ఏప్రిల్ 11న రిలీజ్ అవుతున్న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ మాకెంతో స్పెషల్.. మంచి ధమ్ బిర్యానీలా ఉంటుంది: కోన వెంకట్
అందాల నటి అంజలి 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది. హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..
ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘అంజలిగారికి ముందుగా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా తర్వాత ఆమె 50 నుంచి డబుల్ సెంచరీ వరకు వెళ్లిపోతుంది. అలాగే కోనగారి స్టైల్లో తెరకెక్కిన గీతాంజలి. డైరెక్టర్ శివ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇది టీమ్ అందరికీ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది.. డబుల్ ఎంటర్‌టైనర్, డబుల్ హారర్ ఎలిమెంట్స్‌తో మెప్పిస్తుంది. చాలా రోజుల నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం. అంజలిగారి 50వ సినిమా అని స్పెషల్ సాంగ్ చేశాం. త్వరలోనే సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా అంతకు మించి ఉంటుంది. అందరి సపోర్ట్‌తో ఇక్కడి వరకు చేరుకున్నాం. అంజలిగారికి ఇది 50వ సినిమా. ఆమెకు ఈ సందర్భంగా అభినందనలు. శీనన్న, రాజేషన్న, శంకర్, యాదంరాజు సహా అందరికీ థాంక్స్. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, ప్రవీణ్ లక్కరాజు మంచి మ్యూజిక్ తో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్. సినిమా చూసి ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
షకలక శంకర్ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్ లక్కరాజు చక్కటి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. గీతాంజలి సినిమా వచ్చి పదేళ్లు అవుతుంది. ఆ సినిమా అందరి మనసుల్లో అలాగే ఉండిపోతుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు చాలా రిస్క్ చేశాం. ఏప్రిల్ 11న రాబోతున్న ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్ చేయాలి. అంజలికి ఇది 50వ సినిమా. చాలా పెద్ద హిట్ చేసి ఆమెకు గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘‘గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను తీస్తారని అనుకోలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. మళ్లీ మా అందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుంది. ఈ సీక్వెల్ తొలి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా బాగా భయపెడుతుంది, నవ్విస్తుంది. అంజలికి 50వ సిినిమా ఇది. ఈ వయసలోనే ఆమె 50 సినిమాలను చేయటం అనేది గొప్ప విషయం. మరో పదేళ్లలో ఆమె మరో 50-100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్‌గారికి అభినందనలు’’ అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ మూవీలో నాది కోనగారి క్యారెక్టర్. నా పేరు చెనక్కాయల శీను. ఆయనలాగానే ఈ సినిమాలో కష్టపడుతుంటాను. గీతాంజలి సినిమాతో మా అందరికీ ఓ మెట్టు ఎక్కే అవకాశం దక్కింది. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రంతో మరో మెట్టు ఎక్కే అవకాశం దక్కింది. అంజలిగారికి అభినందనలు. తను 50 సినిమాలు పూర్తి చేయటం గొప్ప విషయం. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాను చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. డైరెక్టర్ శివగారికి, ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు సహా అందరరికీ థాంక్స్’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘గీతాంజలి మాకెంతో స్పెషల్ మూవీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇంకా చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే ఇది అంజలికి 50వ సినిమా. ఆమెను అభినందించాల్సిందే. ఓ తెలుగు అమ్మాయి 50 సినిమాలు చేయడటమంటే గొప్ప విషయం. ఇప్పుడింకా గొప్పగా రాబోతుంది. గీతాంజలి ఐడియాను నా దగ్గరకు తెచ్చింది శ్రీనివాస్ రెడ్డినే. ఆ సినిమా సక్సెస్ మా టీమ్‌ను కలిపింది. నేను 55 సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాను. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది మాత్రం భాను, నందు. సామజవరగమన, భైరవకోన సినిమాలకు వాళ్లు వర్క్ చేశారు. ఈ స్క్రిప్ట్ లో కీలక పాత్రను పోషించారు. కథను నేనిచ్చినా వాళ్లు దాన్ని 10 మెట్లు ముందుకు తీసుకెళ్లారు. ప్రవీణ్ లక్కరాజుని జూనియర్ తమన్ అని పిలుస్తుంటాం. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఛోటా కె.ప్రసాద్ చాలా కీలక పాత్రను పోషించాడు. డైరెక్టర్ శివకి ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది. ఏప్రిల్ 11న మూవీని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ట్రైలర్‌లో చూసింది కొంతే.. సినిమా ధమ్ బిర్యానీలా ఉంటుంది’’ అన్నారు.
