Jaitra Movie review: A feel good film on Seema Framing (Rating : 3.0)

చిత్రం: జైత్ర
విడుదల తేది: మే 26, 2023
నటీనటులు:
సన్నీ నవీన్, రోహిణి రేచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు
కెమెరా: మోహ‌న్ చారి
పాట‌లు : కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌
సంగీతం : ఫ‌ణికళ్యాణ్
ఎడిటర్: విప్లవ్ నైషదం
ద‌ర్శ‌క‌త్వం : తోట మ‌ల్లిఖార్జున్
నిర్మాత‌: అల్లం సుభాష్‌.రేటింగ్: 3/5

అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం జైత్ర‌. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. మే 26న థియేటర్స్ లో ఈ చిత్రం థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
(సన్నీ నవీన్ )జైత్ర ఒక రైతు. అలాంటి రైతు జీవితంలోకి ఒక అమ్మాయి రోహిణి రేచల్ (దాక్షాయిని) వస్తుంది. తన వృత్తి పరంగా రీసెర్చ్ పనిమీద రాయలసీమకు వచ్చిన దాక్షాయిని , జైత్ర కు దగ్గర అవుతుంది. ఎలా సాగుతున్న వీరికి ఒక చిన్న కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని వీరు ఎలా ఎదుర్కోన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది. జైత్ర సినిమా ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో తెరకెక్కింది.

రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ తప్పకుండా ఉంటుంది, కానీ జైత్ర సినిమా అందుకు భిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ కథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాయలసీమ ప్రాంతం గురించి అందరూ కక్షలు కార్బన్యాలతో ఉంటారు అనే భావన నుంచి రాయలసీమలో మట్టిని ఎంతలా ప్రేమిస్తారు వ్యవసాయం అనేది ఒక పండుగ వ్యవసాయం చేయడం ఎంతో గర్వంగా ఎలా ఫీలవుతారు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు డైరెక్టర్ తోట మల్లికార్జున జైత్ర మూవీ తో.
రాయలసీమ ప్రాంతంలో భాష మరియు మనుషులు ప్రవర్తన కొంచెం కటువుగా ఉంటుంది కానీ ఆ మనిషి లోపల ఉన్నటువంటి బాధ ఆవేదన ఉన్న వ్యవసాయం అంటే మనమే చేయాలి వ్యవసాయం అనేది ఒక సాయం లాంటిది అనే భావనతో వ్యవసాయమే ప్రధమావధిగా భూమిని ప్రేమించే రైతులు మన రాయలసీమలో ఎలా ఉంటారు వారి ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేద విషయాన్ని చాలా చక్కగా చూపించారు జైత్ర సినిమాలో.

జైత్ర సినిమా రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం చేసే ప్రతి మనిషి తనను తాను చూసుకుంటున్నట్టు మనదే కదా మనవే డైలాగులు అనే లాగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని, చేరువయ్యే చక్కటి సినిమా.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.