Social News XYZ     

Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)

Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)
Movie: Sita Ramam
Star Cast: Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna, Sumanth
Director: Hanu Raghavapudi
Producer: Aswani Dutt
Music: Vishal Chandrasekhar
Release Date: 5 August 2022

Rating: 2.25

Reviewer: VADDE MARENNA

 

దర్శకుడు హను రాఘవపూడికి ఇప్పుడు అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. కృష్ణగాడి వీర ప్రేమగాథ తరవాత సరైన హిట్టులేక సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈసారి మలయాళ నటుడు దుల్కర్ ను ఎంచుకుని... సీతారామం తెరకెక్కించాడు. వైజయంతి మూవీస్ కి కూడా ఇప్పుడు హిట్ కావాలి. మహానటి తరవాత వీరికి సరైన హిట్టు లేదు. దుల్కర్ సల్మాన్ కి కూడా తెలుగులో మార్కెట్ పెంచుకోవాలి అన్నా... పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చు కావాలంటే...
సీతారామం బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలి. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ చిత్రాన్ని తన వంతుగా ప్రమోట్ చేసారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్ర యూనిట్ అంచనాలను సీతారామం అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ: లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) ఒక అనాథ, అతను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుంటాడు. ఇండియన్ ఆర్మీ చేపట్టే ఓ మిషన్ విజయం తర్వాత ప్రజలలో ప్రజాదరణ పొందాడు. రామ్‌కి అమ్మాయిల నుండి చాలా ఉత్తరాలు వస్తాయి, కానీ సీత(మృణాల్ రాకూర్) అతనిని తన భర్త అని సంబోధిస్తూ ఒక లేఖ రాస్తుంది. ఆమె మాటలకు ఆకట్టుకున్న రామ్... సీతను వెతుక్కుంటూ వెళ్తాడు. అతను సరిహద్దులను రక్షించడానికి అతని బృందంతో పాటు POKకి బదిలీ అవుతాడు. రామ్, సీత ఒకరికొకరు లేఖలను రాసుకుంటూ.. వుండగా వారి మధ్య ప్రేమ ట్రాక్ మొదలవుతుంది. రామ్ అప్పుడు పాకిస్తాన్‌కు రహస్య మిషన్‌కు వెళతాడు, కాని అతను ఆ దేశ సైనికుల చేతిలో చిక్కుకుంటాడు. రామ్ రహస్య మిషన్‌ను పాకిస్థాన్ ప్రభుత్వానికి ఎవరు లీక్ చేశారు? సీత, రాముడు మళ్లీ కలుస్తారా? అఫ్రీన్ (రష్మిక) రాముడి లేఖను సీతకు ఎందుకు అందజేయాలనుకుంటోంది? అందులో ఏముంది? అన్ని సమాధానాలు తెలుసుకోవాలంటే, మీరు సినిమాని చూడాల్సిందే.

నటీనటులు ఎలా చేసారు అంటే... దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రకు ప్రాణం పోశాడు. పాత్రలో జీవించాడు. సీతా రామం కోసం దుల్కర్ సల్మాన్, మృణాల్ పర్ఫెక్ట్ స్క్రీన్ పెయిర్. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. మృణాల్ తన పాత్రలో చక్కగా మెరిసింది. రష్మిక, సుమంత్ పాత్రలను బాగా డిజైన్ చేశారు. సీతా రామంలో మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు హను రాఘవపూడి ఎప్పటి లాగే సెకెండ్ హాఫ్ లో తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ వున్నంత ఎంగేజింగ్ గా... సెకెండ్ హాఫ్ లేకపోవడం మైనస్. సినిమా రన్ టైం ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:

✓ దుల్కర్ సల్మాన్, మృణాల్
కెమిస్ట్రీ
✓ సినిమాటోగ్రఫీ
✓ సంగీతం

మైనస్ పాయింట్స్:

✓ సెకండాఫ్‌ ల్యాగ్‌

Facebook Comments
Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)
Review Date
Reviewed Item
Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie
Author Rating
3Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)
Title
Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)
Description
Sita Ramam Movie Review: Slow Paced, Boring Movie (Rating: 2.25)
Upload Date
August 5, 2022