The release of "Manjummel Boys" in Telugu by the Mythri Movie Makers Is A Matter Of Pride. "Manjummel Boys" connects well with Telugu audiences: Director Chidambaram S Poduval
Manjummel Boys has become the first Malayalam film to have collected over 200 crore at the box office. It's a survival thriller that beautifully depicts a tale of friendship amidst the chaos of life, inspired by real events and filled with quality performances. Chidambaram S Poduval directed this film, with Sobin Shahir, Ganapathi, Khalid Rahman, and Sreenath Bhasi in the lead roles. Pan India production house Mythri Movie Makers is bringing this Indian box office sensation to Telugu audiences. On April 6th, Mythri Movie Makers production and distribution company is releasing this film as a summer special in Andhra Pradesh and Telangana. Here are the excerpts from the interview with director Chidambaram S Poduval.
Congratulations, Chidambaram S Poduval! Your biggest blockbuster has rewritten box office records in Malayalam!
-Thank you. It received a great response from Malayalam audiences. It brought much joy to our team.
Did you anticipate collecting 200 crore before the movie's release?
-No, not really! We made a good film. We believe in the content. We hoped this film becomes a big hit. However, we didn't anticipate a collection of 200 crore. We didn't make the film for collections. Neither I, nor the producers, nor the cameraman, nor the music director ever thought about collections.
When did the idea of making "Manjummel Boys" come to you?
-My first film "Jan.E.Man" was released in 2021. After that, I got to know about the incident that happened to some friends from Kerala who went to Guna Caves. Their stories, and friendship, excited me. Since then, I started working on it.
Did you personally meet Manjummel Boys? What kind of research underwent to make the movie?
-Yes, I did. Everyone shared their life experiences. I understood that their story has the required material to make a movie. I concluded that this is a story that needs to be told to people. They excitedly agreed to share their story for the film.
Your first film "Jan.E.Man" was released on November 19, 2021, and "Manjummel Boys" on February 22nd. It took almost three years for your second film to release.
- Writing stories based on real incidents is a tough process. It took me a year and a half to write the script of 'Manjummel Boys'. We spent six months on pre-production work. Then we spent another six months on post-production work. It's been quite a journey for each process.
You've shot a lot on real locations and also built sets for some scenes! Tell us about that process.
-Almost all the scenes that needed authenticity, like the road trip, and cave scenes, were shot in real locations. We built sets for scenes to be shot inside the cave. The set work took about four months. Shooting was relatively easy. We were like a family, roaming and playing in real locations while making the movie.
Your brother also acted in the movie! So, it was like a family trip!
-(Laughs) My brother Ganapathi S Poduval played the role of Dr. Faisal. It was a great experience working with him and producer Sobin Shahir. Our family also joined us for shooting. We'd sit around and share stories every night. We really enjoyed making the film.
"Manjummel Boys" is not a typical commercial format film. How did you convince Sobin Shahir and the producers?
- Sobin Shahir traveled with me, ever since the research work and script writing began. So, convincing him wasn't difficult. He wanted to produce the movie. He identified the spark in the story. But as you mentioned, it's not a regular format film. Otherwise, it would've been a bigger film.
About the cinematography and music...
-Shaheer Khaleel is one of the best cinematographers in Kerala. He has done many beautiful films. It's our fortune that he worked on our film. Sushin Shyam didn't use much electronic music. He gave us what we needed for a survival thriller.
You used a song from Guna as a tribute to Kamal Haasan. When you thought of making the film, did you consider using that song?
Yes, indeed. The song from 'Guna' comes to our mind first when we think of Guna Caves. It sets the tone for a friendship story. That's why we used it.
Did Kamal Haasan watch the film? How was your meeting with him?
The entire team is a fan of Kamal sir. Meeting him was a magical moment for us. I really gave us great joy, when he said that he really liked the film. It was nothing short of receiving a big award. We are thankful to Kamal sir for spending his valuable time with us.
Do you like to work with Kamal Haasan in a film?
Directing Kamal Haasan is every director's dream. If that opportunity comes, who would refuse it?
Do you have any ideas for a film with Kamal Haasan?
I have many ideas. But the writing part is a tough process. We can’t say what happens in the future.
Pan India production house Mythri Movie Makers is releasing 'Manjummel Boys' in Telugu. Tell us about their support.
Mythri Movie Makers is equally popular in Malayalam. They made the blockbuster 'Pushpa'. I've spoken with Mythri Ravi sir. I'm very happy and proud that our film will be released through their banner. Our film got great support. I couldn't have asked for more.
On April 6th, a film is releasing in Telugu. What would you like to say to Telugu audiences?
We watch a lot of Telugu films in Kerala. Malayalis love Telugu films. Allu Arjun has a huge fan base in Kerala. I hope the excitement that 'Manjummel Boys' generated in Malayalam will repeat in Telugu as well. I'm confident Telugu audiences will enjoy the film.