రైటర్, దర్శకుడు బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాను నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ఆ నమ్మకంతోనే ఇక్కడకు వచ్చాను. తొలి సినిమాలో ఎలా ఉందో 50 సినిమాలు పూర్తయినప్పటికీ అలాగే ఉంది. చాలా కష్టపడే నటి. తను ఇండస్ట్రీలో ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. శివ తుర్లపాటికి అభినందనలు. ఛోటా కె.ప్రసాద్ సహా టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘శివ తుర్లపాటిగారి వల్లనే నా సినీ జర్నీ మొదలైంది. ఆయనే నన్ను కోనగారికి పరిచయం చేశారు. ఇప్పుడు శివ డైరెక్టర్ గా మారాడు. తను వరుస బెట్టి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంజలిగారి 50వ సినిమా ఇది. ఈ విషయం తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పట్లో ఓ తెలుగు అమ్మాయి ఇన్ని సినిమాలు చేయటం గొప్ప విషయం. ఆమె ఎన్నో డిఫరెంట్ సినిమాలు, రోల్స్ చేశారు. గీతాంజలి పదేళ్ల ముందు ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది రిలీజ్ అవుతుంది. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారనటంలో సందేహం లేదు. ఈ సినిమాతో శివను ఇంట్రడ్యూస్ చేసిన కోనగారికి ఈ సినిమా సక్సెస్ కొత్త ఎనర్జీని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత డివివి.దానయ్య మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. గీతాంజలి కంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
అంజలి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సినిమా దీని కంటే వంద రెట్లు బావుంటుంది. నా 50వ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. ఆ కోరిక గీతాంజలి మళ్ళీ వచ్చిందితో తీరింది. నా ఎంటైర్ టీమ్ మనసు పెట్టి ఈ మూవీ చేశారు. అందరూ ఎంటర్ టైన్ కావాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. కోన వెంకట్ గారికి థాంక్స్. స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాం. త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తాం. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్ అవుతుంది. కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి చేసిన సినిమా. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
నటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు.
సాంకేతిక బృందం:
కథ: కోన వెంకట్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, భాను భోగవరపు
సాహిత్యం: భాను భోగవరపు, నందు సవారిగాన
దర్శకుడు: శివ తుర్లపాటి
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కెమెరా: సుజాత సిద్ధార్థ
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కళ: నార్ని శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగు వై
PRO: వంశీ కాకా
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను.
Geethanjali Malli Vachindhi will be like a Dum Biryani, this special film releasing on April 11th: Kona Venkat at trailer launch
It is known that the beautiful actress Anjali's "Geethanjali" has become a trendsetter. Currently, everyone's attention is on the movie "Geethanjali Malli Vachindhi". The film, directed by Siva Thurlapati and produced by Kona Venkat under Kona Films Corporation in association with MVV Cinemas, marks Anjali's 50th film, making it special for her. The big-budget horror-comedy film 'Geethanjali Malli Vachindhi' is set to release on April 11. Today makers released the trailer of this movie on Wednesday. On this occasion,
Editor Chota K. Prasad said, "First, I congratulate Anjali. After this movie, she will go from 50 to a double century mark. Also, 'Geethanjali' was shot in Konagari style. Director Shiva has directed the movie brilliantly, giving a new experience to the entire team."
Music director Praveen Lakkaraju said, "Geethanjali Malli Vachindhi is coming with double the entertainment and horror elements. I have been working on the background score for many days. We are confident that everyone will like it. We did a special song for Anjali's 50th movie. The film will be released on April 11th."
Director Shiva Thurlapati said that the trailer of "Geethanjali Malli Vachindhi" will be liked by everyone and the movie goes beyond that. "We have reached here with everyone's support. This is Anjali's 50th film. Congratulations to her. Thanks to everyone, including Seenanna, Rajesh anna, Shankar, Yadamraju. Editor Chota K. Prasad and Praveen Lakkaraju have provided a good background score along with good music. The movie releases on April 11. We hope that audiences will be captivated after watching the movie."
