Ukku Satyagraham movie is based on steel plant struggles

గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, ప్రత్యూష, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో పాటు 52 చిత్రాలు నిర్మించిన సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్‌ పూర్తయింది. విశాఖపట్టణంలోని ఆర్‌కె బీచ్‌; ఆరిలోవా, ఆంధ్రా యూనివర్సిటీ, రామానాయుడు స్టూడియోలో తాజా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో పల్సర్‌ బైక్‌ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రసన్నకుమార్‌, వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా గురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘‘స్టీల్‌ప్లాంట్‌ సాధణ కోసం జరిగిన పోరాటం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జేఎసీ ఛైర్మన్‌ అయెధ్య రామ్‌, మర్రి రాజశేఖర్‌, ఆదినారాయణ, కెఎస్‌ఎన్‌ రావుతోపాటు యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు స్వచ్ఛందంగా ఈ చిత్రంలో నటించారు. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. సంగీతం హైలైట్‌గా ఉంటుంది. అతి త్వరలో ఆర్‌కె బీచ్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహచించనున్నాం. రాష్టంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ వేడుకకు అతిథిగా హాజరవుతారు" అని అన్నారు.

నటీనటులు : సత్య రెడ్డి , మేఘన లోకేష్, ఎం .వి .వి సత్య నారాయణ , గద్దర్ ,అయోద్య రామ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు
కథ స్క్రీన్ ప్లే , డైరెక్షన్ : పి.సత్య రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ :-శ్రీ కోటి
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ , గోరేటి వెంకన్న , ప్రజా యుద్ధ నౌక గద్దర్
ఎడిటర్ : మేనగా శ్రీను
సినిమాటోగ్రఫీ :చక్రి కనపర్తి
కోరియోగ్రఫీ : నందు జన్న
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%