Naveen Chandra’s web series “Inspector Rishi” will be streaming on Amazon Prime from March 29th

Naveen Chandra's web series "Inspector Rishi" will be streaming on Amazon Prime from March 29th

A hero, a villain, or a character with negative shades—Naveen Chandra excels in any role. Apart from movies, he is also making a name for himself in web series. Having gained significant recognition in Telugu cinema, Naveen Chandra recently endeared himself to the Tamil audience with the movie "Jigarthanda Double XL." As a result, movies and web series in Kollywood are being made with him in the lead. An interesting project in this lineup is "Inspector Rishi." This series will be streaming from the 29th of this month as an Amazon Tamil Original.

"Inspector Rishi" is a web series centered around a horror crime story, directed by Nandini J.S. and produced by Sukh Dev Lahiri under Make Believe Productions. Naveen Chandra stars in the title role as a formidable police officer who investigates clueless murders. The suspense and horror elements of who is behind these relentless murders are intriguingly captured in "Inspector Rishi." The web series features Sunaina, Kanna Ravi, Malini Jeevaratnam, Srikanth Dayal, and Kumar Vale in key roles. Currently, Naveen Chandra is working on interesting projects like "Eleven" and "Satyabhama" in Telugu.

ఈ నెల 29 నుంచి అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న నవీన్ చంద్ర వెబ్ సిరీస్ "ఇన్స్ పెక్టర్ రిషి"

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్...ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న నవీన్ చంద్ర..ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. దీంతో నేరుగా ఆయన లీడ్ రోల్ లో కోలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇన్స్ పెక్టర్ రిషి. అమోజాన్ తమిళ్ ఒరిజినల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది.

హారర్ క్రైమ్ కథతో ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఎలాంటి క్లూ లేకుండా జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అంతు చిక్కని ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనేది సస్పెన్స్, హారర్ అంశాలతో ఆసక్తికరంగా ఇన్స్ పెక్టర్ రిషిలో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ఏలెవన్, సత్యభామ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%