Starring: Sunil, Anasuya Bharadwaj, Shafi, Shakalaka Sankar, Prithvi, Shammu, Arun Varma, Shireesha, Aksha Khan, Amani, Sameer, Naga Mahesh Etc..
Producers: Siva Sankar Paidipati, Ravi paidipati
Screen Play - Director: Saleem Malik
Music: Rap Rock Shakeel
Dop: Darshan
Reviewer: Vadde Marenna
Rating: 3/5
ఇప్పటి వరకు తన యాంకరింగ్ తో బుల్లి తెరపై యూత్ ని అలరించిన యాంకర్ అనసూయ ఇప్పుడు దర్జా గా వెండితెర మీద అలరించడానికి రెడీ అయింది. ఇందులో కమెడియన్ కం హీరో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. సునీల్ తో పాటు ఈ చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిర్మాత రవి పైడిపాటి ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ పాత్రకు అనసూయ ఏమాత్రం న్యాయం చేసిందో చూద్దాం పదండి.
కథ: బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హడల్. పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తుంటుంది. ఈ క్రమంలో గణేశ్ (అరుణ్ వర్మ) తను ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఉరేసుకుని చనిపోతాడు. తన అన్న చావుకి కారణం అయిన పుష్పని... గణేశ్ తమ్ముడు రంగ (షమ్ము) చంపాలని చూస్తుండగా... కొత్తగా వచ్చిన బందరు ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) అడ్డుకుని.. ఆ కేసు విచారణ చేపడతాడు. మరి గణేష్ చనిపోవడానికి కారణం పుష్ప మోసం చేయటం వల్లనేనా? బందరు కనకం ఆగడాలను ACP ఎలా ఆట కట్టించాడు? అసలు ACP శివశంకర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!
కథ... కథనం విశ్లేషణ: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఎప్పుడూ యూత్ ను ఆకట్టుకునే పాత్రల్లో నటించిన యాంకర్ అనసూయ దర్జాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించింది. ఈ పాత్రను హైలైట్ చేయటం కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ... దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనసూయ పాత్ర ఆది నుంచి చివరి దాకా ఎంతో క్రూరంగా సాగి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అలాగే సునీల్ ఏసీపీ పాత్రలో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఓ వైపు బందర్ కనకం ఆగడాలను చూపిస్తూనే... మరో వైపు గణేష్, పుష్పాల స్వఛ్చమైన ప్రేమను... అలానే రంగ, తీన్ మార్ గీతల చిలిపి ప్రేమను, ఆమని, తన పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్... శకలకశంకర్, థర్టీ ఇయర్స్ పృథ్వీల కామెడి అన్నీ మాస్ ను బాగ ఎంటర్టైన్ చేస్తాయి. చివర్లో వచ్చే మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.
అనసూయ పుష్పా తరవాత మంచి రౌద్రం వున్న పాత్రలో నటించి మెప్పించారు. విలనిజం తాలూకు పాత్రలో వచ్చే డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. ACP శివశంకర్ పాత్రలో మాస్ ని మెప్పించేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఈ చిత్రం కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి డెబ్యూ అయినా... పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్నదమ్ముల పాత్రల్లో లీనమై నటించారు. అలానే శిరీష, అక్సాఖాన్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆకట్టుకున్నారు. చివర్లో ఆక్సాఖాన్ చేసిన మాస్ బీట్ సాంగ్ యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. షకలక శంకర్, పృథ్వీ, పాల్ రాము బాగ నవ్వించారు. మహేష్ సిద్ధాంతిగా తన పాత్రకి న్యాయం చేశాడు. విలన్ గా బళ్ళారి పాత్రలో సమీర్ బాగా క్రూరంగా నటించి మెప్పించాడు. సర్కార్ పాత్రలో ఎన్. రామ్ నెగిటివ్ షేడ్ లో ఒదిగిపోయాడు. భవిష్యత్ లో మంచి విలన్ గా సెటిల్ అవ్వొచ్చు.
దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. డెబ్యూ మూవీ ఆయినా బాగానే హ్యాండిల్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. చివర్లో వచ్చే మాస్ సాంగ్ ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ మాస్ ను బాగ ఆకట్టు కుంటాయి. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు.
గో అండ్ వాచ్ ఇట్..!!!
[attach 1]
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.