Social News XYZ     

‘Writer Padmabhushan’ Movie Is Hilarious Family Entertainer : DirectorShanmukha Prasanth

‘రైటర్ పద్మభూషణ్‌’ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్

ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైటర్ పద్మభూషణ్‌ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీ నేపధ్యం గురించి చెప్పండి ?

 

మాది విజయవాడ. అక్కడే బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. బిటెక్ లో ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి వుండేది. హైదరాబాద్ వచ్చాక ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే సినిమాల్లో ప్రయత్నిస్తున్నాననే సంగతి ఇంట్లో చెప్పలేదు. ఇక్కడ కొందరి దగ్గర రాశాను. బాగా రాస్తున్నానని మెచ్చుకునే వారు కానీ ఏం ఇచ్చేవారు కాదు.(నవ్వుతూ) అయితే బాగా రాస్తున్నానని వారు చెప్పే మాట నాకు ధైర్యాన్ని స్ఫూర్తిని ఇచ్చేది. నేనూ ఇక్కడ పనికి వస్తాననే నమ్మకాన్ని ఇచ్చేది. సుహాస్ గారితో షార్ట్ ఫిల్మ్ నుండి పరిచయం. కలర్ ఫోటో సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాను. అదిసెట్ పై ఉండగానే ఫ్యామిలీ డ్రామాకి రచయితగా అవకాశం వచ్చింది. రచయిత కావడం వలన అక్కడ నా ప్రజన్స్ ఎక్కువ కావాలి. అందుకే ఇక్కడ దర్శకుడికి చెప్పి అటు వెళ్లాను. అది పూర్తి అయిన వెంటనే దర్శకుడిగా నా మొదటి సినిమా సుహాస్ గారితో రావడం నా అదృష్టం. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.

ఈ సినిమాలో మీ సొంత అనుభవాలు ఉంటాయా ?

మాది మధ్య తరగతి కుటుంబం కావడం వలన సహజంగానే ఆ టచ్ వుంటుంది. ఇది ఫ్యామిలీ మూవీ అని మొదటి నుండి చెబుతున్నాం. అలా అని వేడుకలు, చుట్టాలు, బంధువులు ,మెలో డ్రామాలా వుండదు. ఇది మన ఇంట్లో జరిగే కథ. ప్రతి పాత్రలో అల్లరి వుంటుంది. రైటర్ పద్మభూషణ్‌ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

ఈ కథకు స్ఫూర్తి ?

మనకు తెలిసిందే..ఒక కొత్త కథని చెప్పాలనే ప్రాసస్ నుంచి పుట్టిన కథ ఇది. ఇందులో హీరో లైబ్రేరియన్. ఆ వాతావరణం వుంటుంది. మొన్న హరీష్ శంకర్ గారు చాలా రోజుల తర్వాత సినిమాలో ఒక పుస్తకాన్ని చూశాను అని అన్నారు. ఈ సినిమా కూడా అంతే రిఫ్రషింగ్ గా వుంటుంది. చాలా మంచి కథ ఇది.

సాదారణంగా సినిమాల్లో రైటర్ ని హీరోగా చూపించడం అరుదు కదా ?

నా పర్శనల్ ఫీలింగ్ లో రచయితే అన్నిటికి మూలం. ఎంత బడ్జెట్ పెట్టినా మొదట కంటెంట్ రాయాల్సింది రచయితనే. అలాంటి ఒక రచయిత జర్నీ ఇందులో వుంటుంది. ఇందులో హీరో పాత్ర పేరు పద్మభూషణ్‌. తను ఒక రైటర్ కావాలని అనుకుంటాడు. మరి రచయిత అయ్యాడా లేదా తన ప్రయాణం ఎలా సాగింది .. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

సుహాస్ అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలి ? మరి ఇది కంటెంట్ పరంగా ఎలా వుంటుంది?

సుహాస్ తో సినిమా అనగానే కంటెంట్ వుండాలి. దానిని ద్రుష్టిలో పెట్టుకునే వర్క్ చేశాను. నా ద్రుష్టిలో కంటెంట్ ని ఒక అమ్మలానే చూస్తాను. సుహాస్ కి కంటెంట్ ఇమేజ్ వుండటం ఎంతో హెల్ప్ అయ్యింది. విజయవాడలో ఓ కుర్రాడి జర్నీ ఇది. తనకో కుటుంబం వుంటుంది. తనని ప్రేమించే అమ్మాయి వుంటుంది. తను ఏం కావాలని అనుకున్నాడో ఏం అయ్యాడు అనే జర్నీ చాలా బ్యూటీఫుల్ గా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో తెలియకుండా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రన్ అవుతుంటుంది. ఈ రెండు కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా వుంటాయి.

రైటర్ పద్మభూషణ్‌ లో కామెడీ ఉంటుందా ?

నాకు కామెడీ చాలా ఇష్ట, నా బలం కూడా అదే. రైటర్ పద్మభూషణ్‌ లో చాలా మంచి హ్యుమర్ వుంటుంది. ఈవివి, జంధ్యాల, శ్రీనువైట్ల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం.

సుహాస్ గురించి ?

ఒక్కటని చెప్పలేను. నా జర్నీ ఆయన లేకుండా వుండదు. నటన పట్ల ఎంతో అంకితభావం వున్న నటుడు. సెట్ కి ఎనిమిదింటికి రమ్మంటే ఆరు గంటలకే వచ్చేస్టారు. అలా ముందుగా రావడం వలన ఎంతో మేలు జరుగుతుంది. చాలా విషయాలు చర్చించుకొని పని చేసుకునే అవకాశం వుంటుంది.

నటీనటులు గురించి ?

ఆశిష్ విద్యార్ధి, రోహిణి గారు, గోపరాజు రమణ గారు ఇలా చాలా మంచి నటులు నటించారు. ఆశిష్ విద్యార్ధి గుడుంబా శంకర్, అలా మొదలైయింది లో చాలా వివిధ్యమైన పాత్రలో కనిపించారు. ఆయనలో మరో కోణాన్ని కొత్తగా పరిచయం చేసే పాత్ర ఇందులో చేశారు. హీరోయిన్ శిల్పా రాజ్ ఓటీటీ స్టార్. అలాగే గౌరీ ప్రియ. చాలా అద్భుతంగా చేశారు.

ఇది మీ తొలి సినిమా కదా.. నిర్మాతల సహకారం గురించి ?

నిర్మాతల అద్భుతంగా సహకరించారు. ఎలాంటి పరిమితులు పెట్టలేదు. అయితే చెప్పిన సమయానికి అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తానని నిర్మాతలకు చెప్పాను. ముందే చెప్పినట్లే పూర్తి చేశాను.

కొత్త సినిమాల గురించి ?

కొన్ని కథలు వున్నాయి. ఒక ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Facebook Comments
'Writer Padmabhushan' Movie Is Hilarious Family Entertainer : DirectorShanmukha Prasanth

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.