Tantra Movie Review: An engaging tantric thriller (Rating: 3.25)

సోసియల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల బ్యూటీ అనన్య నాగళ్ల... ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తాజాగా ‘తంత్ర’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లకు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. అనన్య తోపాటు హీరో శ్రీహరి తమ్ముడు కుమారుడు ధనుష్ రఘుముద్రి నటించారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య సంయుక్తంగా నిర్మించారు. కుద్ర పూజలు, తాంత్రిక విద్యలపై తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. మరి ఇది ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: చిన్నతనంలో తల్లి(సలోని)ని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగిన ఓ అందమైన గ్రామీణ యువతి రేఖ(అనన్య నాగళ్ల). ఆమెను అదే గ్రామానికి చెందిన తేజు(ధనుష్ రఘుముద్రి) ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒకరికొకరంటే ప్రేమానురాగాలుంటాయి. వీరిద్దరూ మరో ఇద్దరు కలిసి కాలేజీ చదువుతుంటారు. రేఖకు చీకటి అంటే చచ్చేంత భయం. ఆమెను ఏవో కొన్ని శక్తులు పీడిస్తూ ఉంటాయి. అందుకే ఆమెకు ఎవరికీ కనిపించన కొన్ని శక్తులు ఆమెకు మాత్రమే కనిపిస్తాయి. దాని వల్ల ఆమె ఓ బాబా దగ్గర ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ ఆమెను ఓ శక్తి పీడిస్తూ... తన రక్తాన్ని తాగేంత వరకూ వదలదు. అలాంటి రేఖ... జీవితం ఎందుకు ఇలా మారింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే...

గతంలో వచ్చిన మసూద, విరూపాక్ష సినిమాలు తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలతో తెరకెక్కి ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో ‘తంత్ర’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి. ఈ సినిమాకి రాసుకున్న ప్రధాన ప్లాట్ కూడా తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలతో ముడిపడి ఉంది. అయితే దానికి పురాణ గాథలను జోడించి తెరకెక్కించారు. దాంతో సినిమాను చూసే కోణం కాస్త పాజిటివ్ గా మారిపోతుంది. పురాణాల్లో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, క్షుద్రదేవత అయిన నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు... ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేసి ఇంద్రజిత్తు తలపెట్టిన క్షుద్రపూజను భగ్నం చేస్తాడు... ఇలా పురాణాల్లో కూడా క్షుద్రపూజలు చేసేవారని, అప్పట్లోనూ క్షుద్రదేవతలున్నారని చెబుతూ ‘తంత్ర’మూవీలో ప్రధాన ప్లాట్ ఏంటో సినిమా ప్రారంభంలోనే రివీల్ చేసి... సినిమా ఏ పంథాలో సాగుతుందనేది ఆడియన్స్ కి హింట్ ఇచ్చేశారు దర్శకుడు. కథనాన్ని ఆసక్తిగా చెప్పడానికి కొన్ని ఘటనలను ఆరు(రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి) విభాగాలుగా ఎంచుకుని సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. ఈ విభాగాలు మీద రాసుకున్న ఎపిసోడ్స్ అన్నీ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా వజ్రోలి రథి.. ఎపిసోడ్ ను టెంపర్ వంశీ, సలోని మీద తీసిన తీరు ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది. చిత్రంలో తాంత్రిక విధానాల సీక్వెన్స్ లు ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఎక్కడా ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా అనన్య నాగళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో తాంత్రిక విద్యలతో కొన్ని ఎపిసోడ్స్ ను చూపించి... సెకెండాఫ్ లో క్షుద్రపూజలతో రక్తికట్టించారు సినిమాని. అయితే కొన్ని ఎపిసోడ్స్ సాగతీతలా ఉండటంతో అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఇంకాస్త బాగా రాసుకుని తీసుంటే బాగుండేది.

గ్లామర్ బ్యూటీ అనన్య నాగళ్ల సినిమా మొత్తం అన్నీతానై సినిమాను ముందుకు నడిపించింది. హారర్, గ్లామర్ పాత్రల్లో బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటి లాగే తనదైన శైలిలో నటించి యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆమెకు జోడీగా నటించిన ధనుష్ రఘుముద్రి కూడా మొదటి సినిమానే అయినా బాగా నటించి మెప్పించారు. అమాయకమైన పాత్రలో, అనన్యకు పెయిర్ గా ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యారు. క్షుద్రపూజలు చేసి... అమ్మాయిలను వశం చేసుకునే భయంకరమైన మాంత్రికుడి పాత్రలో టెంపర్ వంశీ ఆక్టుకున్నాడు. ఇప్పటి వరకు రౌడీ పాత్రలను పోషించిన వంశీ... ఇందులో మాంత్రికుడి పాత్ర పోషించి మెప్పించారు. చాలా కాలంత రువాత ‘మర్యాదరామన్న’ బ్యూటి సలోని ఇందులో నటించింది. ఉన్నది కాసేపే అయినా... తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాసుకున్న స్టోరీ దాన్ని ముందుకు నడిపించేందుకు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తిరంగా ఉన్నాయి. ఎక్కడా ఆడియన్ బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా మెయిన్ ప్లాట్స్ ను రాసుకున్నారు. అలాగే చివరి దాకా సస్పెన్స్ కూడా తీసుకెళ్లి... ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచారు. ఇలాంటి హారర్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రధాన బలం. అలాంటిది ఈ సినిమాకి సంగీత దర్శకుడు వంద శాతం న్యాయం చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. ఇలాంటి జోనర్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా మంచి ఛాయిస్. ఈ వారాంతంలో సరదాగా చూసేయండి.

రేటింగ్: 3.25

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%