Save The Tiger 2 Preview event gets blockbuster response, super hit series will be streaming from March 15th on Disney + Hotstar

Save The Tiger 2 Preview event gets blockbuster response, super hit series will be streaming from March 15th on Disney + Hotstar

The super hit web series 'Save the Tigers' Season 2 is set to be streamed on Disney+ Hotstar from the 15th of this month. Mahi V. Raghav and Pradeep Advaita created this web series, directed by Arun Kothapally. The lead roles in this series are played by Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Pavani, Jordar Sujatha, Srikanth Iyengar, Gangavva, Venu Yeldandi, Seerat Kapoor, Pavani Gangireddy, Devayani, Darshan Banik, and Harsha Vardhan. A preview event was held today at Prasad Labs, Hyderabad. In this event:

Director-producer Mahi V. Raghav said, "In the case of the 'Save the Tigers' web series, first of all, we should say thank Disney+ Hotstar. I think this is the first series that got a second season in advance. Performance of artists is more important than writing in such fun, entertaining shows. Actors like Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Pavani, and Jordar Sujatha have all acted in this story very well. When we looked at the editing time, we saw the variation in response when we saw the series between you now. 'Save the Tigers' started from the idea of making a good comedy sitcom based on the funny moments that happen in our lives. Thanks to Pradeep who directed season 1, and now to Arun who directed season 2. We hope you like this second season too. There is an idea to do more seasons of 'Save the Tigers.' After four or five seasons, a film can be made by taking well-worked characters," said Raghav.

Writer Pradeep Advaitam said, "After the first season of the 'Save the Tigers' web series was a super hit, we approached Hotstar for the second season. But at that time, there was tension in us whether we can make the second season to surpass the first season or not. Hotstar has given us all the creative freedom. We think we have tried our best and done a good series. We hope you all like 'Save the Tigers 2'."

Director Arun Kothapally said, "After 'Save the Tigers' web series Season 1 became such a big hit, I was given a chance to direct Season 2. Thanks to Mahi, Hotstar, and Pradeep for that. Our entire team worked hard to come up better than the first season. Every scene was shot carefully. The artists and technicians were well supported. The first season was watched without any expectations. Now, watch it with expectations for Season 2, and you will love it."

Actress Pavani said, "'Save the Tigers' web series Season 1 was a hit. Now Season 2 is also known to be a hit. I am selective in every project I choose. We want to first like what we do. We enjoyed acting in the 'Save the Tigers' series. Arun directed Season 2 very well. Pradeep worked tirelessly on the creative side. Any actors would be lucky to be part of this series. I want more seasons of 'Save the Tigers.'"

Actor Abhinav Gomatam said, "After the success of the first season of the web series 'Save the Tigers', the talks for Season 2 started immediately. I doubted if there would be time for writing if Season 2 was done so soon. But I read the entire script before going to shoot. Our team wrote the script brilliantly. Arun directed superbly. Pradeep doesn't speak much outside, but they speak through the script. While doing political films, Mahi is doing good series like 'Save the Tigers.' He wants to continue 'Save the Tigers.' This series became such a big hit because of the support given by the media. I want your support for the second season as well."

Actress Devayani said, "Season 2 of 'Save the Tigers' will be twice as much fun as the first season. Hope all of you who watched the preview liked our series. Happy to be a part of such a good series. Watch 'Save the Tigers 2' on Hotstar on the 15th of this month."

Actor Chaitanya Krishna said, "We had a lot of fun while making 'Save the Tigers' Season 2. But it seems like it will be received like the first season. Now, seeing your response in the preview, we are confident of another success. Thanks to Mahi, Pradeep, and Arun for giving me the opportunity to act in this series."

Actress Jordar Sujatha said, "You all enjoyed watching 'Save the Tigers' Season 1. This season will also be seen laughing comfortably with the family. Hope Season 3 comes soon too. After the first season of this series was a hit, we got a little tense knowing that a new director is coming for the second season. But he worked coolly with everyone and knew how to work. Thanks to everyone who supported me while acting in this series."

