నటీనటులు:
విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని, అమిత రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల, మధు తదితరులు
టెక్నిషియన్స్
బ్యానర్: NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్
నిర్మాత: నవీన్ కురువ, కిరణ్ కురువ
రచన దర్శకత్వం: భరత్ మిత్ర
సహానిర్మాత: హేమంత్ రామ్ సిద్ధ
సంగీత దర్శకుడు: గోపి సుందర్
సినిమాటోగ్రాఫర్: ప్రేమ్ అడవి
ఎడిటర్: హరీష్ శంకర్TN
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ సామల
ఆర్ట్ డైరెక్టర్: గణేష్
కో డైరెక్టర్: రామ్ GV
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: కొండ నాయుడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ నాయుడు అల్లం
డిజిటల్ పీఆర్ఓ: మురళి కృష్ణ సురపనేని
పీఆర్ఓ: హరీష్, దినేష్
NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఏం చేస్తున్నావ్'. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో విడుదలైన పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు 25 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఏం చేస్తున్నావ్?' సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ
బి.టెక్ పూర్తి చేయలేక సప్లీలు రాస్తూ ఖాళీగా ఉండే సాయి (విజయ్ రాజ్ కుమార్) తండ్రి ఓ గవర్నమెంట్ ఉద్యోగి. తనలాగే తన కొడుకు సాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయ్యి సుఖంగా జీవించాలనేది అతని కోరిక. అయితే సాయికి మాత్రం తన తండ్రిలాగా ఉద్యోగం చేసే ఇష్టం లేక ఎదో ఒకటి స్వతంత్రంగా ఎదగాలనే తాపత్రయం పడుతూ ఎం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో బ్రతుకుతూ ఉంటాడు. దీంతో చుట్టు ప్రక్కల వారంతా కూడా ‘ఏం చేస్తున్నావ్?’ సాయి అంటూ అదుగుతూ బాగా విసుగు తెప్పిస్తుంటారు. అయితే అనుకోకుండా ఒకరోజు నక్షత్ర(నేహా పఠాన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్దపడగా నక్షత్ర తండ్రి తన కున్న హోటల్ బిజినెస్ ను చూసుకోమని చెప్తారు. ఆది ఇష్టం లేని సాయి పెళ్లి చేసుకోనని నక్షత్రను దూరం పెడతాడు.దాంతో సాయి తండ్రికి కోపం వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వద్దు అంటావ్, బిజినెస్ వ్యవహారాలు చూసుకోను అంటున్నావు జీవితంలో ఏం సాధించాలని అంటుకుంటున్నావ్ అంటూ ప్రశ్నించిన తండ్రి మాటలకు సమాధానం చెప్పలేక మనసుమార్చుకొని ఉద్యోగం చేస్తాడా? అసలు తను కన్న కల ఏమిటి? ఆ కలను నెరవేర్చుకోవడానికి తను జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? అనేది తెలుసుకోవాలి అంటే 'ఏం చేస్తున్నావ్'? సినిమా తప్పక చూడాల్సిందే..
నటీ నటుల పనితీరు
సాయి పాత్రలో నటించిన విజయ్ రాజ్ కుమార్, నక్షత్ర పాత్రలో నటించిన ( నేహా పఠాని) చక్కని హావా భావాలతో చక్కటి నటనను కనబరచారు . సాయి, నక్షత్ర లు ఇద్దరూ కూడా తమ నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి సినిమాను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లారు అనిచెప్పవచ్చు. సాయి కి తల్లిగా నటించిన సీనియర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తల్లి పాత్రలో ఒదిగిపోయింది. వారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కళ్ళు చమర్చేలా చేసాయి. అలాగే హీరోయిన్ తండ్రి గా నటించిన రాజీవ్ కనకాల కొన్ని ఎమోషన్ సీన్స్ లలో చాలా బాగా నటించాడు.ఈ సినిమాలో వచ్చే హెలికాఫ్టర్’ సన్నివేశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఇందులో అమిత రంగనాథ్, మధు ఇలా ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఇప్పటి తరం యూత్ కెరీర్ పరమైన ఆలోచనలో కన్ఫ్యూజన్ కు లోను కాకుండా తమకున్న గోల్ ను ఎలా నెరవేర్చుకోవాలనే చక్కని కథను రాసుకొని ఇందులో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని కుల్లి కామెడీ గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు కి అందించడంలో దర్శకుడు భరత్ మిత్ర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఇందులో ఉన్న అన్నీ సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రేమ్ అడవి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హరీష్ శంకర్టిన్స్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఇందులో కొన్ని డైలాగులు ప్రేక్షకులను ఆలోచింప జేసేలా ఉన్నాయి. NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ తల తిప్పకుండా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఏం చేస్తున్నావ్ సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.