"Family Star" reminds us of the family values we have forgotten - cinematographer KU Mohanan
DOP KU Mohanan is recognized as one of the top Indian cinematographers. Along with Bollywood super hits like Don, Talash, and Andhadhun, he also provided cinematography for Mahesh Babu's Maharshi in Telugu. KU Mohanan's latest movie in Telugu is with hero Vijay Devarakonda's "Family Star". Produced by star producers Dil Raju and Shirish under the banner Sri Venkateswara Creations, the film is directed by Parasuram Petla. Vasu Varma is acting as the creative producer of this movie. Mrunal Thakur acted as the heroine. The movie "Family Star" is going to get a grand theatrical release on 5th April. In this background, cinematographer KU Mohanan shared his experience of working on the film.
"I learned about cinematography in film school. All I have to do with the camera is formal training. I learned some more things by watching World Cinema. I have been watching Telugu movies for many years. At that time I used to watch Krishna's films and mythological films. All of us are basically commercial, larger than life movies. That's why we want visuals to be more natural in terms of cinematography. Since cinematography is a skill, it has an aesthetic sense. There is a visual sense. We apply it depending on the project and film. I use new equipment for films only if it is necessary. I never tried to say that I used this new lens and got this new camera. They tell me to take only what kind of visuals are required for that film and what equipment is required for it.
"Family Star" movie is a beautiful movie. A story of a middle-class man. What he did for the family is with a good message. We shot in the colony set. I have made the visuals to reflect how natural the story and characters are. No drone shots. No unnecessary visual shots were taken for the family star. The lighting is natural too. But while watching the movie, the visuals look as beautiful as they should be. If we see a middle-class house on the screen..it seems like our house. Director Parasuram has created the background of this movie in a simple setup. Vijay and Mrunal supported me a lot. Film is teamwork so artists and other crew support each other."
He continued, "Family Star is a movie that talks about family values which we are neglecting. Entire India has become nuclear families. Family reunion is not happening. This is a movie that discusses about our old family values in such a time. An Indian family story. It also has a good love story. Director Parasuram has made this movie with clear ideas. Tried something new. He also showed commercial elements in it. Parasuram felt happy with my working style. I can't imagine how big a success this movie will be. Because the audience cannot predict how a film will be received. There are times when some ordinary films become blockbusters and there are times when excellent films flop."
"I previously worked in SVC company. Dil Raju's production is known to be a good production house. It is a pleasure to work in this banner. Vijay Deverakonda is a natural actor. There is no big drama in his performance. I like Vijay's performance.
"My daughter Malavika has made a name for herself. I have not recommended her name for any movie. If you think it is not correct to do so. She has to prove her talent as an actress. Thangalan movie made by Pa Ranjith with Vikram will bring a good name to Malavika. I have worked for the movie 'The Goat Life Aadu Jeevitham.' But the shooting of that film took a long time, so I came out of that project."
మనం మర్చిపోయిన కుటుంబ విలువల్ని "ఫ్యామిలీ స్టార్" గుర్తు చేస్తుంది- సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్
ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు కేయూ మోహనన్. డాన్, తలాష్, అందధూన్ వంటి బాలీవుడ్ సూపర్ హిట్స్ తో పాటు తెలుగులో మహేశ్ బాబు మహర్షి సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారాయన. కేయూ మోహనన్ తెలుగులో వర్క్ చేసిన లేటెస్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేశారు సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్.