Actor Priyadarshi said, "I am very happy with the response you have shown in this preview show. The credit for 'Save the Tigers' Season 2 goes to our writing team. Pradeep Anna, Vijay, and Karthik have given a superb script. Our director Arun brought that script and the writer's vision to the screen. Mahi Anna has been traveling with us on every occasion since Season 1. They used to guide us while making films. He created a great series. Watch 'Save the Tigers 2' on Disney+ Hotstar together with women, men, and family audiences."

ఘనంగా ‘సేవ్ ద టైగర్స్ 2’ ప్రివ్యూ ఈవెంట్. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్.

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్ ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో

దర్శక నిర్మాత మహీ వి రాఘవ్ మాట్లాడుతూ - ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ విషయంలో ముందుగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగానే సీజన్ 2 కూడా అనుకుని ఓకే చేయించుకున్న ఫస్ట్ సిరీస్ ఇదే అనుకుంటా. ఇలాంటి ఫన్ ఎంటర్ టైనింగ్ షోస్ లో రైటింగ్ కంటే ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ చాలా ముఖ్యం. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత వంటి యాక్టర్స్ అంతా ఈ కథని ఓన్ చేసుకుని నటించారు. మేము ఎడిటింగ్ టైమ్ లో చూసినప్పుడు, ఇప్పుడు మీ మధ్య సిరీస్ చూసినప్పుడు రెస్పాన్స్ లో వేరియేషన్ చూశాం. మన జీవితాల్లో జరిగే సరదా సందర్భాలను, క్యారెక్టర్ బేస్డ్ గా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి సేవ్ ద టైగర్స్ మొదలైంది. సీజన్ 1 చేసిన ప్రదీప్ కు, ఇప్పుడు సీజన్ 2కు డైరెక్షన్ చేసిన అరుణ్ కు థ్యాంక్స్. ఈ సెకండ్ సీజన్ కూడా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. సేవ్ ద టైగర్స్ లో మరిన్ని సీజన్స్ చేయాలనే ఆలోచన ఉంది. నాలుగైదు సీజన్స్ తర్వాత ఇందులో బాగా వర్కవుట్ అయిన క్యారెక్టర్స్ ను తీసుకుని సినిమా కూడా చేసుకోవచ్చు. అన్నారు.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ - ‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన తర్వాత సెకండ్ సీజన్ కోసం హాట్ స్టార్ ను అప్రోచ్ అయ్యాం. అయితే ఫస్ట్ సీజన్ ను మరిపించేలా సెకండ్ సీజన్ చేయగలమా లేదా అనే టెన్షన్ ఆ టైమ్ లో మాలో ఉండేది. క్రియేటివ్ ఫ్రీడమ్ మొత్తం హాట్ స్టార్ వాళ్లు మాకే వదిలిపెట్టారు. మేము మా శక్తిమేరకు ప్రయత్నించి, మంచి సిరీస్ చేశామనే భావిస్తున్నాం. మీ అందరికీ ‘సేవ్ ద టైగర్స్ 2’ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

దర్శకుడు అరుణ్ కొత్తపల్లి మాట్లాడుతూ - ‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్ సీజన్ 1 అంత పెద్ద హిట్ అయిన తర్వాత సీజన్ 2కు డైరెక్షన్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చారు. అందుకు మహీ గారికి , హాట్ స్టార్, ప్రదీప్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఫస్ట్ సీజన్ కంటే బాగా రావాలని మా టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రతి సీన్ కూడా జాగ్రత్తగా తీశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ సీజన్ ను ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూశారు. ఇప్పుడు సీజన్ 2కు ఎక్స్ పెక్టేషన్స్ తో చూసినా మీకు నచ్చుతుంది. అన్నారు.

