Social News XYZ     

Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)

Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)

Film: Pakka Commercial

Director: Maruthi Dasari

 

Starring: Gopichand, Raashi Khanna, Sathyaraj, Siya Gautham, Varalaxmi Sarathkumar

Reviewer: Vadde Marenna

Rating: 2.25

గోపీచంద్, రాశి ఖన్నా జంటగా... మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్. ఇటీవల హీరో గోపీచంద్ కి సరైన హిట్టు లేక కొట్టుమిట్టాడుతున్నాడు. అలాగే దర్శకుడు మారుతికి మంచి బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం దర్శకుడికి, హీరోకి ఏమాత్రం మైలేజ్ ఇస్తుందో చూద్దాం పదండి.

కథ: లక్కీ (గోపీచంద్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి సూర్య నారాయణ(సత్య ప్రకాశ్) కుమారుడు. అతడు పక్కా కమర్షియల్ లాయర్. కాసులకోసం ఎలాంటి కేసునైనా తిమ్మిని బమ్మిని చేసే నేర్పరి. అదేసమయంలో పారిశ్రామిక వేత్త ఆయిన వివేక్ అలియాస్ వీరయ్య(రావు రమేష్) చేయని అక్రమాలు వుండవు. తనకున్న డబ్బు, పరపతితో న్యాయస్థానంలో సైతం తన మీద ఈగ వాలకుండా చూసుకునే వివేక్... ఓ కేసు విషయంలో లక్కీని సహాయం అడుగుతాడు. అయితే బాధితుల తరఫున లక్కీ తండ్రి వాదించడానికి రెడీ అవుతాడు. దాంతో లక్కీకి ఈ కేసు విషయంలో తండ్రితోనే న్యాయస్థానంలో పోటీ పడాల్సి వస్తుంది. మరి ఆ కేసు ఏంటి? ఇందులో ఎవరు గెలిచారు? న్యాయ మూర్తి అయిన సూర్య నారాయణ... న్యాయ వాదిగా ఎందుకు మారాడు? వివేక్ తో అతనికి వున్న వైరం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినీమా చూడాల్సిందే.

కథ... కథనం విశ్లేషణ: సిన్సియర్ గా పనిచేసే తండ్రి... అతన్ని ఫ్లాష్ బ్యాక్ లో విలన్ ఇబ్బంది పెట్టడం... దాన్ని చిన్నతనంలో చూసిన అబ్బాయి పెరిగి పెద్దవాడై విలన్ మీద పగ తీర్చుకోవడం.. ఇలాంటి రొటీన్ స్టోరీస్ వెండితెర మీద చాలానే చూశాం. ఇలాంటి రొటీన్ కథనే యువ దర్శకుడు మారుతి ఎంచుకొని తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ రాశీఖన్నా సీరియల్ షూటింగ్స్ ఎపిసోడ్స్ తో కాస్త ఎంటర్టైనింగ్ చేశాడు. కోర్టు సీన్స్ సిల్లీగా వున్నా... నవ్విస్తాయి. ఇక సెకెండ్ హాఫ్ లో వచ్చే ఇల్లాజికల్ సీన్స్... సాగతీత సీన్స్ తో బోరింగ్ అనిపిస్తుంది. విలన్ వల్ల తండ్రికి జరిగిన అన్యాయం... అతనిపై హీరో రివేంజ్ తీసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

హీరో గోపి చంద్ నటన రొటీన్ గా వుంది. ఇలాంటి రొటీన్ పాత్రలు ఇంతకు ముందు చాలా సినిమాల్లో చేశారు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న గోపీచంద్.. ఇలాంటి రొటీన్ స్టోరీ ఎంచుకోవడం ఒక రకంగా సాహసమే అనుకోవచ్చు. ఎంతో కొంత కామిడీ పండింది అంటే అది రాశి ఖన్నా పాత్రకే. రాశి చాలా బాగా చేసింది. రావు రమేష్ పాత్ర కూడా బాగుంది. ఎప్పటిలాగే చెలరేగి పోయి... ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. సత్య రాజు పాత్ర సో సోగా వుంది. వైవా హర్ష ప్రాంటింగ్ పాత్ర బాగుంది. స్టార్ కమెడియన్ సప్తగిరి పాత్ర ఇరిటేట్ చేస్తుంది. సియా గౌతం పాత్ర బాగుంది. అజయ్ ఘోష్ పాత్రలో కొత్తదనం లేదు. కమెడియన్ సుదర్శన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.

దర్శకుడు మారుతి ఎంచుకున్న రొటీన్ రివేంజ్ డ్రామా స్టోరీకి కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లేను ఫస్ట్ హాఫ్ లో రాసుకున్నాడు. సెకెండ్ హాఫ్ లో మళ్లీ రొటీన్ సీన్స్ తో నింపేసాడు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోపీచంద్, రాశి ఖన్నా లని బాగా చూపించాడు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్...

1. రావు రమేష్, రాశి ఖన్నా నటన
2. ఫస్ట్ హాఫ్ లో రాశి ఖన్నా కోర్ట్ సీన్
3. క్లైమాక్స్ యాక్షన్ సీన్

మైనస్ పాయింట్స్

1. రొటీన్ రివేంజ్ డ్రామా స్టోరీ
2. సెకండ్ హాఫ్ సాగతీత
3. లాజిక్ లేని సీన్స్

 

Facebook Comments
Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)
Review Date
Reviewed Item
Pakka Commercial
Author Rating
2Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)
Title
Pakka Commercial
Description
Pakka Commercial Movie Review: A routine revenge drama (Rating: 2.25)
Upload Date
July 1, 2022