సినిమా రివ్యూ: భామా కలాపం 2
రేటింగ్: 3/5
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, సందీప్ వేద్ తదితరులు
ఛాయాగ్రహణం: దీపక్ యారగెరా
కథ, స్క్రీన్‌ప్లే: అభిమన్యు తడిమేటి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాతలు: బాపినీడు భోగవల్లి, సుధీర్ ఈదర
దర్శకత్వం: అభిమన్యు తడిమేటి
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2024
ఓటీటీ ప్లాట్‌ఫాం: ఆహా
హాట్ బ్యూటీ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భామాకలాపం’ 2022లో విడుదల అయి బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: గతంలో వచ్చి మంచి ప్రేక్షకదరణ పొందిన మొదటి భాగం పూర్తయిన దగ్గర నుంచే ఈ భాగం స్టార్ట్ అవుతుంది. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిపోయిన తర్వాత అనుపమ (ప్రియమణి) జీవితం మరింత ఆనందంగా మారుతుంది. యూట్యూబ్‌లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ మార్కును దాటతారు. తర్వాత పాత ఇంట్లో పని మనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) పార్ట్‌నర్‌గా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్‌కు అప్లై చేస్తారు. మరోవైపు ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలాగే తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా (సీరత్ కపూర్) ఐదు సంవత్సరాలుగా ఆంథోని లోబోతో ఉంటూ వస్తుంది. ఈ డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు ఎందుకు వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: సీక్వెల్స్ కి ప్లాట్ సేమ్ వున్నా... స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. అయితే గతంలో వచ్చిన ‘భామా కలాపం’తో పోలిస్తే ఈ సీక్వెల్ జోనరే వేరు. మొదటి భాగం ఒకే అపార్ట్‌మెంట్‌లో జరిగే మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగం హెయిస్ట్ థ్రిల్లర్ జోనర్. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అనుపమ కథ, ట్రోఫీ కథ, మరో పోలీసాఫీసర్ కథ సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఈ మూడు కథలూ కలుస్తాయో అక్కడ నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది. ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల మధ్య కెమిస్ట్రీనే. వీరిద్దరూ కలిసి కనిపించిన సీన్లలో ఫన్ బాగా వర్క్ అవుట్ అయింది. బయట నుంచి ఒకరు ఉండి టీమ్‌ను నడిపించడం, లోపల ఉన్నవాళ్లు దొంగతనాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనే పాపులర్ ఫార్ములాను ఇందులో కూడా ఫాలో అయ్యాయి. ఇలాంటి హెయిస్ట్ థ్రిల్లర్లకు దొంగతనాన్ని ఎలా చేశారు అనే విధానమే ప్రధాన ఆయువు పట్టు. ఆ విషయంలో ‘భామా కలాపం 2’ సక్సెస్ అయింది. ఆ హెయిస్ట్ ఎపిసోడ్ చాలా ఎక్సైటింగ్ కలిగిస్తుంది. ప్రియమణి మల్టీ టాస్కింగ్, ఆ సమయంలో శరణ్య ప్రదీప్ కన్ఫ్యూజన్ బాగా నవ్విస్తాయి. సెకండాఫ్‌లో ప్రియమణి దొంగతనానికి వెళ్లే సీన్, క్లైమ్యాక్స్ బాగున్నాయి. ఇందులోనే సీక్వెల్‌కు లీడ్ ఇచ్చారు. వచ్చే భాగం విదేశాల్లో ఉంటుందన్నట్లు చూపించడం కొసమెరుపు. ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల క్యారెక్టరైజేషన్స్ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి సరైన స్టోరీలు పట్టుకుంటే తెలుగులో ఒక ఓటీటీ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది.
సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన స్వప్న సుందరి పాట వినటానికి, చూడటానికి కూడా బాగుంటుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యారగెరా విజువల్స్ బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు సినిమాని నిర్మించారు.
తెలివైన గృహిణి పాత్రలో ప్రియమణి ఆకట్టుకుంటారు. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్‌తో ఇందులో అనుపమ పాత్ర కనిపిస్తుంది. ఆ ఛేంజ్‌ను ప్రియమణి చాలా చక్కగా స్క్రీన్‌పై చూపించారు. ఇక శరణ్య ప్రదీప్ పాత్ర కూడా మొదటి భాగం కంటే మరికొంచెం ఫన్నీగా ఉంటుంది. తను చక్కగా నటించారు. సీరత్ కపూర్, సందీప్ వేద్, అనూజ్ గుర్వారా, రఘు ముఖర్జీ, రుద్ర ప్రదీప్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇలాంటి జోనర్ ఇష్టపడే వారు ఆహా ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ‘భామా కలాపం 2’ చూసి టైమ్ పాస్ చేయండి.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.