Fans take out a rally to celebrate Icon Star's arrival
Icon Star Allu Arjun enjoys phenomenal popularity. He is currently in Vizag to shoot for 'Pushpa: The Rule', the most-awaited pan-Indian action extravaganza directed by Sukumar. Mythri Movie Makers, in association with Sukumar Writings, is mounting a big-canvas schedule.
Bunny, upon his arrival in Vizag, was on Sunday greeted by a sea of outstretched hands and passionate shouts of admiration. It was a reception to remember and a testament to his charm and undeniable appeal. As Allu Arjun arrived at the Vizag airport, the atmosphere erupted into a frenzy of excitement and adoration. The crowd's cheers and screams echoed through the air. Many from the crowd vied to snap a photo of their beloved idol.
A massive rally ensued all the way to the hotel where Bunny is boarding. The versatile actor was visibly touched by the gesture of his loving fans.
'Pushpa 2' is gearing up for a grand theatrical release worldwide on August 15, 2024.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌తో అభిమానం చాటుకున్న ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్కడికి వెళ్లిన ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెలకమ్ లభిస్తుంది. తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభమైంది. అత్యంత కీలకంగా భావించే ఈ షెడ్యూల్‌లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్‌స్టార్‌కు అల్లుఅర్జున్‌కు అక్కడి అభిమానులు, గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి అభిమానులు బైక్ ర్యాలిగా బయలుదేరి తమ అభిమాన హీరో కనివినీ ఎరుగని వెల్‌కమ్ చెప్పారు. దారి పొడవున పూలవర్షం కురిపించారు. అభిమానులు ఆప్యాయతను చూసి ఐకాన్‌స్టార్ ఫిదా అయిపోయారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.