‘Bachchalamalli’ is a different genre movie with a new story. Movies with Sandeep Kishan and Kiran Abbavaram are also entertaining with unique concepts. Are you going to make a Pan India film in 2025: Successful producer Rajesh Danda

‘బచ్చలమల్లి’ సరికొత్త కథతో డిఫరెంట్ జోనర్ సినిమా. సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరంతో చేసే సినిమాలు కూడా యూనిక్ కాన్సెప్ట్స్ తో అలరిస్తాయి. 2025 లో తప్పకుండా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నా: సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా

పంపిణీదారుని కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా వుందని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా తెలియజేస్తున్నారు. నేను పంపిణీదారుడిగా వున్నప్పుడే సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరలాసినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు.

హాస్య మూవీస్ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మార్చి 19 న రాజేష్ దండా పుట్జినరోజు. ఈ సందర్భంగా సినిమా నిర్మాణంలోనూ, భవిష్యత్ సినిమాల గురించి పలు విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

ఈసారి బర్డ్ డే గిఫ్ట్ గా ఏమేమీ చేయబోతున్నారు?
స్వామిరారా చిత్రంతో పంపిణీదారునిగా మొదలయి దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పనిచేశా. అనిల్ సుంకరతో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవ కోన, సామజవర గమన వంటి సినిమాలను నిర్మించా. అవి హిట్ కావడంతో ఈ బర్త్ డే గిఫ్ట్ గా మరో కొన్నిసినిమాలు సిద్ధం చేసుకున్నా.

మీ బేనర్ లో స్వంతంగా సినిమా చేస్తున్నారే?
నేను ఇంతకుముందు కూడా చేసినవి స్వంత బేనర్ లోనే. నా కిష్టమైన వారితో నా బేనర్ లో చేయడం చాలా హ్యాపీ. నాంది సినిమా నా జోనర్ సినిమా. బచ్చలమల్లి కూడా నా జోనర్ సినిమా. ఇలా నా కిష్టమైన కథలతో మనుషులతో చేయడం చాలా ఆనందంగా వుంటుంది. దీనికి సుబ్బు దర్శకుడు.

బచ్చల మల్లి ఎలాంటి కథ. సీరియస్ గా వుంటుందా?
90 దశకంలోని కథ. చాలా ఆసక్తికరంగా వుంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో తీయాలని అన్నవరం, తుని చుట్టు పక్కల విలేజ్ లలో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం.

పెద్ద నిర్మాతలే నిదానంగా చేస్తున్నరోజుల్లో మీరు స్పీడ్ గా చేయడం శాటిటైల్ బిజినెస్ కూడా పొందడం మీకెలా అనిపిస్తుంది?
ఇక్కడ ఒక్కటే కొలమానం. సినిమాలు బాగా ఆడుతున్నాయి కనుక బిజినెస్ జరుగుతుంది. ఇంతకంటే పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు అనే తేడాలేదు.

పంపిణీదారునిగా నిర్మాతగా ఎలా మీకు ఉపయోగపడుతుంది? కాన్సెప్ట్ లను ఎలా అంచనా వేస్తున్నారు?
ఒకరకంగా పంపిణీదారునిగా వున్న అనుభవం చాలా వరకు ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కొత్తగా వుండే పాయింట్ తో వెళ్ళాలన్నదే నా పాలసీ. అలాంటి కథలతోనే భైరవ కోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, సామజవరగమన వంటి సినిమాలు తీయగలిగాను.

అల్లరి నరేశ్, సందీప్ కిషన్.. వీరితోనే సినిమాలు చేస్తారా? వేరే హీరోతో చేయరా?
అదేం లేదు. రన్నింగ్ లో వున్న హీరోలతో కంపర్టబుల్ గా వుంటుంది. పైగా నేను పంపిణీదారుడిగా వున్నప్పటినుంచీ వారు నన్ను నమ్మారు. వారితో జర్నీ చాలా హ్యాపీగా వుంది. అలా అని బయట హీరోతో చేయను అని చెప్పను. త్వరలో బయట హీరోతో చేయబోతున్నా.

సహజంగా మీకు ఏ జోనర్ అంటే ఇష్టం?
కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. అందులో నాకు యాక్షన్ సినిమాలంటే మరీ ఇష్టం. అవి నా సినిమాలో వుండేలా చూసుకుంటాను. అది కూడా కథ ప్రకారం వుండాలి.

ఒక్కోసారి రివ్యూలు మిక్స్ డ్ గా వస్తుంటాయి? అన్ని సినిమాలపై మీరు చూసినప్పుడు మీ అంచనా ఎలా వుంటుంది?
ఏ సినిమా అయినా కొనుక్కున్న బయ్యర్ కు హిట్ అయితే డబ్బులు వస్తాయి. అది బెటర్ సినిమా అనుకుంటాడు. ఒక్కోసారి కొన్ని సినిమాలు మనకు బాగున్నా రికవరీ అవ్వలేదంటే ప్రేక్షకులకు నచ్చలేదని అర్థం. ఇక రివ్యూలు అంటారా.. వారి అభిప్రాయాలు ఎలాగైనా రాయవచ్చు. బైరవ కోనలో ఓ సాంగ్ వుంది. అది థియేటర్ వరకు తీసుకువస్తుందని భావించాం. అలాగే జరిగింది. నేడు రెగ్యులర్ సినిమాలకు పెద్దగా ఆడియన్ రావడంలేదు. కానీ భిన్నంగా వుంటే తప్పకుండా వస్తారు.

