిమా మొదటి షెడ్యుల్ చేశాం. ఇప్పుడు ఈ వేడుకలో మీ అందరినీ ఇక్కడ కలవడం ఆనందంగా వుంది'' అన్నారు.

నిర్మాత కెకె రాధమోహన్ మాట్లాడుతూ.. హిందీలో ఇది మా మొదటి సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి అద్భుతంగా తీశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. ఎమోషన్, యాక్షన్, మంచి డైలాగ్స్, అందమైన విజువల్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఏప్రిల్ 26న విడుదలౌతుంది. అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి పెద్ద విజయాన్ని చేకూర్చుతారని నమ్ముతున్నాను.'' అన్నారు. ఈ చిత్రయూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%