If the opportunity arises, which hero would you choose to work with in Telugu?
There are many heroes I admire in Telugu. I won't name just one. There's Chiranjeevi garu, Balayya garu, Allu Arjun garu, Mahesh Babu garu, NTR garu, Ram Charan garu... There are different actors. I'm excited to work with all of them.
Your next film?
Not decided yet.
All the best!
Thank you.
'మంజుమ్మల్ బాయ్స్'ను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తుండటం గర్వంగా, సంతోషంగా ఉంది. 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుంది: డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ ఇంటర్వ్యూ
బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ''మంజుమ్మల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఇది యాదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగు హక్కులు సొంతం చేసుకుంది. ఏప్రిల్ 6న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిదంబరంతో స్పెషల్ ఇంటర్వ్యూ...
కంగ్రాచులేషన్స్ చిదంబరం ఎస్ పొదువల్ గారు... మీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మలయాళంలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది!
-థాంక్యూ అండీ. మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అది మా టీం అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
సినిమా విడుదలకు ముందు రూ. 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊహించారా?
-లేదండీ! మేం మంచి సినిమా తీశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అయితే, రూ. 200 కోట్ల కలెక్షన్లు వస్తాయని అసలు ఊహించలేదు. కలెక్షన్స్ కోసం మేం సినిమా తీయలేదు. నేను గానీ, నిర్మాతలు గానీ, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ గానీ కలెక్షన్స్ గురించి అసలు ఆలోచించలేదు.
'మంజుమ్మెల్ బాయ్స్' తీయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?
-నా ఫస్ట్ సినిమా 'జానెమన్' 2021లో విడుదలైంది. ఆ తర్వాత కేరళలో కొందరు స్నేహితులు గుణ కేవ్స్‌కి వెళ్లారని, ఈ సంఘటన జరిగిందని నాకు తెలిసింది. ఆ స్నేహితుల కథ, వాళ్ల స్నేహం నన్ను ఎగ్జైట్ చేసింది. అప్పట్నుంచి వర్క్ స్టార్ట్ చేశాను.
రియల్ 'మంజుమ్మెల్ బాయ్స్'ను మీరు కలిశారా? స్క్రిప్ట్ కోసం ఎటువంటి రీసెర్చ్ చేశారు?
-అవును. నేను వాళ్లను కలిశా. ఆల్రెడీ నేనొక సినిమా చేశానని చెప్పారు. అందరూ తమ తమ జీవితాల్లో ఏం జరిగిందో వివరించారు. సినిమాకు కావాల్సిన మెటీరియల్ ఉందని అర్థమైంది. 'ఇది ప్రజలకు చెప్పాల్సిన కథ. సినిమా తీయాలి' అన్నాను. వాళ్ల కథను సినిమా తీస్తానని చెప్పేసరికి ఎగ్జైట్ అయ్యారు.
మీ ఫస్ట్ సినిమా 'జాన్ ఈ మన్' నవంబర్ 19, 2021లో విడుదల అయితే 'మంజుమ్మెల్ బాయ్స్' ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ మూడేళ్లు పట్టినట్టు ఉంది?
-రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథలు రాయడం టఫ్ ప్రాసెస్. 'మంజుమ్మెల్ బాయ్స్' స్క్రిప్ట్ రాయడానికి నాకు ఏడాది, ఏడాదిన్నర పట్టింది. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలు తీసుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం మరో ఆరు నెలలు పట్టింది. సినిమా తీసే ప్రతి ప్రాసెస్ నేను ఎంజాయ్ చేశా.
రియల్ లొకేషన్స్‌లో కొంత, సెట్స్ వేసి కొంత సినిమా తీశారు! ఆ ప్రాసెస్ గురించి...
-'మంజుమ్మెల్ బాయ్స్' గుణ కేవ్స్ వెళ్లే వరకు ఆ కొడైకెనాల్ ట్రిప్, కేప్స్ అవుట్ సైడ్ సీన్స్ అన్నీ రియల్ లొకేషన్స్‌లో తీశాం. కేవ్స్ లోపల సీన్స్ కోసం సెట్స్ వేశాం. ఆ సెట్ వర్క్ కోసం నాలుగు నెలలు పట్టింది. షూటింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది. మేమంతా కలిసి టూర్ వెళ్లినట్టు రియల్ లొకేషన్స్‌లో ఆడుతూ పాడుతూ సినిమా చేశాం.
సినిమాలో మీ అన్నయ్య నటించారు కూడా! సో, ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట!
-(నవ్వుతూ...) డాక్టర్ ఫైజల్ రోల్ చేసిన గణపతి ఎస్ పొదువల్ నా బ్రదర్. యాక్టర్, ప్రొడ్యూసర్ సౌబిన్ షాహిర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. షూటింగ్ దగ్గరకు మా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ప్రతి రోజూ రాత్రి బాన్ ఫైర్ (చలిమంట) వేసేవాళ్ళం. అందరం కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. జీవితంలో మళ్లీ అటువంటి రోజులు వస్తాయో, రావో! మేమంతా అంత ఎంజాయ్ చేశాం. సినిమా ప్రాసెస్ అంతా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. గుణ కేవ్స్‌కు తొలిసారి వెళ్లడం కూడా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్.