చిన్న సినిమాలను తక్కువలో అవ్వగొట్టొచ్చు అనే టాక్ బయట వుంది? కానీ మీ సినిమాలకు ప్రభాస్ సినిమాకు పనిచేసే కెమెరామెన్, సంగీత దర్శకుడిని తీసుకోవడానికి కారణం?
సినిమాకు కథ తర్వాత ముఖ్యమైనది ఫొటోగ్రపీ. అది చక్కగా వుంటేనే కంటికి ఇంపుగా వుంటుంది. రంగస్థలం, కోమాలి సినిమాలు నేను చూశాను. సినిమాటో గ్రఫీ అద్భుతంగా వుంది. తను నాకు బాగా తెలుసు. అందుకే నేను తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కూడా ఎంపిక చేశాను. తను బిజీగా వున్నా. నాకోసం చేస్తానని హామి ఇచ్చాడు. ఇలా మంచి మనుషులతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులకు కూడా ఆ ఫీలింగ్ వుంటేనే కనెక్ట్ అవుతారు. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయగలుగుతున్నా.

నిర్మాతలకు కథపై కంట్రోల్ వుండదు. కేవలం క్యాప్ ఇయర్ అనే అపప్రద వుంది. దానికి మీరేమంటారు?
నేను చేసే హీరోలు నాకు పర్సనల్ ఫ్రెండ్స్. నేను అన్నీ స్టడీ చేసి ప్లాన్ చేసుకుంటాను. నాకు నా మాట వినేవారే దొరికారు. అది నా అద్రుష్టం. ముందుముందు వేరే హీరోలతో కూడా అలాగే వుండాలని కోరుకుంటా. ఇక సినిమా పరంగా చూస్తే, కథ, ప్రీప్రొడక్షన్, షూటింగ్ అన్నీ నేను ప్లాన్ చేసుకుంటా. నా ప్రమేయం అన్నింటిలో వుంటుంది. పంపిణీదారునిగా వున్న నా అనుభవం ఇలా ఉపయోగపడుతుంది. షూటింగ్ కూడా వెళుతుంటా. నిర్మాతగా కంట్రోల్ అనేది మన చేతుల్లోనే వుంటుంది.

అనిల్ గారితో జర్నీ ఎలావుంది?
ఆయనతో కలిసి సినిమాలు చేశాను. ఆయనతో జర్నీ చాలా బాగుంది.

హాస్య మూవీస్ కు ప్రత్యేకతగా మీరు ఏం చేయబోతున్నారు?
హాస్య మూవీస్ తో అన్ని మంచి సినిమాలు కొత్త కథలు తీయడమే ప్రత్యేకత. పలు పెద్ద సంస్థలు తీసినట్లే మా బేనర్ లో మంచి కథాంశాలు, కొత్త కథలు తీయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు తీసినవి అలాంటికొత్త కథలే. రేపు దర్శకుడు త్రినాథ్ తో తీయబోయే సినిమా కూడా భిన్నమైన కథతో వుంటుంది.

థమాకా తర్వాత త్రినాథ్ పెద్ద సంస్థలతో చేస్తున్నారనే టాక్ వచ్చింది? అతన్ని మీరెలా లాక్ చేశారు?
ప్రసన్న చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా అందరూ సక్సెస్ లో వున్నవారు కలిసి సినిమా చేయాలని చేస్తున్నాం. దానికి అన్నీకలిసివచ్చాయి.

ప్రస్తతుం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరింది. మీ బేనర్ లో ఆ స్థాయిసినిమా వుంటుందా?
తప్పకుండా. పాన్ ఇండియా హీరో, కథ లభిస్తే తప్పకుండా చేస్తా. 2025 లో తప్పకుండా చేస్తా.

కొత్త సినిమాలు?
అల్లరి నరేష్ సినిమా యాభై శాతం పూర్తయింది. తదుపరి సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం సినిమాలు వున్నాయి.

డిజిటల్, శాటిలైట్ వ్యాపారం ఎలా వుందని భావిస్తున్నారు?
గత ఏడాదితో పోలిస్తే డిజటిల్, శాటిలైట్ బిజినెస్ తగ్గిందనే చెప్పాలి. ఇది చిన్న సినిమాలకే. పెద్ద సినిమాలకు పెద్దగా వర్తించదు. లక్కీగా నా సినిమాలకు అటువంటి ఇబ్బంది రాలేదు. నా మూడు సినిమాలు రిలీజ్ కుముందుగానే శాటిలైట్ బిజినెస్ అయిపోయాయి. రేపు రాబోయే సినిమాలు కూడా బిజినెస్ కు సిద్ధంగా వున్నాయి. ఏది ఏమైనా బేనర్, నిర్మాత సక్సెస్ చూసే మార్కెట్ వుంటుంది. అలా నాకు రావడం అద్రుష్టంగా భావిస్తున్నా. ఎవరు కొన్నా ముందుగా టీజర్ చూసే కొంటారు. అవి నచ్చితేనే ఏ బిజినెస్ అయినా ఈజీగా అవుతుంది.

మీ బేనర్ లో పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుంది?
వచ్చే ఏడాది తప్పకుండా పెద్ద హీరోతో చేయబోతున్నా. అది ఎవరనేది సస్పెన్స్.

ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలని రూల్ పెట్టుకున్నారా?
అలాంటిది ఏమీ లేదు. మారేడుమల్లి. షూట్ లో వుండగానే బచ్చల మల్లి కథ విన్నాను. అదేవిధంగా సామజవరగమన షూట్ లో వుండగానే కిరణ్ అబ్బవరం సినిమా అనుకున్నాం. షడెన్ గా వచ్చింది త్రినాథ్ సినిమా.. అని ముగించారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.