తెలుగు సినిమా 90 ఏళ్ళ చరిత్రని 'నవతిహి ఉత్సవం'గా చేయబోతున్న మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)
తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి 'నవతిహి ఉత్సవం' చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవతిహి పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి ప్రకటించడానికి శనివారం నాడు హైదరాబాద్ పార్క్ హయత్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి 'మా' ప్రసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నటి మధుమిత శివబాలాజి వ్యవహరించారు. 1932 నుంచి తెలుగు సినిమా గొప్పదనం గురించి, 1993 లో మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తెలిపి గత రెండేళ్లలో 'మా' చేసిన పనులని వివరించారు మధుమిత శివబాలాజి. అనంతరం విష్ణు మంచు ఈ ప్రెస్ మీట్ ని లాంఛనంగా ప్రారంభించారు.
మలేషియా నుంచి వచ్చిన అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ మాట్లాడుతూ.. 'విష్ణు మంచు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విష్ణు మంచు గారితో పలు సార్లు మాట్లాడాను. ఆయనతో మాట్లాడిన ప్రతి సారి "మా" (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) గురించి, ఇందులో సభ్యులకు చేయాల్సిన పనుల గురించి, ఇన్సూరెన్స్ ల గురించి, మెడికల్ గురించి, ఆర్టిస్ట్ ల పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారు. ఆయన ఎప్పుడు కలిసినా 'మా' గురించే మాట్లాడేవారు. మేము ఈ "మా" ఈవెంట్ ను మలేషియాలో గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయబోతున్నాము. మలేషియా గవర్నమెంట్ కి ధన్యవాదాలు. మలేషియా టూరిజంని 'మా' అందరికి పరిచయం చేయబోతున్నందుకు విష్ణు మంచు గారికి ధన్యవాదాలు' అని అన్నారు.
మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ మాట్లాడుతూ.. 'మలేషియా టూరిజం డైరెక్టర్ తరపున నేను ఇక్కడకు వచ్చాను. జులైలో 'మా' ఈవెంట్ మలేషియాలో జరగబోతుంది. ఈ ఈవెంట్ తో మలేషియా కొలాబరేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. విష్ణు మంచు గారికి ధన్యవాదాలు. అందరూ మలేషియాకు వచ్చి ఎంజాయ్ చేయండి. ఇండియా - మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది, మలేషియాలో కలుద్దాం' అని తెలిపారు.
విష్ణు మంచు మాట్లాడుతూ.. 'మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్ నాథ్ గారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా, చాలా సక్సెస్ ఫుల్ గా చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ ప్రోగ్రాం నుంచి "మా" కోసం ఫండ్ రైజింగ్ కూడా చేద్దామనుకున్నాం. మలేషియా గవర్నమెంట్ తో చేయాలని నిర్ణయించుకున్నాం. రెండేళ్ల క్రితం నేను మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే కమల్ నాథ్ గారే నాకు ఎంతో సపోర్ట్ చేసారు. 'మా' తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్ధలతో మాట్లాడి డేట్ ను ఎనౌన్స్ చేస్తాము. అందరిని ఈవెంట్ కి వచ్చేలా చేస్తాము. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాము. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాము. అమితాబ్, అనీల్ కపూర్.. పలువురు నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారు. మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. మన జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుంది. నా బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడు. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసారు. కీరవాణి గారు ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారు. ఇలా ఎన్నో సాధిస్తున్నాము. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 'మా'లో దాదాపు 800 కి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు మేము అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఇప్పటికే మేము చేస్తున్న మెడికల్ ఇన్స్యూరెన్స్ చాలా మందికి సపోర్ట్ గా నిలిచింది. ఈ ఈవెంట్ కి ఛాంబర్ తో మాట్లాడాము, నటీనటులు అంతా రావాలి అని అడిగాము. మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు. త్వరలోనే ఈ నవతిహి ఈవెంట్ డేట్ ని ప్రకటిస్తాం. పక్క రాష్ట్రాల అన్ని సినీ పరిశ్రమలతో టై అప్ అయ్యాము. అన్ని పరిశ్రమలతో మాట్లాడాను. ఈవెంట్ కి వేరే పరిశ్రమ నటీనటులు కూడా కొంతమంది రాబోతున్నారు' అని తెలిపారు.
మలేషియాలో లోకల్ ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్టైన్మెంట్స్ ఎడ్విన్ ఆనందరాజ్ మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశం ఇచ్చిన విష్ణు మంచు గారికి ధన్యవాదాలు. మలేషియాలో ఇప్పటికే మేము చాలా ఈవెంట్స్ చేసాము. ఈ ఈవెంట్ ని మలేషియాలో గ్రాండ్ గా చేస్తాము"అని అన్నారు.
