Patang’ lyrical video song released Hyderabad’s Old City ‘Hey Hello.. Namasthe’ song unveiled by Oscar winner Chandra Bose and popular director KV Anudeep

పాత‌బ‌స్తీలో వినూత్నంగా విడుద‌లైన ‘పతంగ్’ లిరిక‌ల్ వీడియో సాంగ్

హే.. హ‌లో.. న‌మ‌స్తే సాంగ్‌ను విడుద‌ల చేసిన ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్‌, పాపుల‌ర్ డైరెక్ట‌ర్ కేవీ అనుదీప్

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలోని హే హ‌లో.. న‌మ‌స్తే అంటూ కొన‌సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను శ‌నివారం హైద‌ర‌బాద్‌లోని పాత‌బ‌స్తీలో వినూత్నంగా విడుద‌ల చేశారు. ఈ పాట‌ను ప్రముఖ పాట‌ల ర‌చ‌యిత, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ చంద్ర‌బోస్‌, పాపుల‌ర్ ద‌ర్శ‌కుడు అనుదీప్ కేవీలు ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా చంద్ర‌బోస్ మాట్లాడుతూ ఈ వేడుక‌కు రావ‌డం ఎంతో సంతోషంగా వుంది. నేను ఈ రోజు ఇక్క‌డికి రావ‌డానికి కార‌ణం ఈ చిత్రం క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ నాని బండ్రెడ్డి. ఆయ‌న ప్ర‌తిభ గురించి నాకు తెలుసు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర కూడా త్వర‌లో రాబోతుంది. త‌న ద‌ర్శ‌క‌త్వ అనుభ‌వంతో ఈ సినిమాకు క్రియేటివ్ నిర్మాత‌గా వున్నాడు. ఈ సినిమా నానికి మంచి పేరును తెచ్చిపెడుతుంది. అంతేకాదు
ఈ చిత్రం అంతా నూత‌న న‌టీన‌టుల‌తో, సాంకేతిక నిపుణుల‌తో ఉన్న‌తంగా తీర్చిదిద్డ‌బ‌డింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించి అంద‌రికి మంచి పేరును తీసుక‌రావాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.జోస్ జిమ్మి సంగీతం కూడా చాలా విన‌సొంపుగా వుంది. ఆయ‌న‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి భ‌విష్య‌త్తు వుంది. అలాగే ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌ణ‌వ్ మంచి గాయ‌కుడు, ఈ చిత్రంతో న‌టుడిగా కూడా మంచి పేరును తీసుక‌వ‌స్తుంది. మిగ‌తా న‌టీన‌టుల‌కు కూడా ఈ సినిమా మైలురాయిగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. పాపుల‌ర్ ద‌ర్శ‌కుడు కేవీ అనుదీప్ మాట్లాడుతూ నాని నాకు మంచి మిత్రుడు. ఈ పాట నాకు బాగా న‌చ్చింది. ఈ చిత్రం అంద‌రికి మంచి పేరును తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన సంప‌త్ మ‌క మాట్లాడుతూ నేను ఈసినిమా చేయ‌డానికి ఒకే ఒక్క కార‌ణం నాని. కేవ‌లం అత‌ని మీద న‌మ్మ‌కంతో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వున్న నేను ఈ సినిమాతో నిర్మాత‌గా మారాను. ఈ పాట విని సినిమా చేయ‌డానికి ఓకే అన్నాను. ఈ పాట‌తోనే మా జ‌ర్నీ ప్రారంభం అయింది. హైద‌రాబాద్ బ్యూటీని చాటి చెప్పే ఈ పాట హైద‌రాబాద్ యాంథ‌మ్‌గా నిలిచిపోతుంది అన్నారు. క్రియేటివ్ నిర్మాత నాని మాట్లాడుతూ ఈ సినిమాకు ఇద్ద‌రు హీరోల‌తో పాటు క‌నిపించ‌ని మ‌రో ఇద్ద‌రు హీరోలు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్‌, సంగీత ద‌ర్శ‌కుడు జోస్ జిమ్మి ఈ చిత్రంతో జోస్ జిమ్మి ని కనీసం ఓ ద‌శాబ్దం గుర్తుపెట్టుకుంటారు అన్నారు. ఈ చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ నానికి మేజ‌ర్ యాక్సిడెంట్ జ‌రిగిన‌ప్ప‌డు టీమ్ అంతా ఎంతో క‌ల‌త చెందార‌ని, అస‌లు బ‌తుకుతాడో లేదో అనుకున్ననాని డాక్ట‌ర్ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ అతి త్వ‌ర‌లోనే కోలుకుని ఈ రోజు మీ ముందుకు వ‌చ్చాడ‌ని, సినిమా మీద వున్న ప్రేమే అత‌డ్ని బ‌తికించింద‌ని ఎగ్యిక్యూటివ్ నిర్మాత నిఖిల్ కోడూరు తెలిపారు. ఈ వేడుక‌లో హీరోలు ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్, హీరోయిన్‌ ప్రీతి ప‌గ‌డాల‌, సంగీత ద‌ర్శ‌కుడు జోస్ జిమ్మి, కొరియోగ్రాఫ‌ర్ ఆట సందీప్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: శ‌క్తి అర‌వింద్‌, సంగీతం: జొస్ జిమ్మి, ఎడిట‌ర్‌: చాణ‌క్య రెడ్డి, ప్రొడ‌క్ష‌న్ డిజైనర్: వెంక‌ట్ శాతావాహ‌న‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్: మేఘన శాతావాహ‌న

