Maruthi Nagar Subramanyam 1st Look: Rao Ramesh In Lungi Avatar

'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో హీరోగా రావు రమేష్... ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్... 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్ ఫస్ట్ లుక్ చూస్తే... గళ్ళ చొక్కా, లుంగీలో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. ఈసారి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తానని రావు రమేష్ తెలిపారు.

సాధారణంగా సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించడం కామన్. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీమ్ కొత్తగా ఆలోచించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా క్యూఆర్ స్కానింగ్ ద్వారా లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్ టైమ్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' టీమ్ చేసిన కొత్త ప్రయత్నానికి సూపర్బ్ రెస్పాన్స్ లభించింది.

'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్ చేస్తారు. వినోదంతో పాటు భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్ గారి లుక్ చాలా బావుందని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేయమని మేం చేసిన విజ్ఞప్తికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. 50 వేల మందికి పైగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. రావు రమేష్ గారి ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అభిమానం మాకెంతో సంతోషం కలిగిస్తోంది. కుటుంబం అంతా కలిసి చూసేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఉంటుంది'' అని చెప్పారు.

రావు రమేష్ మాట్లాడుతూ... ''సినిమా చాలా బాగుంటుంది. భలే గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చూపించిన అభిమానానికి సదా కృతజ్ఞుడిని'' అని చెప్పారు.

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య.

Maruthi Nagar Subramanyam 1st Look: Rao Ramesh In Lungi Avatar

Versatile and veteran actor Rao Ramesh is turning the main lead for his upcoming film Maruthi Nagar Subramanyam and the first look poster of the film was unveiled by the makers today.

Instead of a standard style of unveiling the first look, the makers launched a QR code that lets the common public unveil the first look poster on their own. This is the first time in Tollywood that a film poster is getting launched by the common public through a QR code and it is an innovative way to get the public involved with the poster unveiling.

Once the code is scanned, we see the poster. It is estimated that at least 50,000 people, and potentially countless people have scanned and unveiled the poster on their mobile phones. Going by the early trends, a lot more than 50,000 people have launched the poser. The makers have expressed happiness over thousands of common people actively launching the poster.

Coming to the poster, Rao Ramesh instantly grabs the attention with his Lungi avatar. The energetic demeanor and lively facial expression of the acclaimed actor give an indication that he is set to entertain the audience big time with Maruthi Nagar Subramanyam.

Maruthi Nagar Subramanyam is billed to be a thoroughly entertaining family oriented film and the entire shooting has been wrapped up. The promotional campaign has started through this first look poster which has Rao Ramesh in a lovely avatar.

The film is directed by Lakshman Karya and produced by Bujji Rayudu Pentyala and Mohan Karya under PBR Cinemas and Lokamaatre Cinematics.

Movie details :

Film : Maruthi Nagar Subramanyam

Starring : Rao Ramesh , indraja , Ankith koyya , Ramya Pasupuleti , Harsha Vardhan , Ajay and Annapurnamma, praveen.

Story, Screen play , Dialogues & Direction – Lakshman Karya

Produced by : PBR CINEMAS & LOKAMAATRE CINEMATICS

Producers - Bujji Rayudu Pentyala, Mohan Karya

Co – producers - Rushi Marla , Siva Prasad Marla

Line producer - Sri Hari Udayagiri

Music – Kalyan Nayak

Cinematography – MN Balreddy

Editor - Bonthala Nageswara Reddy

Art director – Suresh Bhimagani

Styling – Nishma Thakur

Creative head [ PBR cinemas ] – Gopal Adusumalli

Lyrics – , Oscar winner Chandra bose , Bhaskara Bhatla, kalyan Chakravarthy Sound design – Venkatesh Kindhibavi

Publicity design – Ananth Kancherla

PRO – Pulagam Chinnarayana

Co – director - Shyam Mandala

Chief associate director - Harsha Vardhan Chitimireddy Direction team – Satya Punganur, Swaroop Kodi , PA Naidu Di – Annapurna Studios, Hyderabad

Colorist – Surya Prakash

Dubbing – Prasad labs, Hyderabad

Digital pro : cinema chronicle

Vfx : SHARATH KERNAKOTA & Venkata Ramana Gunti

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.