'Tejame Rehmanena' Lyrical Song from Prithviraj Sukumaran's "The Goat Life" (Aadu Jeevitham) out now, releasing Pan-India wide on March 28th
Malayalam star Prithviraj Sukumaran's movie "The Goat Life" is set for a theatrical release on the 28th of this month in Malayalam, along with Hindi, Telugu, Tamil, and Kannada languages. Based on Benjamin's novel "Goat Days," the film is directed by award-winning director Blessy and produced by Visual Romance banner as a prestigious project in the Malayalam film industry. Oscar winner AR Rahman has released the lyrical song 'Tejame Rehmanena' from the movie "The Goat Life."
The lyrical song 'Tejame Rehmanena' was penned by Mouli and sung by Jitin Raj, with music composed by AR Rahman. It's an emotional song sung by the hero who finds himself in the desert, expressing his longing. Rahman's involvement in this song is special. Having visited the movie's shoot, Rahman felt the conflict and essence of the hero's character there and disclosed in the lyrical video that he composed this song inspired by that experience.
"The Goat Life" narrates the real-life story of Najeeb, a young man from Kerala who migrated abroad in the 90s seeking a livelihood. The film features Prithviraj Sukumaran, Hollywood actor Jimmy Jean Louis, Amala Paul, KR Gokul, and Arab actors Talib Al Balushi, Rick Aube in key roles.
Actors: Prithviraj Sukumaran, Hollywood actor Jimmy Jean Louis, Amala Paul, KR Gokul, Arab actors Talib Al Balushi, Rick Aube, etc.
Editor: Srikar Prasad
Cinematography: Sunil KS
Sound Design: Rasul Pookutty
Music: AR Rahman
PRO: GSK Media
Production: A Visual Romance
Directed by Blessy
పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి 'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ విడుదల, ఈ నెల 28న పాన్ ఇండియా రిలీజ్ కు వస్తున్న మూవీ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్నందించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి 'తేజమే రెహమానేనా..' అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ విడుదల చేశారు.
'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. ఏఆర్ రెహమాన్ ఎప్పటిలాగే బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. 'తేజమే రెహమానేనా తేజమే రహీమ్, యాడున్నావో యాడున్నావో గుండె తడవగ వానై పో..ఉప్పే లేని కన్నీరొలికి, ఆవిరి పెదవుల తాకగ రా..ఆటు పోటుల ఆకలి ఎడారిలో చూడన చూడన నీ కలకై...' అంటూ ఎడారి కష్టాల్లో ఉన్న హీరో తన ప్రేయసిని తల్చుకుంటూ పాడే ఎమోషనల్ సాంగ్ ఇది. ఈ పాటలో రెహమాన్ కనిపించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరిగిన ఏడారికి స్వయంగా వెళ్లిన రెహమాన్ ..అక్కడ హీరో క్యారెక్టర్ పడే సంఘర్షణను, ప్రకృతిని తానూ అనుభూతి చెందుతాడు. ఆ ఫీల్ తోనే ఈ పాట కంపోజ్ చేసినట్లు రెహమాన్ లిరికల్ వీడియోలో వెల్లడించారు.
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి
మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
నిర్మాణం - విజువల్ రొమాన్స్
దర్శకత్వం - బ్లెస్సీ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.