Vishnu Manchu released the ‘Kannappa’ comic book on the occasion of Mohan Babu’s birthday

మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల చేసిన విష్ణు మంచు

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్‌ను ఆవిష్కరించాడు విష్ణు మంచు. తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న "కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1"ని లాంచ్ చేశారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

"కన్నప్ప కామిక్ బుక్ వాల్యూమ్ 1" ద్వారా భక్తి, త్యాగం వంటి భావనలు అందరికీ తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలను చూపించనున్నారు. ఈ కామిక్ పుస్తకంతో విష్ణు మంచు భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కృతిక వారసత్వంతో వినోదాన్ని మిళితం చేయడం ద్వారా, కన్నప్పపై ఆసక్తిని రేకెత్తించడానికి, కన్నప్ప పట్ల భక్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు.

"కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1" విడుదల అనేది భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మాత్రమే కాకుండా, కన్నప్ప కథపై విష్ణు మంచు నిబద్ధతను కూడా ప్రదర్శించింది. ఇన్ స్టాగ్రాంలో DM చేసిన వారికి, వారి చిరునామాను మెసెజ్ చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి.

ఈ మేరకు విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్ పుస్తకం.. సినిమా లానే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ , డ్యాన్స్ మాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

డాక్టర్ మోహన్ బాబు గారి జన్మదిన వేడుకలు, మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు డా. మోహన్‌లాల్ గారు గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేయగా, శ్రీ ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు.

On Mohan Babu's birthday, Vishnu Manchu launched the Kannappa comic book series volume 1

As Vishnu Manchu wrapped the second schedule of his much-awaited epic action drama Kannappa, the star had already busied himself with what would herald the next leg of the film's making. All set to unveil a new creative venture that transcended the silver screen, Vishnu Manchu was excited to celebrate his father's birthday in a special way. On March 19th, he introduced "Kannappa Story Book Volume 1," a comic book adaptation of the legendary tale of Bhakta Kannappa. This innovative project marked a departure from conventional storytelling of movies, offering audiences a fresh and engaging way to experience the story of Kannappa.

"Kannappa Story Book Volume 1" promised to bring to life the captivating saga of devotion and sacrifice through vivid illustrations and compelling storytelling. As the inaugural volume in what was likely to be an exciting series, it set the stage for a journey filled with adventure, emotion, and spiritual depth. With this comic book, Vishnu Manchu aimed to make the timeless story of Bhakta Kannappa accessible to a wider audience, including younger generations who may not be familiar with the legend. By blending entertainment with cultural heritage, he sought to ignite curiosity and inspire reverence for Kannappa.

The release of "Kannappa Story Book Volume 1" not only celebrated the richness of Indian culture but also showcased Vishnu Manchu's commitment to the story itself. Even as he readied the film, he had in a video message requested fans to drop their address on his DM and they would receive the book free of cost.

Talking about it, he said, "I wanted everyone to know about this story. The comic book, much like the movie, was my dream to reach the most stirring story I had ever read to the world. I wanted young people to own their history and I felt this was a great start to start owning our roots. This was not a monetary endeavor for me. I was emotionally attached to the story and I wanted the world to be inspired by the grit and devotion of Kannappa."

Kannappa, directed by Mukesh Kumar Singh, boasts of a fine crew with renowned Hollywood cinematographer Sheldon Chau, action director Kecha Khamphakdee, and dance maestro Prabhu Deva.

The birthday celebrations for Dr. Mohan Babu garu and the Mohan Babu University 32nd annual day celebrations were a resounding success. Renowned actor Dr. Mohanlal garu graced the occasion as the honorable chief guest, while Mr. Mukesh Rishi attended as a guest of honor. The event was a delightful affair enjoyed by all in attendance.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%