ఈ ఈవెంట్ కి ఫండ్ రైజింగ్ కి సపోర్ట్ చేస్తున్న ఆక్టోపస్ స్టూడియో రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. "మేము గ్లోబల్ ఈవెంట్స్ చేస్తాం. ప్రపంచములోనే అతి పెద్ద ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈవెంట్ జరగబోతుంది. ఇదంతా మంచు విష్ణు గారి వల్లే సాధ్యం అవుతుంది. 'మా' కోసం విష్ణు మంచు కష్టపడే తత్వం నాకు బాగా నచ్చింది" అని అన్నారు.
MAA proudly announces the celebration of 90 glorious years of Telugu cinema As Navatīhi Utsavam
Movie Artist Association proudly announces the celebration of 90 glorious years of Telugu cinema, commemorating its rich history, ground-breaking achievements, and enduring contributions to the world of cinema. Navatīhi Utsavam 2024 is the name of the event to be celebrated splendidly in July, this year. A press meet was held at Park Hyatt in Hyderabad to make the announcement about the event which was attended by MAA President Vishnu Manchu, Vice President Madala Ravi, Treasurer Siva Balaji, EC Members, and a few Malaysian Dignities.
Actress Madhumitha acted as the host for this program. She described the excellence of Telugu cinema since its inception in 1932 and about the Movie Artist Association which was started in 1993 and the work done by 'MAA' in the last two years. Later, Vishnu Manchu formally started this press meet.
Advisor Datuk P Kamalanathan who came all the way from Malaysia to attend the event said, “Thank you Vishnu Manchu for giving me this opportunity. I spoke to Vishnu Manchu several times. Every time I talked to him, he spoke more about "MAA" (Movie Artist Association), about the welfare work to be done for the members, their insurance, medical, and the education of the children of the artists. He used to talk about 'MAA' whenever we met. We are going to organize this "MAA" event grandly in Malaysia. Thanks to the Malaysian Government in this regard. Thank you, Vishnu Manchu, for introducing Malaysian tourism to ‘MAA’.
Razaidi Abdul Rahim, the representive of Malaysia Tourism Director India and Sri Lanka, said, “I have come here on behalf of Malaysia Tourism Director. 'MAA' event will be held in Malaysia in July. Malaysia is very happy to collaborate with MAA for this event. Thanks Vishnu Manchu. We welcome everyone to Malaysia. India-Malaysia shares good relations. Tourism Malaysia is supporting this program which will be very useful for our tourism industry. See you in Malaysia.”
Vishnu Manchu said, “Thanks to Kamalnathan who came here from Malaysia and also to the Tourism Department. Two years ago, we decided to organize the celebration of 90 glorious years of Telugu cinema event. We wanted to make this event grand and very successful by remembering many actors from the Telugu film industry. But due to some unavoidable reasons, the program keeps getting postponed. We also want to do fundraising for "MAA" from this program. We decided to collaborate with the Malaysian government. Kamalanathan Garu supported me two years ago when I had an accident while shooting in Malaysia. We are going to organize the biggest movie event on behalf of 'MAA' in Malaysia in July. The dates are not fixed yet. We will announce the date after talking to the seniors of the film industry. We will make sure everyone will attend the event. It is the golden era for Telugu cinema. We are all proud as Telugu actors. We are going to celebrate this Navatīhi Utsavam to show the glory of Telugu cinema. Amitabh Bachchan, Anil Kapoor, and many other actors were introduced through Telugu cinema. Megastar Chiranjeevi receiving Padma Vibhushan is a great accomplishment. The slogan 'Mana Jai Balayya' is heard everywhere. My brother Allu Arjun brought home the first National Award in the lead actor category. Prabhas is the highest-paid Indian actor. Mahesh Babu and Rajamouli's movie is going to be the biggest budget movie in Asia. Rajamouli introduced Telugu cinema to the world. Keeravani is the first Telugu technician to win an Oscar. We are achieving a lot like this. So, it is the right time to celebrate. We are happy that the Government of Malaysia is supporting us. There are more than 800 artists in 'MAA'. But only a few of them are well-settled. We are doing this fundraising to assist the needy. The medical insurance program also assisted many. We spoke with the chamber and asked all the actors to make their presence. We have asked for a two-day holiday for the film industry. Dil Raju Garu and Damu Garu assured their support. We will soon announce the date of this Navatīhi Utsavam. We have collaborated with all the film industries of neighboring states. Many actors from other industries are also going to attend the event.”
Edwin Anandaraj, local event organizer in Malaysia, MC Entertainments said, "Thanks to the Vishnu Manchu for giving me this opportunity. We have already organized many events in Malaysia. We will make this event a grand success in Malaysia."
Rahul Reddy of Octopus Studio, which is supporting the fundraising for this event, said, "We organize global events. The biggest artist association event in the world is going to be organized. All this is possible because of Vishnu Manchu. The hard work and dedication of Vishnu Manchu for the welfare of MAA is truly inspiring.”
Stills
L-R : Dr Madala Ravi , Datuk Kamalnathan, Vishnu Manchu garu , Razaidi Abdul Rahim - director - tourism Malaysia (south India & Srilanka ) & shiva balaji ,
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.