Osey Arundhati title Song creates a Stir Online

నెటింట్లో 'ఒసేయ్ అరుంధతి' పాట హల్చల్

మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

దర్శకుడు ఈ పాటను బాగా రాశారు...
ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఒసేయ్ అరుంధతి పాటను చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ చాలా బాగా రాశారని ఆయన పేర్కొన్నారు. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చామన్నారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారని తెలిపారు.

త్వరలో సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తాం....
చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘అంద‌రికీ శ్రీరామ‌న‌వమి శుభాకాంక్ష‌లు. ఈరోజు ఒసేయ్ అరుంధ‌తి అంటూ సాగే టైటిల్ ట్రాక్‌ను విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం
చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.

నటీనటులు:

మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు

సాంకేతిక వర్గం:

నిర్మాత- గూడూరు ప్రణయ్ రెడ్డి, దర్శకత్వం - విక్రాంత్ కుమార్, సినిమాటోగ్రఫీ - సాయి చైతన్య మాటేటి, మ్యూజిక్ - సునీల్ కశ్యప్, ఎడిటర్ - మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ మద్దిరాల, లైన్ ప్రొడ్యూసర్ - ఎన్.మురళీధర్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ - వాసు, పి.ఆర్‌.ఒ: వంశీ కాకా.

Osey Arundhati title Song creates a Stir Online

'Osey Arundhati' is a family comedy thriller starring Monika Chauhan, Kamal Kamaraju, and Vennela Kishore in lead roles. Directed by Vikrant Kumar and produced by Guduru Pranay Reddy, the film is currently undergoing post-production activities. The makers have released the title lyrical song of the movie on the occasion of Sri Rama Navami.

The film’s music is directed by Sunil Kashyap. He mentioned that the "Osey Arundhati" song was exceptionally well-written by the film's director, Vikrant Kumar. The lyrics are catchy, and it helped me to score amazing tune. This song was sung by Rahul Sipliganj.

Guduru Pranay Reddy, the producer of the film, said, "Happy Sri Rama navami to all. We are happy to release the title track 'Osey Arundhati' today. It is a pleasure to produce 'Osey Arundhati' as a family comedy thriller with Kamal Kamaraju, Vennela Kishore, and Monika. The shooting of the movie has been completed, and currently, post-production activities are ongoing. We will announce the release date of the film soon."

Film director Vikrant Kumar said, "Arundhati, who belongs to a middle-class family in Hyderabad, takes care of household duties along with raising the children. She wishes to perform Satyanarayana Swamy Vratam. But unexpectedly, Arundhati faces a problem. The movie 'Osey Arundhati' is about how she solves this problem and protects the honor of her family. The movie primarily blends comedy with thrilling elements, making it a film worth watching with the whole family. Post-production activities are underway."

Actors:
Monika Chauhan, Kamal Kamaraju, Vennela Kishore, Prithviraj, Chitel Sreenu, Ariana Glory, Sunita Manohar, Tarzan, etc.

Technical Team:

Producer: Guduru Pranay Reddy
Director: Vikrant Kumar
Cinematography: Sai Chaitanya Mateti
Music: Sunil Kashyap
Editor: Marthand K. Venkatesh
Executive Producer: Venkat Maddirala
Line Producer: N. Muralidhar Rao
Production Controller: Vasu
PRO: Vamsi Kaka

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%