Patang' lyrical video song released Hyderabad's Old City*

'Hey Hello.. Namasthe' song unveiled by Oscar winner Chandra Bose and popular director KV Anudeep

Until now, the audience has seen many sports dramas in Indian cinema. But for the first time, a comedy sports drama film has been made. Its title is 'Patang'. Kite competition is at the core of the film, which has been jointly produced by Vijay Sekhar Anne, Sampath Maka, and Suresh Kothinti under the banner of Cinematic Elements and Rishan Cinemas. It is directed by Praneeth Prattipati. Naani Bandreddi is its creative producer. The film stars Instagram sensation Preethi Pagdala, Zee Sarigama runner-up Pranav Kaushik, and Vamsi Pujit in lead roles. Famous singer and actor SP Charan is going to be seen in a pivotal role in this film along with a few new actors.

The film has completed its shooting and will hit the screens this Summer. Meanwhile, a lyrical video song from 'Patang' has been released. 'Hey Hello.. Namasthe' is its title. It was released innovatively on Saturday in the old city of Hyderabad. This song was released by famous lyricist and Oscar award-winner Chandra Bose and popular director Anudeep KV.

On this occasion, Chandra Bose said that he was very happy to attend the event. "The reason I am here today is because of the creative producer of this film, Naani Bandreddi, who is such a talent. A film directed by him is also coming soon. He is the creative producer of this movie, thanks to his directorial experience. This movie will bring him a good name. Moreover, this film has platformed new actors and technicians. I hope that this film becomes a big success and brings a good name to everyone. Jose Jimmy's music is also very pleasant. He has a bright future as a music director. Pranav, who acted in this movie, is a good singer and will earn a good name," the lyricist said.

Popular director KV Anudeep said, "Nani is my best friend. I like this song very much. I want this film to bring a good name to everyone."

Sampath Makka, one of the producers, said, "Nani is the only reason for making this movie. I, who was in the software field, became a producer with this film just by trusting him. After listening to this song, I said OK to do the film. Our journey started with this song. This song, which extols the beauty of Hyderabad, will remain the anthem of Hyderabad."

Creative producer Nani said, "The film's director Praneeth, and music director Jose Jimmy will be remembered at least for a decade."

Executive Producer Nikhil said, "When the creative producer of this film met with a major accident, the entire team was very upset. He surprised even the doctors who thought that he would survive or not. He recovered very quickly. It was his love for the film that kept him alive."

Along with heroes Pranav Kaushik, and Vamsi Pujit, heroine Preethi Pagdala, music director Jose Jimmy, choreographer Aata Sandeep and others participated in this ceremony.

Cinematographer: Shakthi Aravind, Music: Jose Jimmy, Editor: Chanakya Reddy, Production Designer: Venkat Saathavahana, Costume Designer: Meghana Saathavahana

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.