నటి పావని మాట్లాడుతూ - ‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్ సీజన్ 1 ను హిట్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 కూడా హిట్ చేస్తారని తెలుసు. నేను ఎంచుకునే ప్రతి ప్రాజెక్ట్ లో సెలెక్టివ్ గా ఉంటాను. చేసే పని మనకు ముందుగా నచ్చాలని అనుకుంటా. సేవ్ ద టైగర్స్ సిరీస్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. అరుణ్ గారు సీజన్ 2ను బాగా డైరెక్ట్ చేశారు. క్రియేటివ్ సైడ్ ప్రదీప్ గారు రెస్ట్ లెస్ గా వర్క్ చేశారు. ఈ సిరీస్ కు ఎలాంటి యాక్టర్స్ ఉండాలో లక్కీగా వారంతా దొరికారు. సేవ్ ద టైగర్స్ లో మరిన్ని సీజన్స్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ - ‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సక్సెస్ అయిన తర్వాత వెంటనే సీజన్ 2కు చర్చలు మొదలుపెట్టారు. ఇంత త్వరగా సీజన్ 2 చేస్తే రైటింగ్ కు టైమ్ ఉంటుందా అని నేను సందేహించాను. అయితే షూటింగ్ కు వెళ్లే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివాను. మా టీమ్ అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. అరుణ్ సూపర్బ్ గా డైరెక్షన్ చేశాడు. మా ప్రదీప్ బయట మాట్లాడరు. కానీ స్క్రిప్ట్ తోనే మాట్లాడుతారు. మహీ గారు పొలిటికల్ సినిమాలు చేస్తూనే సేవ్ ద టైగర్స్ వంటి మంచి సిరీస్ లు చేస్తున్నారు. ఆయన సేవ్ ద టైగర్స్ ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే అందుకు మీడియా ఇచ్చిన సపోర్ట్ కారణం. సెకండ్ సీజన్ కు కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

నటి దేవయాని మాట్లాడుతూ - సేవ్ ద టైగర్స్ ఫస్ట్ సీజన్ కు రెండింతల ఫన్ సీజన్ 2లో చూస్తారు. ప్రివ్యూ చూసిన మీ అందరికీ మా సిరీస్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి సిరీస్ లో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. ఈ నెల 15న సేవ్ ద టైగర్స్ 2 హాట్ స్టార్ లో చూడండి. అన్నారు.

నటుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ - సేవ్ ద టైగర్స్ సీజన్ 2 చేస్తున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేశాం. అయితే ఫస్ట్ సీజన్ లా రిసీవ్ చేసుకుంటారా అనిపించేది. ఇప్పుడు ప్రివ్యూలో మీ రెస్పాన్స్ చూస్తుంటే మాకు మరో సక్సెస్ దక్కిన నమ్మకం కలుగుతోంది. నాకు ఈ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన మహీ, ప్రదీప్, అరుణ్ కు థ్యాంక్స్. అన్నారు.

నటి జోర్దార్ సుజాత మాట్లాడుతూ - సేవ్ ద టైగర్స్ సీజన్ 1 ను మీరంతా చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఈ సీజన్ కూడా ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ చూస్తారు. సీజన్ 2 కూడా త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ హిట్టయ్యాక సెకండ్ సీజన్ కు కొత్త దర్శకుడు వస్తున్నాడని తెలిసి కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ ఆయన ఎవరితో ఎలా వర్క్ చేయించుకోవాలో కూల్ గా పర్ ఫార్మ్ చేయించారు. ఈ సిరీస్ లో నటిస్తున్నప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ - ఈ ప్రివ్యూ షోలో మీరు చూపించిన రెస్పాన్స్ కు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ మా రైటింగ్ టీమ్ కు ఇవ్వాలి. ప్రదీప్ అన్న, విజయ్, కార్తీక్ సూపర్బ్ స్క్రిప్ట్ ఇచ్చారు. మా డైరెక్టర్ అరుణ్ ఆ స్క్రిప్ట్, రైటర్స్ విజన్ ను సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మహీ అన్న సీజన్ 1 నుంచి ప్రతి సందర్భంలో మాతో ట్రావెల్ చేస్తున్నారు. అటు సినిమాలు చేస్తున్నా..మమ్మల్ని గైడ్ చేసేవారు. ఒక గొప్ప సిరీస్ ను ఆయన క్రియేట్ చేశారు. వుమెన్, మెన్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ 2 చూడండి. అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%