Lambasinghi trailer gives a fresh feel, best wishes to the film unit : Harish Shankar !!!

లంబసింగి ట్రైలర్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది, చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ : హరీష్ శంకర్ !!!

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరి లో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది.

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక.

ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్ గా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ... కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాల అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివి కి అలాగే భరత్ రాజ్ కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

నటీనటులు:
భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కూరసాల
కథ, మాటలు ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్.టి
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్
కెమెరామెన్: కె.బుజ్జి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: కె.విజయ్ వర్ధన్
లిరిక్స్: కాసర్ల శ్యామ్

https://youtu.be/IZR_EPwRj14?si=wdjs_bE_-U4pGERQ

Many people think of touring hill stations like Shimla, Ooty, Kashmir in summer! Because… because it's cold there! Andhra also has one such hill station. Andhra became popular as Kashmir. That is 'Lambasinghi'. Now a love story that happened in that town is being made into a movie.

With the film 'Lambasinghi', famous director Kalyan Krishna Kurasala entered into film production. He is the presenter of this film directed by Naveen Gandhi. Introducing Bharat Raj as the protagonist... 'Bigg Boss' fame Divi is being produced by Anand.T under the banner of Concept Films. The subtitle of this film is 'A Pure Love Story'.

The recently released songs of this movie "Nachchesinde... Dolare... Vayyari Godari" have received a great response. The latest theatrical trailer of the film has been released by the director Harish Shankar.

On this occasion, famous director Harish Shankar wished the entire team all the best, and with Kalyan Krishna being the producer, he said it feels like his own movie. The trailer is impressive, with all the real locations adding authenticity to the film. Director Naveen Gandhi seems to be telling a beautiful love story through the movie Lambasinghi. He said that he wants this movie to turn out to be a game changer for everyone involved. Lambasingi is all set to be released on March 15.

Actors:
Bharat Raj, Divi, Vamsi Raj, Kittaiah, Nikhil Raj, Janardhan, Anuradha, Madhavi, Naveen Raj, Pramod, Ramana, Paramesh and others.

Technicians:
Submitted by: Kalyan Krishna Kursala
Story, Words, Screenplay, Directed by: Naveen Gandhi
Producer: Anand.T
Banner: Concept Films
Cameraman: K.Buzzi
Music by: RR Dhruvan
Editor: K.Vijay Vardhan
Lyrics: Kasarla Shyam

https://youtu.be/IZR_EPwRj14?si=wdjs_bE_-U4pGERQ

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%