The blockbuster combination is back to complete hat-trick hits in their collaboration. Victory Venkatesh and blockbuster hit machine Anil Ravipudi will be teaming up again for a victorious hattrick, after delivering two hilarious hits- F2 and F3, with the prestigious Sri Venkateswara Creations backing it. Dil Raju will present, while Shirish will produce the movie which has been announced officially on the occasion of Ugadi.
After delivering 7 back-to-back blockbusters, Anil Ravipudi will be associating with Sri Venkateswara Creations for the 6th time for Production No. 58 of the banner. As announced through the video, this new film is an extraordinary triangular crime entertainer, revolving around three characters- the protagonist, his ex-girlfriend, and his excellent wife. The theme sounds crazy and guarantees never-before entertainment.
Given the trio delivered two blockbusters already, movie buffs have been waiting eagerly for another film in their combination. Furthermore, Anil Ravipudi and SVC are also a super-hit combination. This announcement will surely bring additional festival celebrations for the Telugu audience.
Dhamaka composer Bheems Ceciroleo is on board to score the music for this movie to be made on a big budget with high production and superlative technical standards.
More exciting details of the movie will be revealed soon. The makers have also announced to release of the movie during Sankranthi, 2025.
Cast: Victory Venkatesh
Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Presents: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Producer: Shirish
Music: Bheems Ceciroleo
PRO: Vamsi-Shekar
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 58 అనౌన్స్ మెంట్, 2025 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్
బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలిపింది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రెండు హిలేరియస్ హిట్‌లు F2 , F3 అందించిన తర్వాత హ్యాట్రిక్ కోసం మళ్లీ జతకట్టారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు.
7 బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 6వ సారి కలిసి ప్రొడక్షన్ నంబర్ 58లో అసోషియేట్ అవుతున్నారు. వీడియో ద్వారా అనౌన్స్ చేసినట్లుగా.. ఈ కొత్త చిత్రం ఒక ఎక్స్ ట్రార్డినరీ ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్‌టైనర్, ఇది మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది- హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్. థీమ్ చాలా క్రేజీ అనిపిస్తుంది. మునుపెన్నడూ లేని ఎంటర్ టైన్మెంట్ కు గ్యారెంటీ ఇస్తోంది.
ఈ ముగ్గురూ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి, SVC కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈ అనౌన్స్ మెంట్ తెలుగు ప్రేక్షకులకు పండుగ వేడుకలను రెట్టింపు చేసింది.
హై బడ్జెట్‌తో హ్యుజ్ కాన్వాస్ పై అత్యద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్న ఈ చిత్రానికి ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో తెలియజేస్తారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
తారాగణం: విక్టరీ వెంకటేష్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పీఆర్వో: వంశీ-శేఖర్
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.