Starring: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, ‘Sarpatta’ John Vijay, Rahul Rama Krishna, Surekha Vani, Pavitra Lokesh, Naresh, Aravind Krishna, Chaitanya Krishna, Sammeta Gandhi and others
Music Director: Sam C S
DOP: Sathyan Sooryan
Editor: Praveen KL
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP, RT Teamworks
Story, Screenplay, Dialogues, Direction: Sarath Mandava
Rating: 1.5/5
Reviewer: Vadde Marenna
క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇటీవల విడుదలైన ఖిలాడి తో భారీ ఫ్లాప్ నే మూటగట్టుకున్నాడు. ఈరోజు మరోసారి రామారావు ఆన్ డ్యూటీ పేరుతో మరొసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్, వేణు తొట్టెం పూడి, నాజర్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అరవింద్ కృష్ణ, కృష్ణ చైతన్య, సమ్మెట గాంధీ, దువ్వాసి మోహన్, పవిత్ర లోకేశ్, సీనియర్ రమేష్, శ్రీ తదితరులు నటించారు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం RTTeam Works, SLV Cinimas సంయుక్తంగా నిర్మించారు Ramarao On Duty (ROD) చిత్రాన్ని. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం... రవితేజ ఖాతాలో మరో ROD గా నిలిచిందా... లేక హిట్ అయిందా అనేది తెలియాలంటే... Review చదవండి.
Ramarao On Duty కథేంటి అంటే....
నిజాయతీ గల రామారావు(Raviteja) ఎంతో కష్టపడి సబ్ కలెక్టర్ అవుతాడు. విధి నిర్వహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదిరించి... పేదలకు అండగా నిలిచే మనస్తత్వం ఆయనది. అందుకే... ప్రభుత్వం తక్కువ ధరలకే పేదల భూమిని కొట్టేయాలని చూస్తే... తన ఉద్యోగాన్ని, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి.... పేదలకు న్యాయం చేస్తాడు. ఈ క్రమంలో రామారావు బదిలీ అవుతాడు. బదిలీపై వెళ్లిన రామారావుకి మాలిని (రజిష విజయన్) అనే వివాహిత తన భర్త సురేంద్ర (కృష్ణ చైతన్య) అదృశ్యం అయ్యాడని, తన భర్త ఆస్తిని తన పేరిట బదిలీ చెయ్యాలని రాసిన అనేక ఉత్తరాలు కనిపిస్తాయి. ఆమెకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాలిని ఇంటికి వెళ్లిన రామారావుకి... షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ షాకింగ్ విషయాలు ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే...!!!
Ramarao On Duty ఎలా వుందంటే...
ఎర్రచందనం Smugling అనేది స్థానిక అధికారుల నుంచి వాళ్ళని ఆడించే పొలిటీషియన్స్ చూట్టూ తెలిసీ జరిగేదే. అలాంటి ప్లాట్ చుట్టూ ఇప్పటి వరకు అనేకానేక సినిమాలు చూశాం. కెప్టెన్ ప్రభాకర్ నుంచి... మొన్న వచ్చిన పుష్ప దాకా... ఇప్పుడు దర్శకుడు శరత్ మండవ కూడా ఈ స్టేల్ అయిన ప్లాట్ ను ఎంచుకుని... దాని చుట్టూ కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే రాసి.... ఆడియెన్స్ కి బోర్ కొట్టించేసాడు. సినిమా ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకొని ఆడియెన్స్ ని చివరిదాకా ఎంగేజ్ చేస్తుందేమో అనుకుంటే... చివరి దాకా అలాంటి ఛాయలేవీ మచ్చుకు కూడా కనిపించవు. ఫస్ట్ హాఫ్ యే విసిగిస్తుందనుకుంటే.... సెకండాఫ్ మరింతగా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. మొత్తంగా Raamarao On Duty ఎలా వుందంటే... అబ్రివేషన్ రూపంలో ROD (రాడ్) గా డిక్లేర్ చెయ్యొచ్చు.
నటీనటుల నటన ఎలా వుందంటే...
ఫస్ట్ షాట్ లో మాస్ మహరాజ్ రవితేజ మునుపటి లాగే తన ఎనర్జీ చూపించడానికి ట్రై చేసాడు. దర్శకుడే సరిగా వాడుకొలేక పోయాడు. క్లోజ్ షాట్స్ లో రవితేజ మరీ ఎబ్బెట్టుగా కనిపించాడు. డైలాగ్ డెలివరీ సరిగాలేదు. లిప్ సింక్ కుదరలేదు. ఓ దశాబ్దం తర్వాత వెండితెరపై కనిపించిన వేణు తొట్టెమ్ పూడి C.I. పాత్ర ఏమాత్రం ఆకట్టుకోదు. వేణు ఇంత కాలం వెయిట్ చేసి... ఇలాంటి కథను వేణు ఎలా ఒప్పుకుని చేశాడా అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. రాహుల్ రామకృష్ణ, నాజర్, నరేష్, రజిష విజయన్ పాత్రలు సో సో గా వున్నాయి. Sp దేవానంద్ పాత్ర ok. మిగతా పాత్రల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా వుందంటే...
దర్శకుడు శరత్ మండవ Ramarao On Duty తో ఏమీ చెప్పదలచుకున్నారో... ఈ సినిమాను తెరకెక్కించడంలో ఆయన మోటివ్ ఏంటో ఆయనకే తెలియాలి. ఇదే అంశం నిర్మాతకి కూడా వర్తిస్తుంది. గత వర్తమాన వ్యవహారాల గురించి అని టైటిల్స్ లో వేసి కొంత క్యూరియాసిటిని పెంచినా... సినిమాలో మాత్రం పాత స్టోరీలనే రన్ చేసి బోర్ కొట్టించేశాడు. DI సరిగా లేదు. సినిమాటోగ్రఫీ, సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎడిటింగ్... నిర్మాణ విలువలు చాలా పూర్ గా వున్నాయి. ఏమాత్రం ఆకట్టుకోని ఈ Ramarao On Duty ని విస్మరించడమే నయం. Don't Waste your Time...!!!
Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.
He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.
When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.
He can be reached at gopi@socialnews.xyz
This website uses cookies.