I am very happy that my role in 'Razakar' is being appreciated so much: Actress Anushree
Telangana's armed struggle has a special place in history. The struggle of the people who jumped into the field of armed combat is still alive. An attempt to portray such a story in the form of 'Razakar' in an emotional way has given the audience a great response. The acceptance of my character in this film has given me a lot of happiness," he said. Actress Anushree. Produced by Guduru Narayana Reddy, 'Razakar' starring Bobby Simha, Makarand Desh Pandey, Anushree, Anasuya, Prema in lead roles, directed by Yata Satyanarayana. The film which hit the screens on Friday is getting a good response. In this context, Anushree, who played a key role in this, shared the features of the film.
How do you feel about the response to the film 'Razakar'?
Thank you to the audience for supporting the movie 'Razakar' so much. 'Razakar' is the story of this land. The response to the film has given me a lot of joy. The audience is getting very emotional after watching the movie. Patriotism was seen in the eyes of the audience while watching the film. When I saw the slogans of Vande Matharam and Bharat Mathaki Jai chanted in the theatres, I felt happy to be a part of such a film. Thank you to director Yata Satyanarayana and producer Guduru Narayana Reddy for giving me a chance in such a good movie.
Tell us about your background? How did you get into this project?
I studied college in Bangalore. I am also a member of the theatre group there. It was there that interest in acting grew. I loved playing different roles and immersing myself in them. After completing college, my father wanted me to study for civils. I have been studying for almost three years. But the desire to become an actress was strong. I came to Hyderabad to fulfil that dream. I did theatre workshops here. I approached the director for a role in this film. Then he was looking for the role of Nizam's wife. They felt that I was suitable for that role.
Was it a challenge to play this role?
She appeared as Nizam's wife in this. It is a very strong yet sensitive character. That character who informs the Nizam of the actual situation. My role felt challenging when the story was told. Also the only glamor role in this is mine. Starting my career with such a strong story and character is like a dream come true. I also took method training for three months for this role. After a look test with Makarand Desh Pandey, I was selected. I think this role will be a great match for my career.
How did it feel to act with so many famous actors?
Acting in 'Razakar' was a great experience. There is a chance to work with many famous actors. It is a great feeling to share the screen with an amazing actor like Makarand Desh Pandey along with Bobby Simha, Raj Arjun. I learned many things from them.
What is your family background? When did you become interested in acting?
My father is CA. Mom is a housewife. I started my career from modelling. In 2018, I also participated in the Miss India pageant from Chhattisgarh. My mother used to model too. Mother got interested in modelling. Also, as mentioned earlier, I was interested in acting from my college days. I enjoy acting a lot.
What kind of roles do you want to play in the future?
I am ready to play any role in a good story. Along with characters, good story, director and team are important.
Your favourite hero and heroine?
I love the acting of Ranbir Kapoor and Ram Charan. I love intense emotion in Ram Charan. I like Priyanka Chopra, Anushka Shetty and Keerthy Suresh as heroines. Keerthy's performance in Mahanati is amazing. I wish to appear in such a good role in future.
‘రజాకార్’ చిత్రానికి, నా పాత్రకు ఇంత గొప్పగా ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా వుంది: నటి అనుశ్రీ
'చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలే సాయుధులై కదన రంగంలోకి దూకి చేసిన పోరాటం.. ఇప్పటికీ సజీవం. అలాంటి కథను ‘రజాకార్’ రూపంలో భావోద్వేగభరితంగా తెరపై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అన్నారు నటి అనుశ్రీ. బాబీ సింహా, మకరంద్ దేశ్ పాండే, అనుశ్రీ, అనసూయా, ప్రేమ, ప్రధాన పాత్రలో, యాట సత్యనారాయణ దర్శకత్వంలో, గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన చిత్రం 'రజాకార్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన అనుశ్రీ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘రజాకార్ ' చిత్రానికి వస్తున్న స్పంధన ఎలా అనిపిస్తుంది ?
ముందుకు ‘రజాకార్' చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘రజాకార్' ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపించింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు థియేటర్స్ లో మార్మ్రోగడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో భాగం కావడం ఆనందంగా అనిపించింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణ గారిని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారికి ధన్యవాదాలు.
మీ నేపధ్యం గురించి చెప్పండి? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను బెంగళూరులో కాలేజ్ చదివాను. అక్కడే థియేటర్స్ గ్రూప్ లో కూడా ఒక సభ్యురాలిగా వున్నాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రలలో నటించడం, ఆ పాత్రలలో లీనం అవ్వడం నాకు చాలా నచ్చింది. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్ కి చదవాలని నాన్నగారు కోరుకున్నాను. దాదాపు మూడేళ్ళు చదువుల్లోనే వున్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా వుండేది. ఆ కలని నెరవేర్చడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు.
ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా?
ఇందులో నిజాం భార్యగా కనిపించా. చాలా బలమైన అదే సమయంలో సున్నితమైన పాత్ర ఇది. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరినట్లయింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాత్ర నా కెరీర్ గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను.
ఇందులో చాలా మంది ప్రముఖ నటులతో నటించడం ఎలా అనిపించింది ?
'రజాకార్ 'లో నటించడం చాలా గొప్ప అనుభవం. చాలా మంది ప్రముఖ నటులతో కలసిపని చేసే అవకాశం వుంది. బాబీ సింహ, రాజ్ అర్జున్ తో పాటు మకరంద్ దేశ్ పాండే లాంటి అద్భుతమైన యాక్టర్ తో స్క్రీన్ పంచుడవడం గొప్ప అనుభూతి. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
మీ కుటుంబం నేపధ్యం ఏమిటి ? నటనపై ఆసక్తి ఎప్పుడు ఏర్పడింది ?
నాన్న సిఏ. అమ్మ గృహిణి. నేను మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టాను. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నాను. మా అమ్మ ఒకప్పుడు మోడలింగ్ కూడా చేసేవారు. అమ్మ నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఏర్పడింది. అలాగే ముందుగా చెప్పినట్లు కాలేజ్ రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. నటనని చాలా ఆస్వాదిస్తాను.
భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?
మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్ధంగా వుంటాను. పాత్రలతో పాటు మంచి కథ, దర్శకుడు, టీం ముఖ్యం.
మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్ ?
రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారిలో ఇంటెన్స్ ఎమోషన్ ని చాలా ఇష్టపడతాను. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటాను.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.