Movie: Bimbisara
Banner: NTR Arts
Cast: Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, Srinivasa Reddy, and others
Dialogues: Vasudev Muneppagari
Music: MM Keeravani
DOP: Chota K Naidu
Editor: Tammi Raju
Art: Kiran Kumar Manne
Stunts: Venkat & Ram Krishan
Producer: Hari Krishna K
Written and Directed by: Vassishta
Release Date: August 5, 2022
Rating: 3
Reviewer: Vadde Marenna
నందమూరి కళ్యాణ్ రామ్ మంచి టేస్ట్ వున్న హీరో కం ప్రొడ్యూసర్. అందుకే NTR ఆర్ట్స్ లో నిర్మించే సినిమాలు యూనిక్ గా వుంటాయి. కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో కూడా కల్యాణ్ రామ్ ముందుంటాడు.. సురేందర్ రెడ్డి లాంటి దర్శకుడిని అతనొక్కడే సినిమాతో పరిచయం చేశాడు. ఇప్పుడు కూడా బింబిసారతో వశిస్ట్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేశాడు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో NTR చెప్పినట్టు... బింబిసార పాత్ర కల్యాణ్ రామ్ ఒక్కరే చేయగలడు అనేంతగా వుందో లేదో చూద్దాం పదండి.
కథ: బింబిసార (కల్యాన్ రామ్) కొన్ని పరిణామాల వల్ల భూలోకంలోకి వచ్చి పడతాడు. అతనికి భూలోకంలో జనాలు అన్నా.. ఇక్కడ వుండే వాహనాలు, వాటి శబ్దాలు వింతగా అనిపిస్తాయి. ఈ క్రమంలో అతని వంశస్తులు ఇంకా భూలోకంలో బతికే ఉన్నానని, వారిని చంపడానికి శాస్త్రి తన అనుచరులతో చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే బింబిసారున్ని పట్టుకొని తన చిరకాల కోరికను సాకారం చేసుకోవాలని విలన్ శాస్త్రి తన గ్యాంగ్ తో ప్రయత్నిస్తున్నాడు. మరి విలన్ అండ్ గ్యాంగ్ తాము అనుకున్నది సాధించారా? బింబిసారుడు వాళ్ళని ఎలా ఎదిరించాడు? అసలు బింబిసారుడి కథ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ: టైం ట్రావెలింగ్ సినిమాలు ఎప్పుడు తీసినా ఇంట్రెస్టింగ్ గానే వుంటాయి. ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలాగ కథ... కథనాలను తెరమీద చుయించగలిగితే ఆ సినిమా అటు క్లాసు... ఇటు మాస్ ఆడియెన్స్ ను అలరిస్తాయి. బింబిసార కూడా అలాంటి సినిమానే. 5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడి నేపథ్యాన్ని తీసుకుని రాసుకున్న కథ.. కథనాలు అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో బింబిసారుడి ఇంట్రడక్షన్... భూలోకంలో ఎదురయ్యే ఛాలెంజెస్.. చూపించి... ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఓ మాంచి గూస్ బమ్స్ సీన్ తో బ్రేక్ ఇచ్చాడు. ద్వితీయార్థంలో కథ కొంచం రొటీన్ అనిపించినా.. కొన్ని ఇంట్రెస్టింగ్ మలుపులతో సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ముగించాడు.
NTR చెప్పినట్టు బింబిసారుని పాత్రలో కల్యాణ్ రామ్ లీనమై నటించారు.. హావ భావాలు, డైలాగ్ డిక్షన్ అన్నీ పర్ఫెక్ట్ గా తెరపై ప్రదర్శించాడు. బింబిసారునిగా, దేవదత్తునిగా రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించి మెప్పించాడు. ఐరా పాత్రలో కేథరిన్.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంయుక్త మీనన్ మెప్పించారు. శాస్త్రి పాత్రలో విలన్ పాత్ర ఒకే.. ప్రకాశ్ రాజ్ పాత్ర పర్వాలేదు. బాల నటిగా చేసిన అమ్మాయి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కమెడియన్ సుదర్శన్, చమ్మక్ చంద్ర ఉన్నంతలో మెప్పించారు.
కొత్త దర్శకుడు వశిస్ట్ కి ఇది పెర్ఫెక్ట్ డెబ్యూ మూవీ.. హీరో అవ్వాలనుకుని... దర్శకుడిగా మారిన వశిస్ట్... బింబిసారకి కావాల్సిన అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని సక్సెస్ అయ్యాడు. తొలి సినిమానే సోషియో ఫాంటసీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి అలరించాడు. ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ నేపథ్య సంగీతం.. కీరవాణి మరొసారి తన స్ట్రెంత్ ఏంటో BGM తో చూపించారు. సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదొక విజ్యువల్ ఫీస్ట్. చోటా కె నాయుడు తన సీనియారిటీతో మూవీని మరో మెట్టు ఎక్కించాడు. ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఈ చిత్రం కల్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో తెరకెక్కింది కాబట్టి... ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు కల్యాణ్ రామ్. గో అండ్ వాచ్ ఇట్...!!!
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.