We will do whatever help the film industry needs. Deputy CM Mallu Bhatti Vikramarka at the pre-release event of ‘Gitanjali Malli Vachindi’

ఇండస్ట్రీకి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ పెద్ద హిట్ అవుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ

అందాల నటి అంజలి 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, సిద్దు జొన్నలగడ్డ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, డైరెక్టర్ వశిష్ట గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

అంజలి మాట్లాడుతూ.. ‘నా 50వ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. మా గీతాంజలి సినిమాను ఎంతలా ఎంజాయ్ చేశారో.. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో పని చేసిన నటీనటులందరికీ థాంక్స్. మా దర్శకుడు శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. మా కెమెరామెన్ సిద్దు వల్లే సినిమా చాలా బాగా వచ్చింది. మంచి క్వాలిటీతో సినిమాను తీశారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. శ్రీ జో లిరిక్స్ బాగున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం బాగా వచ్చింది. నా కోసం చేసిన మ్యాష్ అప్ చాలా నచ్చింది. కోన గారు చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్ పీపుల్స్ అందరినీ ఒక వద్దకు తీసుకొస్తారు. ఏప్రిల్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. ‘మిత్రులు కోన వెంకట్, పెద్దలు విజయేంద్ర ప్రసాద్, ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ నమస్కారాలు. తెలుగు పరిశ్రమకు మంచి విజయాలు రావాలని ఉగాది సందర్భంగా కోరుకుంటున్నాను. కోన గారు నాకు ఎన్నో ఏళ్ల నుంచి మిత్రులు. వ్యక్తిగతంగా, రాజకీయంగా మాకు ఎంతో అనుబంధం ఉంది. గీతాంజలి మళ్లీ వచ్చింది పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మధ్య తరగతి వాళ్లని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సాధనమే సినిమా. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది సినిమా పరిశ్రమ. ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీకి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి అండగా నిలబడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఎలాంటి సాయం అయినా చేసేందుకు సిద్దంగా ఉన్నాం. నన్ను ఈవెంట్‌కు పిలిచిన మిత్రులు కోన వెంకట్ గారికి థాంక్స్’ అని అన్నారు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పయనీర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గార్లతో స్టేజ్ మీద ఉండటం ఆనందంగా ఉంది. అంజలికి ఇది 50వ సినిమా. గీతాంజలి మళ్లీ వచ్చింది ఏప్రిల్ 11న రాబోతోంది. సీక్వెల్స్ హిట్ అవ్వదు అన్నోళ్లకి టిల్లు స్క్వేర్‌తో అట్లుంటది మనతోని అని చూపించాను. గీతాంజలి మళ్లీ వచ్చింది టీం కూడా చాటి చెబుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. కోనగారు చాలా మంచి వ్యక్తి. నా గెలుపుని తన గెలుపుగా భావించి సెలెబ్రేట్ చేశారు. కోన గారు లాంటి వ్యక్తితో నాకు పరిచయం ఉండటం అదృష్టం. ఆయనతో ఎప్పుడు కూర్చున్న సినిమా సంగతులెన్నో చెబుతుంటారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘భట్టి విక్రమార్క గారు నాకు 35 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన ఎంతో కష్టపడ్డారు. సిద్దు చేసిన ఎల్‌బిడబ్ల్యూ చూసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టాను. ఆ టైంలో సిద్దు ఎవరో, ఆ టీం మెంబర్స్ ఎవరో తెలీదు. మా ఈ స్టేజ్ మీదున్న ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. గీతాంజలి చిన్న కాన్సెప్ట్‌తో తీశాం. అది చాలా పెద్ద హిట్ అయింది. సీక్వెల్స్‌లో టిల్లు స్క్వేర్ రికార్డులు క్రియేట్ చేసింది. మా సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అంజలికి ఇది 50వ సినిమా. మా చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. శివ నిర్వాణ, హరీష్ శంకర్, ప్రవీణ్ లక్కరాజు, శ్రీజో వంటి వారిని నేను పరిచయం చేశాను. ఇప్పుడు శివ తుర్లపాటి పరిచయం అవుతున్నారు. మా ఈవెంట్‌కు వచ్చిన సిద్దు, విజయేంద్ర ప్రసాద్ గారికి, విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్’ అని అన్నారు.

