Suhas starrer Dilraju productions banner production no.4 movie releasing on May 24.. title announcement soon

సుహాస్ హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.4 మూవీ మే 24న రిలీజ్‌.. త్వ‌ర‌లోనే టైటిల్ అనౌన్స్‌మెంట్‌

గ‌త ఏడాది బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాల‌ను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థ‌లో డిప‌రెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.4గా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

సుహాస్ జ‌త‌గా సంకీర్త‌న విపిన్ న‌టిస్తుంది. నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌లార్ చిత్రానికి డైలాగ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. అంద‌రూ మెచ్చే వినోదం ప్రారంభం అవుతుంది. మీ క్యాలెండ‌ర్‌లో మే 24ని గుర్తు పెట్టుకోండి. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ లో నాలుగో చిత్రంలో నేను న‌టిస్తున్నాను. మేం అద్భుత‌మైన కామెడీతో వేడి పుట్టించ‌టానికి సిద్ధంగా ఉన్నాం అని సుహాస్ పేర్కొన్నారు.

ఈ చిత్రం మే 24న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చ‌సింది. అందులో చిన్న పాట మ‌హిళ న్యాయ‌మూర్తిగా క‌నిపిస్తోంది. చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని ఒక చేతిలో రెండు ట్రే స్కేల్ పట్టుకొని కనిపించింది. పోస్ట‌ర్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న‌ ఒక ఫ‌న్నీ కోర్టు డ్రామా అని అర్థ‌మ‌వుతుంది. #JAGonMay24 అనే హ్యాష్ ట్యాగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త్వ‌ర‌లోనే టైటిల్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన‌ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ఆకాశం దాటి వ‌స్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ బ్యాన‌ర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధ‌మ‌వుతుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు.

న‌టీన‌టులు:
సుహాస్‌, సంకీర్త‌న విపిన్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: స‌ందీప్ రెడ్డి బండ్ల‌
స‌మ‌ర్ప‌ణ‌: శిరీష్‌
బ్యాన‌ర్ : దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు : హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరామ్‌
సంగీతం: విజ‌య్ బుల్గానిన్‌
ఆర్ట్: రామ్ అర‌స‌విల్లి
పి.ఆర్.ఒ: వ‌ంశీ కాకా

Dilraju Productions Production No.4, Suhas next is releasing on May 24th, title reveal soon

Prestigious production house Dilraju Productions, which scored historic hit with Balagam is currently busy producing multiple films. The banner which encourages young talents joined hands with talented actor Suhas, who impressed audience with versatile roles. This is the fourth production for the banner and it launched in December last year.

Gorgeous Sankeertana Vipin is playing the female lead. Harshith Reddy and Hanshitha Reddy are bankrolling the project, presented by Shirish. Salaar dialogue writer Sandeep Reddy Bandla takes the helm. Team announced the film's release date today. Announcing the release date, Suhas wrote "Let the fun begin! Mark your calendars for May 24th, My next in #DRP4…. set to bring the heat with their scorching entertainment."

The film will have a grand release in theaters on May 24th. The release date poster features a cute baby in the avatar of Lady Justice, which we usually see in courts. The baby is blindfolded and seen holding a two-tray scale in one hand. This unique poster promises that it's going to be a fun court drama with family emotions. The hashtag #JAGonMay24 captured everyone's attention. The makers also revealed that the title will be announced very soon.

Sai Sriram handles the cinematography, and the music will be scored by Vijay Bulganin, the sensational composer known for his work in 'Baby.' After the sensational hit Balagam, DilRaju Productions bringing Aakasam Dhaati Vasthava. Recently they've the third film with Ashish. Now the fourth film has started with Suhas as the protagonist. More details about cast and crew will be announced soon.

Actors:

Suhas, Sankeerthana Vipin, Rajendra Prasad, Vennela Kishore, Murali Sharma, Goparaju Marani, Murali Sharma, Raghubabu, Prithvi, Sivannarayana, Rupa Lakshmi, Vijaya Lakshmi and others.

Technical category:

Directed by - Sandeep Reddy Bandla
Presented by - Shirish
Banner - DilRaju Productions
Producers - Harshith Reddy, Hansitha
Cinematography - Sai Sriram
Music - Vijay Bulganin
Art - Ram Arasavilli
P.R.O - Vamsi Kaka

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%