Music Director Charan Arjun about Revanth Reddy

రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది : సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ !!!

2009 లో దర్శకుడు ఎన్. శంకర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు నాకు పరిచయం, అప్పటి నుండి ఆయనతో సన్నిహితంగా ఉన్నాను. నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డ్ నా పాటకు రావడం, ఆ అవార్డ్ ను చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. నాకు సొంత స్టూడియోను కూడా చంద్రబాబు గారు పెట్టించారు. 2014 లో రేవంత్ రెడ్డి అన్న తో పరిచయం ఆయన కోసం పాటలు చెయ్యడం జరిగింది, అప్పటినుండి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నాను. ఆ సమయంలో "తెలంగాణ పులిబిడ్డ నిన్ను మరవబోదు ఈ గడ్డ" సాంగ్ ను రాశాను, రేవంత్ రెడ్డి గారు జైల్ లో ఉన్నప్పుడు ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. తెలుగు దేశంలో ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ లో వెళ్ళినప్పుడు నేను ఆయనతో ఉన్నాను, అదే సమయంలో నన్ను వేరే వారు సాంగ్స్ చెయ్యమని అడిగినా కూడా నేను చెయ్యలేదు.

సందర్భం ఏదైనా రేవంత్ రెడ్డి అన్న నాతో పాట రాయించుకొనేవారు, అన్న పిసిసి అద్యేక్షుడు అయ్యే రోజు మూడు రంగుల జండా అనే పాటను రాయడం జరిగింది. పార్టీ జనాల్లోకి వెళ్ళడానికి ఈ పాట ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధి గారు ఈ సాంగ్ ను ఎంతో మెచ్చుకున్నారు. ఈ పదేళ్ళలో జరిగినవన్నీ రేవంత్ అన్న నాకు చెప్పారు, రాజకీయాలతో సంభంధం లేకుండా ఒక కళాకారుడిగా నేను రేవంత్ అన్నతో ఉన్నాను. ఈరోజు ఆయన విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది, ఇదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని రచయిత, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు.

సినిమాల ద్వారా నేను నాలెడ్జ్ సంపాదించుకున్నాను, ఎంతో పేరు తెచ్చుకున్నాను, విమానం , భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో గుర్తింపు వచ్చింది. అలాగే ఇండిపెండెంట్ సాంగ్స్ తో ప్రజల్లో మంచి పేరు వచ్చింది. రేవంత్ అన్న ద్వారా నాలాంటి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. కళారంగం అభివృద్ధికి నా వంతుగా ప్రభుత్వం అండతో రచయితలు, కవులు, గాయకులను వెలికితీయలనేది నా కోరిక అని చరణ్ అర్జున్ అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.