Film : Liger
Cast: Vijay Deverakonda, Ananya Panday, Ramya Krishnan, Myke Tyson
Director: Puri Jagannadh
Produced by: Karan Johar; Puri Jagannadh; Charmme Kaur;
Apoorva Mehta; Hiroo Yash Johar
Production companies: Dharma Productions; Puri Connects
Music director: Vikram Montrose, Tanishk Bagchi, Sunil Kashyap
Release date: 25 August 2022
Reviewer: Vadde Marenna
Rating: 1.5
భారీ అంచనాల మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమా గురువారం నాడు విడుదలైంది. అటు విజయ్ దేవరకొండ.. ఇటు పూరీ జగన్నాధ్ లు ఇద్దరూ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అంతే కాదు.. విజయ్ దేవరకొండ తొలిసారి ఈ పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లైగర్ సినిమాకు ఉప శీర్షిక కూడా ఉంది. అది ఏమిటంటే సాలా క్రాస్ బ్రీడ్ అని. లైగర్ అంటే సింహం... పులికి పుట్టిన వాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే అనుభూతి వస్తుందో లేదో చూద్దాం పదండి.
కథ: లైగర్ (విజయ్ దేవరకొండ) , తన తల్లి (రమ్యకృష్ణ) తో కలిసి ముంబయ్ లో చాయ్ అమ్ముతూ బతుకుతూ ఉంటారు. అయితే లైగర్ ని తన భర్త లాగే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో వరల్డ్ ఛాంపియన్ చేయాలని కలలు కంటూ వుంటుంది. అందుకోసం ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది. అయితే లైగర్ మాత్రం... తాన్య (అనన్య పాండే) చుట్టూ తిరుగుతూ .. ఆమె అన్న సంజు (విష్) తో గొడవలు పడుతూ వుంటాడు. ఈక్రమంలో లైగర్ కి నత్తి వుందని.... పలకడం సరిగా రాదని... తాన్య అవమానిస్తుంది. అప్పటి వరకూ ఎలాంటి ఎయిమ్ లేని లైగర్... మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో వరల్డ్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడు? అందుకు ఎవరు సహకరించారు అన్నదే మిగతా కథ.
కథ... కథనాలు: లైగర్.. అంటే పులికి, సింహానికి పుట్టిన వాడని.. క్రాస్ బ్రీడ్ అని దర్శకుడి ఫీలింగ్ ఎదైతో వుందో... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు.. పూరీ ఇప్పటి వరకు తీసిన సినిమాలు... జై లవ కుశ లో NTR నత్తి క్యారక్టర్ క్రాస్ బ్రీడ్ కథే... లైగర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. హీరో టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రియురాలు కావాలని గొడవ పెట్టుకుని వెళ్లిపోవటం.. తర్వాత తండ్రి ఆ విషయం చెప్పే సీన్లు అన్నీ తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూసీ చూసి విసిగిపోయిన సీ న్సే. సినిమా అంతా కూడా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) చుట్టూనే తిరుగుతంది. తొలి భాగంలో సినిమా కాస్త సరదా సరదాగా సాగినట్లు అన్పించినా తర్వాత గాడితప్పింది.
అయితే సినిమాలో ఎక్కడా కూడా ఈ సీన్ సూపర్... ఆహా.. ఓ హో అనే సీన్ గానీ.. ట్విస్ట్ గానీ వుండదు. అయితే హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమా కోసం పడిన కష్టం తెరపై కన్పిస్తుంది. తల్లి రమ్యక్రిష్ణ కోరిక మేరకు తొలుత జాతీయ చాంఫియన్ గా అవతరించి తర్వాత దేశం ఇప్పటివరకూ ఎప్పుడూ చేయని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు కూడా రెడీ అవుతాడు. రమ్యక్రిష్ణ పాత్రలో కూడా ఏ మాత్రం దమ్ములేదు. చాలా రొటీన్ గా సాగుతుంది. హీరోయిన్ అనన్యపాండే పాత్ర.. పాటలు కూడా ఏ మాత్రం ఆకట్టుకోవు. సినిమాలో హీరో విజయ్ దేవరకొండ నటనకు ఎక్కడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కథలో దమ్ములేకపోవటంతో విజయ్ ఎఫర్ట్ వేస్ట్ అయిందనే చెప్పొచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ మాత్రమే క్రాస్ బ్రీడ్ కాదు..సినిమా కూడా క్రాస్ బ్రీడ్ అని చెప్పుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరీ జగన్నాథ్... వరుస ఫ్లాపుల్లో వున్న విజయ్ కి దేవరకొండకి మంచి హిట్ ఇచ్చి పాన్ ఇండియా స్టార్ చేద్దామని రెండేళ్లు గా పడిన శ్రమ వృథా అయిందనే చెప్పొచ్చు.
చివరిగా... లైగర్ కాదు లూజర్...!!!
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.