Social News XYZ     

Extra Ordinary Man Movie Review: An commercial entertainer (Rating: 3.25)

అశోక్, ఊసర వెల్లి , కిక్ , టెంపర్ తదితర సినిమాలకి మంచి స్క్రిప్ట్ అందించి తనకంటూ ఓ గుర్తింపు పొందిన రచయిత వక్కంతం వంశీ... అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా మారారు. తరవాత చాలా గ్యాప్ తీసుకుని నితిన్‌తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ను తీశాడు. ఈ మూవీతో నితిన్, వక్కంతం వంశీ ఇద్దరూ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన వక్కంతం వంశీ మరి ఈ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా? లేదా ఓ సారి చూద్దాం. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. అవి ఈ మూవీ సక్సెస్‌కు ఉపయోగపడ్డాయో లేదో ఓ సారి చూద్దాం.

కథ
జూనియర్ ఆర్టిస్ట్‌ అభి (నితిన్) ఎప్పటికైనా హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. హీరోగా ఎదగకుండా జూ. ఆర్టిస్ట్‌గానే మిగిలిపోతోన్న కొడుకుని చూసి తండ్రి సోమశేఖరం (రావు రమేష్) ఎప్పుడూ దెప్పి పొడుస్తుంటాడు. అలాంటి అభి లైఫ్‌లోకి ఓ సారి లిఖిత (శ్రీలీల) ఎంట్రీ ఇస్తుంది. కంపెనీ సీఈవో అయిన లిఖిత.. అభి టాలెంట్‌కు ఫిదా అవుతుంది. ప్రేమలో పడుతుంది. తన కంపెనీకి సీఈవోని కూడా చేయాలని అనుకుంటుంది. ఆ టైంలోనే అభికి హీరోగా ఛాన్స్ వస్తుంది. దాని కోసం అందరినీ వదిలేసుకుంటాడు అభి. చివరకు తనకు చెప్పిన స్క్రిప్ట్‌ చేజారిపోతుంది. కానీ స్క్రిప్ట్‌లో ఉన్న సీన్ తన జీవితంలోకి వస్తుంది. నీరో (సుదేవ్ నాయర్) తమ్ముడు లోకిని చంపేస్తాడు అభి. ఆ తరువాత అభి జీవితంలో చోటు చేసుకున్న మార్పులేంటి? ఎస్సై సాయి నాథ్‌గా మారి ఏం చేశాడు? చివరకు ఎర్రబాలుగా ఎందుకు అవతారం ఎత్తాల్సి వస్తుంది? ఈ కథలో ఐజీ విజయ్ చక్రవర్తి (రాజ శేఖర్) పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
తెరపై కామెడీని పండించడంలో నితిన్‌కు సపరేట్ స్టైల్ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో నితిన్ మూడు షేడ్స్‌లో కనిపిస్తాడు. పాత్రలకు తగ్గట్టుగా మూడు లుక్స్ ఉంటాయి. జూ ఆర్టిస్ట్‌గా, ఎర్రబాలుగా, ఎస్సై సాయి నాథ్‌గా ఇలా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడు. ఈ మూడు పాత్రల్లో నితిన్ యాక్టింగ్ ఎనర్జీ ఏ మాత్రం తగ్గదు. నితిన్ తనలోని కామెడీ యాంగిల్‌ను అందరికీ చూపించాడు. ప్రేక్షకుల్ని నితిన్ తెగ నవ్వించేస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌ అయితే మాస్‌కు నచ్చేలా ఉంటాయి. ఈ సినిమాలో రావు రమేష్ పాత్రకే ఎక్కువగా కనెక్ట్ అవుతారు. రావు రమేష్ నితిన్ మధ్య సీన్లు అందరినీ నవ్విస్తాయి. రాజ శేఖర్ కారెక్టర్ ఎనర్జీగా ఉంటుంది. శ్రీలీల అయితే పాటల కోసమే ఉన్నట్టుగా కనిపిస్తుంది. తెరపై అందంగా, పాటల్లో స్ప్రింగులా కనిపిస్తుంది. విలన్‌గా కనిపించిన సుదేవ్, సంపత్ పాత్ర, రోహిణి, బ్రహ్మాజీ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సోనియా, జబర్దస్త్ సత్య ఇలా అందరూ ఆకట్టుకుంటారు.

 

విశ్లేషణ
వక్కంతం వంశీ అనగానే మనకు రేసుగుర్రం, కిక్, కిక్ 2, టెంపర్ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే రైటర్‌గా ఎన్నో సక్సెస్‌లు చూసిన వక్కంతం వంశీ దర్శకుడిగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తీసుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడు. రేసుగుర్రంలోంచి కొంత.. కిక్ 2లోంచి కొంత తీసుకుని ఈ కథను రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎపిసోడ్స్‌ వైజ్‌లా చూస్తే ఈ సినిమా బాగుంటుంది. అందరినీ నవ్విస్తుంది.

ప్రథమార్దం ఫుల్ జోష్‌తో, ఎనర్జీగా కనిపిస్తుంది. నితిన్ కారెక్టరైజేషన్‌, ఫాదర్ అండ్ సన్ ట్రాక్‌ను వంశీ రాసుకున్న తీరు బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా నితిన్ చుట్టూనే కథ తిరుగుతుంది. శ్రీలీల అలా వచ్చిపోయినట్టుగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌ను ఎలా వాడుకుంటారో.. వంశీ సైతం అలానే ఓ మాట, ఓ పాట అన్నట్టుగా రాసుకున్నాడు. ఇంటర్వెల్‌కు కథ ఆసక్తికరంగా మారుతుంది. స్క్రిప్ట్‌లో జరగాల్సింది.. రియల్ లైఫ్‌లో జరగడం అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

సెకండాఫ్‌ను చూస్తే కాస్త రేసుగుర్రం చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక పోలీస్ స్టేషన్‌లో ఆ పాటలు, ఆ డ్యాన్సులు కాస్త ఓవర్ అనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లో రాజశేఖర్ పాత్రను బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. చివరకు ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్‌లోనూ ఎంటర్టైన్మెంట్‌ను మిస్ కాలేదు. కామెడీ పార్ట్‌ను వంశీ బాగా రాసుకున్నాడనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ సీన్లపై బాగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది.

టెక్నికల్‌గా ఈ మూవీ బాగుంది. కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ ఎంతో గ్రాండియర్‌గా అనిపిస్తుంది. దాని కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చుకి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమా వరకు హారిస్ జైరాజ్ పాటలు, ఆర్ఆర్ అంతా బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్ అద్భుతంగా పేలుతాయి. వాటికి ప్రేక్షకుడు కచ్చితంగా నవ్వుతాడు. నిర్మాణ పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు.

రేటింగ్: 3.25

Extra Ordinary Man Movie Review: An commercial entertainer (Rating: 3.25)

Facebook Comments
Extra Ordinary Man Movie Review: An commercial entertainer (Rating: 3.25)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.