“We have reached our target; the family audience are appreciating our Family Star- Team at Success Meet

"We have reached our target; the family audience are appreciating our Family Star- Team at Success Meet*

"The Vijay Devarakonda-starrer Family Star movie has hit theaters worldwide today and is receiving a super hit response from all over. The family audience is connecting well with this movie. Family Star is running with House Fulls in every theater of its release. The second show ticket bookings are filling up fast. In the backdrop of the success of Family Star, the film unit organized success celebrations. The female audience participated in this program and honored the team members of the Family Star."

"At this success meet, Producer Dil Raju said - Yesterday, we held a press meet for our Family Star movie with the families of media friends. We were eagerly awaiting the movie's release. Messages started coming from the US as early as four o'clock in the morning. He mentioned that family audiences are mostly going to theaters. Shows started at half-past seven in the morning in Hyderabad. I watched the movie at Sree Ramulu and Brahmarambha, Kukatpally. 90 percent of the youth audience were in the theater. I thought that the audience would respond well to every scene. The audience remained silent for ten minutes after the movie started. The response started from Mrunal's entry. After a while, they all got involved and started enjoying the movie. The first report from the US is superb. The second half was slow for a while, but from the pre-climax, it was very good again. However, when I watched it in Hyderabad, the entire hall was enjoying the film. They also liked the Vijay and Mrunal combo scenes in the second half. Overall, the movie Family Star has reached our target family audience. Family audiences are going to theaters in large crowds. The reviews from the media are consistent with this. The response from the family audience who watched the movie is different. 90 percent of them liked Family Star. That's why we asked the family audience who saw the movie to happily come and accept our team. We also accept the statements they give in their reviews, just as the media accepts the statements we give. After watching the media show, media friends who were in touch with me called and told me that they enjoyed watching Family Star with their family. The audience likes the emotion that we have shown between grandma and grandchild in the movie, and the emotion that we have shown between grandfather, children, and brothers. More families should watch the film, then they will also feel the feedback we received. Enjoy Family Star this summer. If you like the movie after watching it, tell others. We are going to identify the family stars who have brought their family to a great position in the two Telugu states and meet them from tomorrow. We have already selected three such families. Personally, Vijay, Parasuram, Mrunal, and I are going to go and surprise that family star."

Director Parasuram Petla said - "Family Star movie is released worldwide today. Audiences from all walks of life are sending messages saying that they like the movie. Whatever family emotions I strongly believed in and wrote the story, they reached the family audience. For every single family member who patiently works hard to make the family good, be it brother, mother, or father, I have made the film Family Star as a dedication to them. Those who have seen it, see it again. I want to take such a good movie to the society. Thanks for the good response."

Heroine Mrunal Thakur said - "Thanks to all the audience who made the movie Family star a success. I'm very happy. I watched the movie with the audience. They are feeling emotional, clapping, and laughing. I have done Indu role, Vijay done Govardhan character as well as grandmother, Vadina, and children characters are feeling the emotion in them. Thus I feel that I have justified my character. Both Indu and Govardhan are characters like you and me. As an actress sometimes you have to do soft characters and sometimes tough characters. I got a chance to show myself to the audience as an actress in Family Star. I cannot forget the media's support for our film for the past week. Watch the movie Family Star."

మా టార్గెట్ రీచ్ అయ్యాం, ఆణిముత్యం లాంటి ఫ్యామిలీ స్టార్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారు - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. రిలీజైన ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్స్ తో ఫ్యామిలీ స్టార్ రన్ అవుతోంది. నెక్ట్ షోస్ టికెట్ బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ కు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రేక్షకులు పాల్గొని ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్ మెంబర్స్ ను సత్కరించారు. ఈ సక్సెస్ మీట్ లో

