నటీనటులు: అజయ్ గోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రెడ్డి, ప్రమీల, నండూరి రాము, పలాస జనార్ధన్, వంశీధర్ చాగర్లమూడి, తదితరులు
దర్శకుడు : మహేష్ బంటు
నిర్మాత: నండూరి రాము
సంగీతం: వెంగి
సినిమాటోగ్రఫీ: ఎన్.సుధాకర్ రెడ్డి
ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి
NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వచ్చేసరికి ఇది మత్స్యకార జాతి.. వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారిజీవన శైలి, వారి మనుగడ మీద తీసిన చిత్రం.. మొగలి తిరుపతి (అజయ్ గోష్,),కి మల్లోజుల శివయ్య (శుభోదయం సుబ్బారావు) కి వున్న అంతర కలహాల ను ఆసరాగా చేసుకొని,దళారులు, కార్పొరేట్ వాళ్ళు, వాళ్ళల్లో ,,, వాళ్ళకి కలహాలు వచ్చేలా చేసి,సన్నవల తో తిరుపతి వేటగాళ్ల తో సముద్రము లో వేట సగిస్తువుంటే, రెండు వర్గాలు, కొట్టుకోవడం,, స్థానికంగా బ్రతుకు తున్న అందరూ బ్రతుకు తెరువుకోసం వలసలు పోవటం,తిరుపతి కొడుకు సీనయ్య (అర్జున్ రాజేష్) తన జాతిని ఎంతో అభివృద్ధి చేయాలని, హోషణాలజీలో పీహెచ్డీ చేసి,ఎంతో అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతో అక్కడ కి వస్తే,,. ఈ వినాశనానికి కారణం తన తండ్రే అని తెలుసుకొని,వాళ్ల జాతికి అండగా నిలబడిన శివయ్య తో కలిసి జాతి మనుగడను కాపాడే ప్రయత్నం చేయడం.... చివరికి , తిరుపతికి నిజం తెలియడంతో తనకు తెలియకుండా తన జాతిని తన చేతులతోనే నాశనం చేశానని పశ్చాత్తాప పడి మరలా పూర్వ వైభవం తీసుకురావడానికి తిరుపతి చేసిన ప్రయత్నమే ఈ కథ
విశ్లేషణ:
అజయ్ ఘోష్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు అని చెప్పాలి. శివయ్యగా నటించిన రాజశేఖర్ మత్స్యకారునిగా తన సహజమైన నటనతో మెప్పించారు. హీరో అర్జున్ రెడ్డి బాగా చేశాడు. ఇతర నటీనటులు అందరూ వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ గా ప్రధానంగా కనిపించే నటీనటుల పెర్ఫామెన్స్ లు వారిపై సన్నివేశాలు అని చెప్పాలి. ముఖ్యంగా నటుడు అజయ్ ఘోష్ నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఇది వరకు తాను కొన్ని కామెడీ పాత్రలు సహాయ నటుడుగా కనిపించాడు కానీ ఈ చిత్రంలో తన నటన నుంచి సరికొత్త కోణాలు కనిపిస్తాయి.
ఓ తండ్రిగా వ్యాపారం చూసుకునే వాడిగా మంచి ఎమోషన్స్ తో ఇంప్రెసివ్ నటనను అజయ్ ఈ చిత్రంలో కనబరిచి ఆకట్టుకుంటాడు. ఇక మరో నటుడు శివయ్యగా కనిపించిన రాజశేఖర్ కూడా ఓ మత్స్యకారునిగా సహజమైన నటనతో డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. ఇక వీటితో పాటుగా సినిమాలో పలు ఎమోషన్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు బాగున్నాయి.
దర్శకుడు మహేష్ బంటు కథను నడిపిన తీరు బాగుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను ముందుకు నడిపారు. నిర్మాత నండూరి రాము గారు NVL ఆర్ట్స్ బ్యానర్ పై మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు. ఎన్. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ నీట్ గా ఉంది. వెంగి సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం.
రుద్రమాంబపురం సినిమా కథ, కథనాలు అందరిని అలరిస్తాయి. కుటుంభం మొత్తం కలిగి చూడదగ్గ సినిమా ఇది. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా చూడవచ్చు.
రేటింగ్: 3/5
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.