Social News XYZ     

‘Writer Padma Bhushan’ gives the audience a great experience that will be remembered forever: Tina Shilparaj

‘’రైటర్ పద్మభూషణ్‌’ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప అనుభూతిని ఇస్తుంది: టీనా శిల్పరాజ్

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రిమియర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ టీనా శిల్పరాజ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రైటర్ పద్మభూషణ్‌ జర్నీ ఎలా మొదలైయింది ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్‌ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చింది. అంతకుముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’కి మేము కలసి పని చేశాం. రైటర్ పద్మభూషణ్‌ కి ఆడిషన్స్ ఇచ్చాను. తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరిగింది. ఈ సినిమా వస్తుందని బలంగా నమ్మాను. నేను నమ్మినట్లే సినిమా రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

 

రైటర్ పద్మభూషణ్‌ మూవీ ఎలా ఉండబోతుంది ? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?
రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ రైడ్ కి తీసుకెళుతుంది. చాలా కామెడీ వుంటుంది, హ్యాపీ ఎమోషన్స్ వుంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు.

ట్రైలర్ లో మీ కామెడీ టైమింగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ? రైటర్ పద్మభూషణ్‌ లో మీ పాత్ర గురించి చెప్పండి ?
రైటర్ పద్మభూషణ్‌ లో నా పాత్ర పేరు సారిక. సారిక విజయవాడ అమ్మాయి. పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కథలో చాలా కీలకమైన పాత్రది. దర్శకుడు ప్రశాంత్ సారిక పాత్రని చాలా అద్భుతంగా రాసుకున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ కి దక్కుతుంది.

విజయవాడ, గుంటూరులో జరిగిన రైటర్ పద్మభూషణ్‌ ప్రిమియర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
రైటర్ పద్మభూషణ్‌ ప్రిమియర్స్ కి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. విజయవాడ ప్రిమియర్ కి వచ్చిన స్పందన చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. థియేటర్ నిండిపోయింది. మేము స్టేజ్ పై నిలబడి చూశాం. ప్రేక్షకులంతా సినిమాకి చాలా గొప్పగా కనెక్ట్ అయ్యారు. గుంటూరు, భీమవరంలో కూడా ప్రేక్షకులు నవ్వినవ్వి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసినపుడు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లనిపించింది.

హీరో సుహాస్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
సుహాస్ అద్భుతమైన ప్రతిభ గల నటుడు. ‘కలర్ ఫోటో’ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సుహాస్ సినిమాతో పరిచయం కావడం నాకు చాలా స్పెషల్.

రైటర్ పద్మభూషణ్‌ మీ మొదటి చిత్రం కదా.. ఇందులో నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
రైటర్ పద్మభూషణ్‌ గ్రేట్ జర్నీ. ఇంతకుముందు ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేయడం వలన సినిమా గురించి అవగాహన వుంది. అయితే ఒక యాక్టర్ గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు ఏంటి ? బలహీనతలు ఏంటి ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం.. ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి ? ఇలా చాలా విషయాలు రైటర్ పద్మభూషణ్‌ ప్రయాణంలో నేర్చుకున్నాను.

ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ గురించి ?
ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. కొత్త ప్రతిభని ఎంతగానో ప్రోత్సహిస్తారు. తెలుగు పాప్ కల్చర్ లో చాలా పాపులర్. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ లో నా మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది.

డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ కూడ ఇది తొలి చిత్రమే కదా.. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ కు చాలా క్లియర్ విజన్ వుంది. అలాగే చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన మంచి మనసు కథలో ప్రతిబింబిస్తుంది.

రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారు లాంటి సీనియర్స్ కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారు లాంటి సీనియర్స్ తో పని చేయడం మర్చిపోలేని అనుభవం. రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. వాళ్లతో కలసి నటించడం గ్రేట్ ఫీలింగ్ .

చివరిగా రైటర్ పద్మభూషణ్‌ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు ?
రైటర్ పద్మభూషణ్‌ అందరూ తప్పక చూడాల్సిన సినిమా. అందరూ కనెక్ట్ అవుతారు. రైటర్ పద్మభూషణ్‌ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప అనుభూతిని ఇస్తుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Facebook Comments
'Writer Padma Bhushan' gives the audience a great experience that will be remembered forever: Tina Shilparaj

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.