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - నిన్న మీడియా మిత్రుల కుటుంబాలతో కలిసి మా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించాం. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశాం. ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్ స్ రావడం మొదలైంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్స్ కు వెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో మార్నింగ్ ఏడున్నరకు షోస్ మొదలయ్యాయి. నేను కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్ లో సినిమా చూశాను. 90 పర్సెంట్ యూత్ ఆడియెన్స్ థియేటర్ లో ఉన్నారు. నేను ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతారు అనుకున్నానో అదే జరిగింది. సినిమా మొదలైన పది నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్ గా ఉన్నారు. మృణాల్ ఎంట్రీ నుంచి రెస్పాన్స్ మొదలైంది. మరికాసేపటికి సినిమాలో వాళ్లంతా ఇన్వాల్వ్ అయి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. యూఎస్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఫస్టాఫ్ సూపర్బ్ గా ఉంది. సెకండాఫ్ కొంతసేపు స్లోగా ఉంది, ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ చాలా బాగుందని చెప్పారు. కానీ హైదరాబాద్ లో నేను చూస్తున్నప్పుడు సినిమా మొత్తం ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. సెకండాఫ్ లో విజయ్, మృణాల్ కాంబో సీన్స్ కూడా వారికి బాగా నచ్చాయి. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్ గా థియేటర్స్ కు వెళ్తున్నారు. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి. సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది. అందుకే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ మా టీమ్ కు సత్కారం చేస్తామంటే సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పాం. మేము ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియాలో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో వాళ్లు రివ్యూస్ లో ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మీడియా షో చూశాక నాతో టచ్ లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ చూసి ఎంజాయ్ చేశామని చెప్పారు. మేము సినిమాలో బామ్మకు మనవడికి మధ్య చూపించిన ఎమోషన్, , బాబాయ్, పిల్లలు, అన్నాదమ్ముల మధ్య చూపించిన ఎమోషన్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారు. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ ను ఎంజాయ్ చేయండి. సినిమా చూశాక మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తమ ఫ్యామిలీని గొప్ప పొజిషన్ లోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్ ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి రేపటి నుంచి వారిని కలవబోతున్నాం. ఇప్పటికే ఇలాంటి మూడు ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేశాం. పర్సనల్ గా నేను, విజయ్, పరశురామ్, మృణాల్ వెళ్లి ఆ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నాం. అన్నారు

దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ - ఫ్యామిలీ స్టార్ సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. నేను ఏ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బలంగా నమ్మి కథ రాశానో అవి ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యాయి. ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా. కుటుంబం బాగుండాలని ఓపికగా కష్టపడే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కు అది బ్రదర్ కావొచ్చు, మదర్ కావొచ్చు, ఫాదర్ కావొచ్చు..వారికి అంకితమిస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా రూపొందించాను. చూసిన వాళ్లు మళ్లీ చూడండి. ఇలాంటి మంచి సినిమాను సొసైటీలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ది గుడ్ రెస్పాన్స్. అన్నారు.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ - ఫ్యామిలీస్టార్ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఆడియెన్స్ తో కలిసి సినిమా చూశాను. వాళ్లు ఎమోషనల్ గా ఫీలవుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, నవ్వుతున్నారు. నేను చేసిన ఇందు, విజయ్ గోవర్థన్ క్యారెక్టర్స్ తో పాటు బామ్మ, వదిన, పిల్లల క్యారెక్టర్స్ ను వారిలోని ఎమోషన్ ను ఫీలవుతున్నారు. ఇందుగా నేను నా క్యారెక్టర్ కు జస్టిఫికేషన్ చేశానని భావిస్తున్నాను. ఇందు గోవర్థన్ రెండూ నువ్వా నేనా అనే లాంటి క్యారెక్టర్స్. నటిగా కొన్నిసార్లు సాఫ్ట్ క్యారెక్టర్స్, కొన్నిసార్లు టఫ్ క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ స్టార్ లో నటిగా నన్ను కొత్తగా ప్రేక్షకులకు చూపించే అవకాశం వచ్చింది. గత వారం రోజులుగా మీడియా మా సినిమాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేం. ఫ్యామిలీ స్టార్ సినిమాను మీరంతా చూడండి. అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%