On the occasion of director Dasari Narayana Rao's birth anniversary, a grand Director's Day celebration will be held at LB Stadium in Hyderabad on May 4
Director Dasari Narayana Rao's birth anniversary will be celebrated on May 4th as Director's Day by the Telugu Film Directors Association. Director's Day has been celebrated four times so far, and this year marks the fifth grand celebration at Hyderabad's LB Stadium. The details of this event were outlined during the Directors Association's press meet.
Director Veera Shankar shared, "We celebrated the birth anniversary of Director Dasari Narayanarao for the first time at FNCC. Directors like Anil Ravipudi and Harish Shankar performed skits and contributed to the program's success, with Raghavendra Rao and Chiranjeevi attending as guests. Due to the pandemic, Director's Day was not celebrated for two years. Afterward, we organized the program again at FNCC. Now, for the fifth time, we are organizing Director's Day on a grand scale at LB Stadium. This is the first time the ceremony will be held in a stadium. Through this event, we aim to raise funds for initiatives like mid-day meals, construction of a new building for the association, and financial assistance for elderly directors. We have established a cultural committee to manage the program, including directors like Anil Ravipudi, Siva Nirvana, Nandini Reddy, Anudeep KV, and Vijay Kanakamedala. We expect up to 15,000 people to participate in this program. It's a pleasure to contribute 10 lakh rupees from the Baby Producer Directors Association. We invite everyone from the film industry to this event."
Director Nandini Reddy remarked, "This time, we are organizing Director's Day in a grand manner. I was surprised to hear the details of this event. It will be a benchmark event for the Telugu Directors Association. No matter how busy, I want everyone to participate in this program."
Director Sai Rajesh commented, "Director's Day celebrations on May 4th, marking Director Ratna Dasari's birth anniversary, will be grand. This program will mark a new era for the Telugu Film Directors Association. Hearing about this event, top directors like Trivikram and Sukumar have shown their support. We're meeting every hero in the industry, encouraging them to bring their families to the LB Stadium celebrations. Organizing such a significant event for the welfare of our association members is a joy."
Director Shiva Nirvana said, "Veera Shankar called me about the Director's Day event. He was very happy when explaining the purpose of this program. Not every director has a successful career; some face financial difficulties. We plan to use the funds from this program to support such individuals. All directors are coming together, and we request everyone in the industry to participate in Director's Day."
Director Raja Vannemreddy stated, "The current committee of our Directors Association is highly active. We also provide health insurance for our members' families. We're planning a grand Director's Day program, which has Lord Dasari's blessings."
Director Vashishta mentioned, "We aim to make the Director's Day celebrations as grand as the past Vajrotsavams. Our President Veera Shankar and General Secretary Subbareddy are organizing everyone efficiently. We were saddened that our association's program wasn't progressing like those in Karnataka and Tamil Nadu. This time, we're also planning to celebrate Director's Day grandly with this event."
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పటికి నాలుగుసార్లు డైరెక్టర్స్ డేను సెలబ్రేట్ చేశారు. ఈ ఏడాది ఐదవసారి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ వివరాలను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో
డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ- దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతిని మొదటిసారి ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా నిర్వహించాం. అప్పుడు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్స్ అంతా స్కిట్స్ చేసి ప్రోగ్రాం సక్సెస్ చేశారు. రాఘవేంద్రరావు, చిరంజీవి గారు అతిథులుగా పాల్గొన్నారు. కరోనా వల్ల రెండేళ్లు డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేయలేకపోయాం. ఆ తర్వాత మళ్లీ ఎఫ్ఎన్ సీసీలో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు ఐదోసారి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున డైరెక్టర్స్ డే నిర్వహించబోతున్నాం. ఇలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం మిడ్ డే మీల్స్, అసోసియేషన్ కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ప్రోగ్రామ్ నిర్వహణకు ఈసారి కల్చరర్ కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల వంటి డైరెక్టర్స్ ఉంటారు. 15 వేల మంది ప్రజలు దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. బేబి ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషకరం. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ నందినిరెడ్డి మాట్లాడుతూ- ఈసారి డైరెక్టర్స్ డేను గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ డీటెయిల్స్ విని నేను సర్ ప్రైజ్ అయ్యాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఇదొక బెంచ్ మార్క్ ఈవెంట్ కాబోతోంది. ఎంత బిజీగా ఉన్నా..ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నా. అన్నారు
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ - దర్శకరత్న దాసరి గారి జయంతి సందర్భంగా మే 4న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేయబోతున్నాం. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 2.ఓ అనుకునేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఈవెంట్ గురించి చెప్పగానే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో ప్రతి హీరోను కలుస్తున్నాం. వాళ్లంతా ఫ్యామిలీస్ తో కలిసి ఎల్బీ స్టేడియంలో జరగనున్న సెలబ్రేషన్స్ కు రావాలి. మన అసోసియేషన్ సభ్యుల సంక్షేమంతో పాటు ఇలాంటి బిగ్ ఈవెంట్స్ నిర్వహించడం సంతోషంగా ఉంది. అని అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే ఈవెంట్ గురించి వీరశంకర్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఈ కార్యక్రమం పర్పస్ ఆయన చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరు దర్శకుల కెరీర్ గొప్పగా ఉండదు. కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వారికి అండగా నిలబడేందుకు ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన ఫండ్ ను ఉపయోగించబోతున్నాం. డైరెక్టర్స్ అందరూ ముందుకొస్తున్నారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ డైరెక్టర్స్ డే ఈవెంట్ లో పాల్గొనాలని కోరుతున్నా. అన్నారు.
డైరెక్టర్ రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ- మన డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఇప్పుడున్న కమిటీ చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది. మన మెంబర్స్ ఫ్యామిలీస్ కు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. డైరెక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి దాసరి గారి ఆశీస్సులు ఉంటాయి. అన్నారు.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ - గతంలో వజ్రోత్సవాలు ఏ స్థాయిలో జరిగాయి అంత ఘనంగా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ను చేయబోతున్నాం. ఇందుకు మా ప్రెసిడెంట్ వీరశంకర్, జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారు బాగా అందరినీ ఆర్గనైజ్ చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తరహాలో మన అసోసియేషన్ ప్రోగ్రాం జరగడం లేదనే బాధ ఉండేది. ఈసారి ఈవెంట్ తో మనం కూడా ఘనంగా డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అన్నారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.