Thrilled that Tillu Square is working for audiences more than DJ Tillu, team shares at success meet

మొదటి షో నుంచే 'టిల్లు స్క్వేర్' సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం

'టిల్లు స్క్వేర్' వంద కోట్లు వసూలు చేస్తుంది : చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో 'టిల్లు స్క్వేర్' సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయానందంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. " ముందుగా నేను నిర్మాత నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి, ఇలాంటి సబ్జెక్టుని నమ్మి, మంచి బడ్జెట్ తో 'డీజీ టిల్లు' చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారు. టిల్లు స్క్వేర్ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసు. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగాను. ఇప్పుడు చెబుతున్నాను ఈ సినిమా అదిరిపోయింది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అన్నారు.

కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది" అన్నారు.

దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. "మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు." అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నాను." అన్నారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Star Boy and actor-writer Siddhu Jonnalagadda paired up with Anupama Parameswaran for Tillu Square, the sequel to DJ Tillu, which hit theatres today. Directed by Mallik Ram, the film, produced by S Naga Vamsi under Sithara Entertainments and presented by Srikara Studios, has released to overwhelming responses worldwide.

Commemorating its success, the team came together for a success meet today.

Director Mallik Ram shared, “I am very happy with the response. We’ve been getting congratulatory calls all over the world. People are liking the characters, the world and it’s great to see the glowing reviews.”

Anupama Parameswaran said, “It has been a long journey and a rollercoaster ride of emotions and I’m happy with the response. I don’t know how to thank my team and audiences enough. I am grateful for the team for standing by my lows. Neha Shetty, the Radhika of DJ Tillu, called and appreciated my performance. I didn’t want to make the mistake of missing out on this character.”

Siddhu Jonnalagadda stated, “I thank my producers, Trivikram for believing us. It’s their trust that helped us all along. I was silent during promotions because I wanted the film to speak. We cast Anupama for the value she brought as a performer. She elevated the role. I wanted to be honest to the script as a writer first and treated it as an individual film, without downplaying the impact of DJ Tillu. Tillu is like a vulnerable time bomb and he gets ample scope to shine here.”

Producer S Naga Vamsi mentioned, “I am confident that it’ll touch Rs 100 crore gross, going by the response. It’s a character audiences love getting back to. This is the right film to watch this summer and we have a long run ahead. We’re expecting Rs 25 crore gross on day one. We want to do Tillu 3 as soon as possible.”

“We are so glad to hear crowds tell that the second part worked for them better than the first and it’s a testimony to the effort we have put in,” actor Praneeth Reddy, composer Bheems Ceciroleo and others at the event shared.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%