Veyi Daruveyi Movie Review: A good action entertainer (Rating: 3.0)

యాక్షన్, కామెడీ డ్రామా సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ జోనర్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అందుకే సినిమా రంగంలో నిలదొక్కోవాలనుకునే నూతన దర్శకులు, నిర్మాతలు ఇలాంటి కథలకి ప్రధాన్యత ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు నూతన దర్శకుడు నవీన్ రెడ్డి కూడా ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నే తెరకెక్కించారు. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ ఇందులో హీరోగా నటించగా యషా శివకుమార్ అతని సరసన నటించారు. హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత దేవరాజ్ పోతూరు నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

స్టోరీ ఏమిటంటే...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి పట్టణం ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి పట్టణం నుంచి ఇంట్లో పోట్లాడి ఉపాధికోసం సిటీకి శంకర్(సాయిరామ్ శంకర్) వస్తారు. కామారెడ్డి శంకర్ గా అందరికీ పరిచయం చేసుకుంటాడు. అలా తన మిత్రుడు(సత్యం రాజేష్)తో కలిసి సిటీలో ఉపాధికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చదువులో పెద్దగా రాణించని శంకర్ కి కనీసం డిగ్రీ అర్హత లేనిదే ఉద్యోగం దొకదని తెలుసుకుని, ఓ ఫేక్ సర్టిఫికెట్స్ సప్లై చేసే వ్యక్తి సత్య హరిశ్చంద్ర ప్రసాద్( ఈ చిత్ర నిర్మాత దేవరాజ్) సంప్రదిస్తారు. అందుకు రెండు లక్షలు కావాలంటాడు. ఎలాగో అలాగ తన ఫ్రెండు ష్యూరిటీతో తీసుకొచ్చి ఫేక్ సర్టిఫికెట్ సంపాధిస్తాడు. అక్కడే రిసెప్షనిస్ట్ గా పనిచేసే శృతి(యషా శివకుమార్) పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆమె కూడా ఫేక్ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా మారుతుంది. మరి శంకర్ కూడా ఉద్యోగం సంపాధించారా? అసలు శంకర్ సిటీకి ఉద్యోగం కోసమే వచ్చాడా? అతని అసలు ఉద్దేశం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల్లో రజాకార్ హిస్టరీకి సంబంధించిన సీరియస్ సినిమా. అలాగే తంత్ర మూడీ తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలకు సంబంధించిన హారర్ జోనర్ మూవీ. వీటిలో కామెడీకి తావులేదు. అయితే హీరో సాయిరామ్ శంకర్ నటించిన ‘వెయ్ దరువెయ్’ సినిమా ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన సినిమా. అందులోనూ సాయిరామ్ శంకర్ కామెడీ టైమింగ్ ను ఇష్టపడని ఆడియన్ ఉండరు. అతని కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ అందరికీ తెలుసు. దానికితోడు ఓ చిన్నపాటి సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ జోడిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ‘వెయ్ దరువెయ్’ సినిమాలో నూతన దర్శకుడు నవీన్ రెడ్డి కూడా చేసింది అదే. సాయిరామ్ శంకర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకుని, కొంచెం ఫ్యామిలీ డ్రామాను జోడించి... చివర్లో ఓ చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చారు. చదువుకోకుండా అడ్డదారుల్లో ఫేక్ సర్టిఫికెట్స్ పొంది ఉద్యోగాలు పొందితే కటకటాలపాలు కాకతప్పదని మెసేజ్ ఇచ్చారు. అలాగే నిరాశలో ఉన్న యువతను క్యాష్ చేసుకోవడానికి వారికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారుచేసి ఇచ్చి... సొమ్ము చేసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఓ హాస్పిటల్ ఇన్సిడెంట్, ఓ కుంగిన ఫ్లై ఓవర్ కారణంగా కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి జీవితం... ఇలా మెసేజ్ రూపంలో ఆడియన్స్ కు ఇచ్చారు దర్శకుడు. అలాగే అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్స్ సప్లై చేసి... సమాజంలో పరువు పొగొట్టుకుని, విగతజీవునిగా మారడాన్ని ఇందులో చూపించారు. దురాశ దు:ఖానికి చేటు అనే నీతి సూత్రాన్ని... ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో అంతా సత్యం రాజేష్ తో కలిసి సాయిరామ్ శంకర్ చేసే సరదా సరదా సన్నివేశాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి... ఆ తరువాత ఇంటర్వెల్ బ్యాంగ్ తో సునీల్ ని పరిచయం చేస్తాడు దర్శకుడు. ఇటీవల తన విలనిజంతో విపరీతంగా మెప్పిస్తున్న సునీల్... ఇందులోనూ ఆకట్టుకుంటాడు. సెకెండాఫ్ అంతా యాక్షన్, డ్రామాతో సినిమాని ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. ఓవరాల్ గా ‘వెయ్ దరువెయ్’ సినిమా ఆడియన్స్ ని అలరిస్తుంది.

సాయిరామ్ శంకర్ ఎప్పటిలాగే తన ఎనర్జీ చూపించారు. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ను ఆటపట్టించే సన్నివేశాలు, సత్యం రాజేష్ తో వచ్చే సీన్స్ అన్నీ నవ్విస్తాయి. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఫుల్ ఎనర్జీ చూపించారు. అతనికి జోడీగా నటించిన యషా శివకుమార్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్స్ సప్లై చేసే పాత్రలో నటించిన చిత్ర నిర్మాత దేవరాజ్ మెప్పించారు. త్రూ అవుట్ సినిమా మొత్తం తన పాత్రను క్యారీ చేశారు. అతనికి జంటగా నటించిన గాయత్రి భార్గవి కూడా గృహిణిగా మెప్పించారు. సునీల్ విలన్ పాత్రలో ఎప్పటి లాగే నటించి ఆకట్టుకుంటారు. అయితే పుష్ఫ సినిమాలో సునీల్ విలనిజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకాస్త బాగా పోట్రెయిట్ చేయాల్సింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు నవీన్ రెడ్డి ఎంచుకున్న మెయిన్ ప్లాట్ బాగుంది. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఎంటర్టైనింగ్ గా ఉంది. అయితే ఇంకాస్త బలమైన సన్నివేశాలు, సంభాషణలు రాసుకుని ఉంటే మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. దర్శకునికి డెబ్యూ మూవీనే అయినా... ట్రీట్ మెంట్ చేసిన విధానం బాగుంది. భీమ్స్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మార్కు మ్యూజిక్ ఇందులో కూడా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జోడీని అందంగా చూపించారు. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా సినిమాని నిర్మించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సరదాగా ఈ వారం సినిమాని చూసేయండి.
రేటింగ్: 3

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%