- సినిమాటోగ్రఫీ గురించి నేను ఫిలిం స్కూల్ లో నేర్చుకున్నాను. కెమెరా విషయంలో నాదంతా ఫార్మల్ అభ్యాసమే. వరల్డ్ సినిమా చూడటం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాలు చూస్తున్నాను. అప్పట్లో కృష్ణ గారి సినిమాలు, పౌరాణిక చిత్రాలు చూసేవాడిని. మనవన్నీ బేసిక్ గా కమర్షియల్, లార్జర్ దేన్ లైఫ్ మూవీస్. అందుకే సినిమాటోగ్రఫీ విషయంలోనూ న్యాచురాలిటీకి కొంత ఎక్కువగానే విజువల్స్ ఉండాలని కోరుకుంటాం. సినిమాటోగ్రఫీ ఒక స్కిల్ కాబట్టి అందులోనే ఒక ఈస్తటిక్ సెన్స్ ఉంటుంది. విజువల్ సెన్స్ ఉంటుంది. అది ప్రాజెక్ట్ ను బట్టి, సినిమాను బట్టి అప్లై చేస్తూ ఉంటాం. సినిమాలకు కొత్త ఎక్విప్ మెంట్ వాడటం అనేది అవసరం ఉంటేనే చేస్తాను. ఈ కొత్త లెన్స్ వాడాను, ఈ కొత్త కెమెరా తెచ్చాం అని చెప్పుకునేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ సినిమాకు ఎలాంటి విజువల్స్ కావాలో, అందుకు ఏ పరికరాలు అవసరం అవుతాయో అవి మాత్రమే తీసుకోమని చెబుతుంటా.
-
ఫ్యామిలీ స్టార్ సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ మూవీ. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కథ. అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనేది గుడ్ మెసేజ్ తో ఉంటుంది. కాలనీ సెట్ లో షూటింగ్ చేశాం. కథ, క్యారెక్టర్స్ ఎంత న్యాచురల్ గా ఉన్నాయో దాన్నే రిఫ్లెక్ట్ చేసేలా విజువల్స్ తెరకెక్కించాను. డ్రోన్ షాట్స్ ఉండవు. అవసరం లేని విజువల్ షాట్స్ ఏవీ ఫ్యామిలీ స్టార్ కు తీయలేదు. లైటింగ్ కూడా సహజంగా చేశాం. కానీ సినిమా చూస్తున్నప్పుడు విజువల్స్ ఎంత అందంగా ఉండాలో అంతే బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఒక మిడిల్ క్లాస్ ఇల్లు తెరపై చూస్తుంటే..ఇది మన ఇంటిలా ఉంది అనిపిస్తుంది. దర్శకుడు పరశురామ్ ఈ సినిమా నేపథ్యాన్ని సింపుల్ సెటప్ లో క్రియేట్ చేశాడు. విజయ్, మృణాల్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ కాబట్టి ఆర్టిస్టులు, ఇతర క్రూ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం..
-
మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి చెప్పే సినిమా ఫ్యామిలీ స్టార్. ఇండియా మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోయాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండటం అనేది జరగడం లేదు. ఇలాంటి టైమ్ లో మన ఓల్డ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి డిస్కస్ చేసే సినిమా ఇది. ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ అనుకోవచ్చు. దానితో పాటు మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. దర్శకుడు పరశురామ్ స్పష్టమైన ఆలోచనలతో ఈ సినిమా రూపొందించాడు. కొత్తగా ప్రయత్నించాడు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చూపించాడు. నా వర్కింగ్ స్టైల్ తో పరశురామ్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది.
-
ఎస్వీసీ సంస్థలో గతంలో పనిచేశాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్ మంచి ప్రొడక్షన్ హౌస్ అని తెలుసు. ఈ సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. విజయ్ దేవరకొండ న్యాచురల్ యాక్టర్. ఆయన నటనలో పెద్ద డ్రామా ఉండదు. నాకు విజయ్ పర్ ఫార్మెన్స్ అంటే ఇష్టం.
-
నా కూతురు మాళవిక మోహనన్ తనకు తానుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు నేను ఏ సినిమాకూ రికమెండ్ చేయలేదు. అలా చేయడం కరెక్ట్ కాదని భావిస్తా. నటిగా ఆమె తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. విక్రమ్ తో పా రంజిత్ రూపొందించిన తంగలాన్ మూవీ మాళవికకు మంచి పేరు తీసుకొస్తుంది. ది గోట్ లైఫ్ ఆడు జీవితం సినిమాకు నేను వర్క్ చేశాను. అయితే ఆ సినిమా షూటింగ్ ఎక్కువకాలం సాగడం వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.