Shakalaka Shankar said, "Praveen Lakkaraju has provided good music and background score. It has been ten years since the release of 'Geethanjali'. There is no doubt that the movie will remain in everyone's mind. Now Geethanjali Malli Vachindhi; we have taken a lot of risk for the film. Everyone should make this movie a big success, which is coming on April 11. This is Anjali's 50th film. I want to everyons make it a big hit and give her a memorable gift."
Satyam Rajesh said, "I did not think that Geethanjali Malli Vachindhi as a sequel to the movie 'Geethanjali'. The movie did very well. Again, it will be a movie that will bring us all a very good name. The second part of this sequel scares and makes us laugh even more than the first part. This is Anjali's 50th film. It is a great thing that she has completed 50 films at this age. I want her to do another 50 to 100 films in ten years. Congratulations to Kona Venkat."
Srinivas Reddy said, "My character is like Kona garu in this movie. My name is Chenakkayala Seenu. Like him, I will work hard in this film. With the movie Geethanjali, we all got a chance to take a step forward. Now Geethanjali Malli Vachindhi, we got a chance to climb another step. Congratulations Anjali garu. It is a great thing that she has completed 50 films. The movie will release on April 11. We want you to see the film and make it a big success. Thanks to director Shiva garu, editor, music director and everyone.
Presenter Kona Venkat said, “'Geethanjali' is a special movie, and 'Geethanjali Malli Vachindhi' is a very special movie because this is Anjali's 50th film. She deserves our applause. A Telugu girl completing 50 films is a great achievement. Great things are to come. It was Srinivas Reddy who brought the idea of 'Geethanjali' to me. The success of that film brought our team together. I have worked as a writer for 55 films, all appreciated by the audience. Bhanu and Nandu took this movie to the next level. They worked for the movies 'Samajavaragamana' and 'Bhairavakona' and played a key role in this script. Even though I gave the story, they advanced it by ten steps. Praveen Lakkaraju, known as Junior Thaman, gave good music. Chota K. Prasad played a very important role. This will be the best movie for director Shiva. We are releasing the movie on April 11. We definitely want everyone to see the movie. The movie will be like 'Dum Biryani'."
Writer and director BVS Ravi said that I have seen 'Geethanjali Malli Vachindhi.' It came out very well. I came here with that belief. The way she was in the first movie is still the same even after completing 50 movies. A very hardworking actress. She will rise to great heights in the industry. The music and background score provided by Praveen Lakkaraju are next level. The movie will be a grand success. Congratulations to Shiva Turlapati. All the best to the team, including Chota K. Prasad.
Director Shiva Nirvana said, "My film journey started because of Shiva Thurlapati. He introduced me to Kona garu. Now Shiva has become a director. I want him to do a series of better films. This is Anjali's 50th film. I was surprised to know this. It's great that a Telugu girl is doing so many films these days. She has done many different films and roles. 'Geethanjali' created a sensation ten years ago. Now, Geethanjali Malli Vachindhi will become a blockbuster for sure. I want the success of this film to give new energy to Kona garu, who introduced Shiva with this film.
Producer DVV Danayya said that the trailer of "Geethanjali Malli Vachindhi" is amazing. I want this film to be a bigger hit than 'Geethanjali.' I want Kona Venkat to get a good name with this movie.
Anjali said that the trailer of "Geethanjali Malli Vachindhi" was very good. The movie is hundred times better than this. I wanted my 50th film to be very special. That wish was fulfilled with 'Geethanjali Malli Vachindhi.' My entire team made this movie with their heart. We made the film intending to entertain everyone. Thanks to Kona Venkat garu. We also shot a special song. We will release it soon. The movie will release on April 11. The movie is a mix of comedy and horror elements. Thanks to everyone who supported.
Actors: Anjali, Srinivas Reddy, Satyam Rajesh, Satya, Shakalaka Shankar, Ali, Brahmaji, Ravi Shankar, Rahul Madhav, and others.
Technical team:
Story: Kona Venkat
Screenplay: Kona Venkat, Bhanu Bhogavarapu
Lyrics: Bhanu Bhogavarapu, Nandu Savarigana
Director: Shiva Thurlapati
Music: Praveen Lakkaraju
Camera: Sujatha Siddhartha
Editor: Chota K. Prasad
Art: Narni Srinivas
Executive Producer: Nagu Y.
PRO: Vamsi Kaka
Publicity Designer: Anil Bhanu.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.