Lambasingi is a pure honest love story : Director Naveen Gandhi.

ఒక స్వచ్ఛమైన నిజాయితీ ప్రేమకథ లంబసింగి : దర్శకుడు నవీన్ గాంధీ.

హృదయాన్ని కదిలించే ఫీల్ గుడ్ లవ్ స్టొరీ లంబసింగి : దర్శకుడు నవీన్ గాంధీ.

భరత్‌ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో ఆనంద్.టి నిర్మిస్తున్న చిత్రం లంబసింగి. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. లంబసింగి మార్చి 15న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు నవీన్ గాంధీ ఇంటర్వ్యూ...

2001 లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ కు కో డైరెక్టర్ గా చేశాను. అలా రాజమౌళి గారి దగ్గర స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాలకు దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను. తరువాత కె.రాఘవేంద్ర రావు గారి దగ్గర, ముళ్ళపూడి వర దగ్గర వర్క్ చేశాను. అలాగే రాజీవ్ మీనన్ దగ్గర యాడ్స్ చేసాను.

ఆది సాయికుమార్ తో 2014 లో గాలిపటం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఆ తరువాత చెన్నై లో యాడ్స్ చేశాను.

2021 లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బ్యానర్ స్టార్ట్ చేసి కథలు వింటున్నాడని తెలిసి నేను అతన్ని కలకడం జరిగింది. ఒక కథ చెప్పాను తరువాత కరోన రావడంతో షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం అయ్యింది.

ఒక స్వచ్ఛమైన ప్రేమకథను కళ్ళకు కట్టినట్లు సహజంగా చెప్పాలని లంబసింగి సినిమాను తీశాను. కొత్తవారయితేనే బాగుంటుందని ఈ సినిమాను అంతా కొత్త నటీనటులతో తీశాం. సినిమాలో ప్రతి పాత్ర ఒక రియలిస్టిక్ గా మన చుట్టు తిరిగే పాత్రల తరహాలో ఉంటాయి, అందుచేత అందరూ కనెక్ట్ అవుతారు.

ప్రేమకథలకు సంగీతం ప్రధానం, అందుచేత సాంగ్స్ పై ప్రేత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పాటలను సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ తో చేయించడం జరిగింది. నచ్చేసిందే నచ్చేసిందే... వయ్యరి గోదారి... రామచిలక... డోలారే.. ఇలా అన్ని పాటకు వేటికవే మంచి ఆదరణ పొందాయి. ఆడియో మంచి సక్సెస్ అయ్యింది.

లంబసింగి అనే ఏజెన్సీ ప్రాంతంలో 50 రోజుల్లో సింగల్ షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం అందరి సపోర్ట్ తో పూర్తి చేయడం జరిగింది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%