'మంజుమ్మెల్ బాయ్స్' టిపికల్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదు. సౌబిన్ షాహిర్, నిర్మాతలను ఎలా కన్వీన్స్ చేశారు?
-'మంజుమ్మెల్ బాయ్స్' రీసెర్చ్, రైటింగ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి సౌబిన్ షాహిర్ నాతో ట్రావెల్ అయ్యారు. సో, ఆయన్ను కన్వీన్స్ చేయడం కష్టం ఏమీ కాలేదు. ఆయన ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కథలో స్పార్క్ ఆయన గుర్తించారు. అయితే మీరు చెప్పినట్టు రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. కాకపోతే మాది పెద్ద సినిమాయే.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ గురించి...
-కేరళలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో షైజు కాలిద్ ఒకరు. ఆయన ఎన్నో బ్యూటిఫుల్ సినిమాలు చేశారు. మా సినిమాకు ఆయన వర్క్ చేయడం మా అదృష్టం. మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఎక్కువ వాడలేదు. సర్వైవల్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఆర్ఆర్ ఇచ్చారు.
లోకనాయకుడు కమల్ హాసన్ గారి 'గుణ'లోని 'కన్మణి అన్‌బోతు' పాటకు 'మంజుమ్మెల్ బాయ్స్' ట్రిబ్యూట్ అని చెప్పాలి. సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఆ సాంగ్ యూజ్ చేయాలని అనుకున్నారా?
అవును అండీ. గుణ కేవ్స్ అంటే ముందుగా 'కన్మణి...' సాంగ్ గుర్తొస్తుంది. ఫ్రెండ్షిప్ స్టోరీకి సెట్ అవుతుంది. అందుకే ఉపయోగించాం.
కమల్ హాసన్ గారు సినిమా చూశారు. మీరు, టీం ఆయన్ను కలిశారు. కమల్ గారు ఏమన్నారు?
-మా సినిమా టీమ్ అంతా కమల్ సార్ ఫ్యాన్స్. ఆయన్ను కలవడం మాకొక మేజికల్ మూమెంట్. 'నాకు సినిమా బాగా నచ్చింది' అని కమల్ సార్ చెప్పడం ఇంకా ఇంకా సంతోషం. అది పెద్ద అవార్డుతో సమానం. మమ్మల్ని ఆహ్వానించి, మాతో విలువైన సమయాన్ని గడిపిన కమల్ గారికి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
కమల్ హాసన్ గారితో మీరు సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా?
-కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేయాలనేది ప్రతి ఒక్క డైరెక్టర్ డ్రీం. ఆ అవకాశం వస్తే ఎవరు కాదంటారు?
కమల్ హాసన్ గారితో సినిమాకు మీ దగ్గర ఐడియాస్ ఏమైనా ఉన్నాయా?
-అఫ్ కోర్స్... చాలా ఐడియాస్ ఉన్నాయి. అయితే, రైటింగ్ పార్ట్ టఫ్ ప్రాసెస్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేను.
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో 'మంజుమ్మెల్ బాయ్స్' విడుదల చేస్తోంది. వాళ్ళ గురించి...?
-మైత్రీ మూవీ మేకర్స్ గురించి మలయాళంలో కూడా తెలుసు. 'పుష్ప' చేశారు కదా! మైత్రీ రవి గారితో నేను మాట్లాడాను. తెలుగులో ఆ సంస్థ ద్వారా సినిమా విడుదల కావడం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మా సినిమాకు మంచి సపోర్ట్ దొరికింది. ఇంత కంటే బెస్ట్ నేను ఆశించలేను.
ఏప్రిల్ 6న తెలుగులో సినిమా విడుదల అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు మీరేం చెప్పాలని అనుకుంటున్నారు?
-కేరళలో మేం తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తాం. మలయాళీలకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారికి కేరళలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో 'మంజుమ్మెల్ బాయ్స్'కు వచ్చిన స్పందన తెలుగులో కూడా వస్తుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది.
అవకాశం వస్తే తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తారు?
-తెలుగులో నాకు ఇష్టమైన హీరోలు చాలా మంది ఉన్నారు. ఒక్కరి పేరు చెప్పలేను. చిరంజీవి గారు, బాలయ్య గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు... డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్లందరితో సినిమా చేయడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను.
మీ నెక్స్ట్ సినిమా?
-ఇంకా డిసైడ్ అవ్వలేదు.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
[attach 1]
[attach 2]
[attach 3]
[attach 4]
[attach 5]
[attach 6]
[attach 7]
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.