You will enjoy the whole summer watching “Family Star” in theatres – Producer Dil Raju and Director Parashuram Petla at the trailer release event

You will enjoy the whole summer watching "Family Star" in theatres - Producer Dil Raju and Director Parashuram Petla at the trailer release event

Star hero Vijay Devarakonda's movie trailer release event was held at Sree ramulu Theater in Moosapet, Hyderabad. Dil Raju is the producer of the film and he participated in the event along with director Parasuram Petla. The trailer of the movie "Family Star" was released amidst the celebrations of the audience. On this occasion,

Director Parasuram Petla said - I want to say only one thing about the movie "Family Star". Every Telugu audience and every Telugu family will remember this movie, hero Vijay Devarakonda, and heroine Mrunal Thakur for years. Watch this movie comfortably in theaters on April 5. This movie is like an eye feast. Vijay, Mrunal Characters, Visuals, Music, Emotion, Entertainment, will impress you.

Producer Dil Raju said - Recently I gave a small hint about Family Star movie. The plot of the movie is that every person who tries to bring his family up is a family star. After watching this movie, you will want to become a family star. There are only seven days left for the release of the movie, and we are coming on April 5 to watch the morning show at Sree Ramulu Theatre. On that day, all of you will watch the movie laughing in the theater. Parasuram and Vijay are working together after Geetha Govindam. Parashuram designed Vijay's character very carefully imbibing class, mass, youthful, entertainment, and emotion. Vijay's character is very special. The lighter vein comedy in Parasuram's films is impressive. Family star will impress you a lot in the summer. 21 years ago on April 5th, I became Dil Raju as a producer with the movie Dil. Now after 21 years, the movie Family Star is releasing on the same day. Family Star has a story that is universally loved by all, regardless of mass, class, youth, or family.

If you look at the trailer of Family Star - the trailer is cool family, love entertainer, and impressive. It seems from the trailer that the movie "Family Star" is going to be enjoyed by the audience of all sections with all the commercial elements. Vijay Devarakonda and Mrunal Thakur impressed with their performances in the characters. The chemistry between Vijay and Mrunal is good. Director Parasuram Petla has once again shown his specialty in making wholesome family entertainers. "Family Star" made an impression trailer that is sure summer blockbuster. The movie "Family Star" is produced by star producers Dil Raju and Shirish under the banner of prestigious production house Sri Venkateswara Creations. This movie is made by director Parasuram Petla as a wholesome entertainer. Vasu Varma is acting as the creative producer of the movie "Family Star". This movie is going to be brought to a grand theatrical release on April 5.

Actors: Vijay Devarakonda, Mrinal Thakur, and others

Technical team
Cinematography: KU Mohanan
Music: Gopisunder
Art Director: AS Prakash
Editor: Marthand K Venkatesh
PRO: GSK Media, Vamsi Kaka
Creative Producer: Vasu Varma
Producers: Raju - Sirish Written and
directed by Parasuram Petla

"ఫ్యామిలీ స్టార్" సినిమా చూస్తూ సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు - ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురామ్ పెట్ల

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురామ్ పెట్ల పాల్గొన్నారు. ప్రేక్షకుల సందడి మధ్య "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ - "ఫ్యామిలీ స్టార్" సినిమా గురించి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్ లో హాయిగా చూడండి. ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. విజయ్, మృణాల్ క్యారెక్టర్స్, విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ..వంటి అన్ని అంశాలు మీకు నచ్చేలా ఉంటాయి. థియేటర్ లో మిమ్మల్ని కలుస్తాను. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఈ మధ్య చిన్న హింట్ ఇచ్చాను. తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి సినిమా రిలీజ్ కు మేము ఇదే శ్రీరాములు థియేటర్ లో మార్నింగ్ షో చూసేందుకు ఏప్రిల్ 5న వస్తాం. ఆ రోజు థియేటర్ లో మీ అందరూ నవ్వుతూ సినిమా చూస్తుంటారు. గీత గోవిందం తర్వాత పరశురామ్, విజయ్ కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ ను క్లాస్, మాస్, యూత్ ఫుల్, ఎంటర్ టైనింగ్, ఎమోషన్ తో పరశురామ్ డిజైన్ చేశాడు. విజయ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. పరశురామ్ సినిమాల్లో లైటర్ వేన్ కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే తరహాలో నవ్విస్తాడు. సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 5న దిల్ సినిమాతో నేను నిర్మాతగా దిల్ రాజుగా మారాను. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే రోజున ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది. మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుందీ సినిమా. మాస్, క్లాస్, యూత్ అ, ఫ్యామిలీ అనే తేడాలు లేకుండా యూనివర్సల్ గా అందరికీ నచ్చే కథ ఫ్యామిలీ స్టార్ లో ఉంది. ఒక సూపర్ హిట్ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాం. అన్నారు.

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూస్తే - ట్రైలర్ కూల్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా ఉండి ఆకట్టుకుంటోంది. హీరోయిజం, ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్, హ్యూమర్, యాక్షన్ ..అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా "ఫ్యామిలీ స్టార్" సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సివిల్ ఇంజినీర్ గోవర్థన్ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ, ఇందుగా మృణాల్ ఠాకూర్ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. విజయ్, మృణాల్ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది. డైరెక్టర్ పరశురామ్ పెట్ల హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చూపించారు. "ఫ్యామిలీ స్టార్" ష్యూర్ సమ్మర్ బ్లాక్ బస్టర్ అనే ఇంప్రెషన్ ట్రైలర్ కలిగించింది. "ఫ్యామిలీ స్టార్" సినిమా మీదున్న హైప్ కు తగినట్లు ట్రైలర్ కట్ చేశారు. కథను ఏమాత్రం మిస్ లీడ్ చేయకుండా ట్రైలర్ ఉండటం మరో విశేషం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటి టెక్నికల్ అంశాల్లో "ఫ్యామిలీ స్టార్" ట్రైలర్ టాప్ క్వాలిటీతో కనిపిస్తోంది.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల

https://youtu.be/xB7b3RzicUU

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%