శివ తుర్లపాటి మాట్లాడుతూ.. ‘అంజలి గారికి ఇది 50వ సినిమా. మాకు ఒక్క సినిమా చేయడానికే ఎంతో కష్టంగా అనిపించింది. అంజలి గారు 50 సినిమాలు చేయడం చాలా గొప్ప విషయం. ప్రవీణ్ లక్కరాజు సంగీతం చాలా బాగా వచ్చింది. ఈ మూవీలో ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కోన గారి వల్లే మేం అంతా ఇక్కడ ఉన్నాం. మా అందరినీ నమ్మిన సినిమాను తీసిన కోన గారికి థాంక్స్. ఏప్రిల్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తెలుగమ్మాయిగా అంజలి 50 సినిమాలు చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఓ సావిత్రి, వాణి శ్రీ గారిలా అఖండమైన కీర్తి పొందాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్ గారిలా నేను వినోదాత్మకమైన కథలు, స్క్రిప్టులు రాయలేకపోతోన్నాను. అందుకే ఆయన నాకు శత్రువువంటి వారు (నవ్వుతూ). ఈ ఈవెంట్ చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా జరిగింది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కోన గారు తీసిన నిన్ను కోరి సినిమాతోనే నేను సినిమాల్లోకి వచ్చాను. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టిన సిద్దు గారికి కంగ్రాట్స్. అంజలి గారు 50 సినిమాలు చేయడం గ్రేట్. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఈ మధ్యే కాంగ్రెస్ మళ్లీ వచ్చింది.. మా ఈవెంట్‌కు భట్టి విక్రమార్క గారికి థాంక్స్. టిల్లు స్క్వేర్ లాంటి హిట్ మా సినిమాకు కూడా వస్తుందని అనుకుంటున్నాం. అంజలికి ఇది 50వ సినిమా కావడం చాలా గొప్ప విషయం. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోనగారికి థాంక్స్. ఏప్రిల్ 11న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘గీతాంజలి సినిమాకు పదేళ్ల క్రితం షూట్ చేశాం. ఆ టైంలో వేణు అని మా సెట్‌కు వచ్చారు. ఆయనే ఇప్పుడు వశిష్టగా పెద్ద దర్శకుడిగా ఎదిగారు. సిద్దు గారు టిల్లు సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అంజలికి ఇది 50వ సినిమా. మా దర్శకుడు శివ తుర్లపాటి చాలా అందంగా ఉంటారు. కోనగారు ప్రతీ సెకన్ ఈ సినిమా గురించే ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఇది పెద్ద హిట్ కానుంది’ అని అన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ.. ‘గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. కోన గారు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. ఆయన ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా అన్న కోన గారు ఎంతో మందికి స్పూర్తి. టాలెంట్‌ను గుర్తిస్తారు. ప్రోత్సహిస్తారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయకు అంతా మంచే జరుగుతుంది. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది. ఎల్‌బిడబ్ల్యూ సినిమాను సిద్దుతో చేశాను. సిద్దుని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. వంద కాదు ఐదు వందల కోట్లు కొడతాడు. అంజలి 50 సినిమాలు చేయడం కాదు.. అద్భుతమైన సినిమాలు చేసింది. చాలా గొప్ప విషయం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.

హేమంత్ మధుకర్ మాట్లాడుతూ.. ‘అంజలి 50 సినిమాలు కంప్లీట్ చేశారు. ఇది ఆషామాషీ విషయం కాదు. అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ, అవార్డులు తీసుకుంటూ 50 సినిమాలు చేయడం గొప్ప విషయం. శివ తుర్లపాటి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమాను ఆయన అద్భుతంగా తీశారు. కోన గారితో నాకు 20 ఏళ్ల పరిచయం ఉంది. ఆయనకు సినిమాలంటే ఎంతో పిచ్చి. ఆయన పెద్ద సినిమా లవర్. ఈ మూవీ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వశిష్ట మాట్లాడుతూ.. ‘కోన గారు ఈ రోజు ఉదయమే కొత్త సినిమాను ప్రారంభించారు. ఇప్పుడు ఈ మూవీ ఈవెంట్‌ను చేస్తున్నారు. అంజలి గారితో నాకు 18 ఏళ్ల పరిచయం ఉంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సింగర్ సునీత మాట్లాడుతూ.. ‘కోన గారు చాలా పాజిటివ్ వ్యక్తి. గీతాంజలి వచ్చి పదేళ్లు అయిందని నమ్మాలని అనిపించడం లేదు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు సిద్దు వచ్చారు. తెలుగమ్మాయిగా అంజలి యాభై సినిమాలు చేసి మన అందరినీ గర్వించేలా చేశారు. ఈ మూవీ పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలవ్వడం ఆనందంగా ఉంది. ఈ మూవీని నేను చూశాను. ఈ చిత్రం నవ్విస్తుంది..కవ్విస్తుంది. ఏడ్పిస్తుంది.. భయపెడుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
%%footer%%