న్యూజనరేషన్ మూవీ గంధర్వ - సందీప్ మాధవ్ ఇంటర్వ్యూ
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం గంధర్వ
. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై1న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర హీరో సందీప్ మాధవ్ ఆదివారంనాడు పాత్రికేయులతో చిత్రం గురించి, తన కొత్త సినిమా గురించి పలు వివరాలు తెలియజేశారు.
- గంధర్వ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది. విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి?
ఈ కథను లాక్‌డౌన్‌లో విన్నాను. సంగీత దర్శకుడు షకీల్ ద్వారా అప్సర్‌గారు కథ చెప్పారు. విన్న వెంటనే బాగా నచ్చేసింది. ఎందుకు సినిమా చేద్దామనుకున్నానంటే, ఒక పాత్రపై సినిమా రన్ అవుతుంది. జనరల్ సినిమాలోని అంశాలతోపాటు సరికొత్త పాయింట్ దర్శకుడు రాసిన విధానం, నటుడిగా పెర్‌ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ వున్న కథ. అందుకే ఖచ్చితంగా చేయాలనిపించింది. -
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
మిలట్రీ పర్సన్‌గా నటించాను. మిలట్రీ వ్యక్తి కుటుంబంలో వాతావరణ ఎలా వుంటుంది?
నెలలతరబడి డ్యూటీలో వుంటాడు. తల్లిదండ్రులను, భార్యాపిల్లలను వదిలి వెళ్ళాల్సివస్తే తనేం చేస్తాడు. పెళ్ళయిన మరుసటిరోజే యుద్ధానికి వెళ్ళాల్సివస్తే తను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు. మొత్తంగా తను అసలు కనిపించకుండాపోతే పరిస్థితి ఎలా వుంటుంది? ఫైనల్‌గా కుటుంబ కథాచిత్రమిది. -
గంధర్వ టైటిల్‌లో 1971-2021 అని వుంది. ఏమిటది?
ఈ కథ 1971లో మొదలయి 2021 వరకు రన్ అవుతుంది. అందుకే అలా పెట్టారు.
గంధర్వ అంటే ఏమిటి?
మనకు కింపురుషులు, గంధర్వులు వుంటారని తెలుసు. వారికి చావువుండదు. ఎప్పుడూ యవ్వనంగానే వుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? సహజంగా మనిషి 50 ఏళ్ళకు చాలా మార్పులకు గురవుతాడు. అలాంటి వ్యక్తి 50 ఏళ్ళకు కూడా యవ్వనంగా వుంటే ఎలా వుంటుంది? ఇంటికి వచ్చాక భార్య, పిల్లలతోపాటు సమాజాన్ని ఎలా ఒప్పించాడు అన్నదే కథ. అలా ఇతను వచ్చాక కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నాడు. ఇది ఇంగ్లీషు సినిమాలా అనిపించినా కథలో విషయం వుంది.
- చాలామంది మిలట్రీ సినిమా అనుకుంటున్నారు?
అలా నాతో చాలామంది అన్నారు. కానీ దానికి ఈ కథకు ఎటువంటి సంబంధంలేదు. దర్శకుడు మిలట్రీ పర్సన్ కాబట్టి అలా అనిఅనుకొని వుండవచ్చు. -
మొదటిసారి ఈ చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు?
ఇంతవరకు బయోపిక్‌లు చేశాను. ఇలా జనరల్ సినిమా చేయడం మొదటిసారి. నాకు కథ బాగా నచ్చింది. -
ఫైనల్ కాపీ చూసుకున్నాక మీకు ఏమనిపించింది?
మేం అనుకున్నదానికంటే బాగా వచ్చింది. సాయికుమార్, బాబూమోహన్, పోసాని కృష్ణ మురళి, గాయత్రీ సురేష్ వంటి పెర్‌ఫార్మన్స్ నటీనటులున్నారు. సీనియర్స్ వల్ల మా సినిమాకు చాలా ప్లస్ అయింది. -
దర్శకుడు అప్సర్ గురించి?
తను మిలట్రీ వాడిగా ఫీలయి కథను రాసుకున్నారు. యుద్ధానికి వెళితే ఆ కుటుంబంలో వాతావరణ ఎలా వుంటుందో ఆయనకు బాగా తెలుసు. పైగా దర్శకుడు కావాలనే తపనతో తెలుగు నేర్చుకుని కథను రాసుకున్నారు. ఆయన ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది. -
ఈ కథకు ఫస్ట్ ఛాయిస్ మీరేనా?
నేనే అనుకుంటున్నా. -
ఈ కథలో ఫిక్షన్. రియలస్టిక్ ఎంత మేరకు వుంది?
ఈ కథ మూలమే ఫిక్షన్. అయినా మన ఇంటిలో ఎలిమెంట్స్ ఎలా వుంటాయో కూడా ఆయన రాసుకున్నారు. ఇందులోని పాయింట్ తండ్రీ కొడుకుమధ్య ఆప్యాయత, భార్యభర్తమధ్య ప్రేమ, తాతకు మనవడు మధ్య ఎమోషన్స్ బాగా తీశారు. గ్రాఫిక్స్ ఎక్కువలేకుండా తీయడం విశేషం. -
తండ్రీ కొడుకు ఒకే వయస్సు వారా?
కొడుకు వయస్సు 55 అయితే తండ్రి 25 ఏళ్ళ యువకుడు. ఇది యండమూరి సిగ్గు సిగ్గు.. నవలావుందని నాతోకూడా చాలామంది అన్నారు. కానీ అదివేరు. ఇది వేరు. -
షకీల్ సంగీతం ఎలా వుంది?
తను అప్‌కమింగ్ సంగీతదర్శకుడు. లయజ్ఞానం బాగా వుంది. కథకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తే బాగుంటుందనే దానిపై పూర్తి అవగాహన వుంది. సందర్భానుసారంగా బాణీలు ఇచ్చాడు. -
ఈ సినిమా పరంగా మీరు చేసిన కసరత్తు ఏమిటి?
ఇంతకుముందు నేను చేసినవి బయోపిక్‌లు కాబట్టి ఆయా పాత్రలు ఎలా చేయాలో అలానే చేయాల్సి వచ్చేది. కానీ ఇందులో దర్శకుడి కోణంలో నా శైలిలో చేయడానికి అవకాశం వుంది. -
మొదటి సారి కమర్షియల్ హీరోగా చేశారు. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు?
బయోపిక్‌లు చేశాక ఒక ముద్ర వచ్చేసింది. ప్రేక్షకులు కూడా ఒక కోణంలో చూసి ఇమేజ్ ఇచ్చేస్తారు. దానిలోంచి బయటకు రావాలంటే విరుద్ధమైన పాత్రలు చేయాలి. లవర్‌బాయ్‌గా చేయలేను. అలాంటి కథలు కూడా వచ్చాయి. యాక్షన్ కూడా వచ్చింది. అందుకే ఇంతకంటే భిన్నంగా వుండాలని అనుకుని ఈ సినిమా చేశాను. 1971లో నన్ను ఒకలా చూపించి 2021లో మరోలా చూపించే విధంగా పాత్ర వుంది కాబట్టి నన్ను నేను మలచుకోవడానికి బాగా ఉపయోగపడింది. -
నిర్మాత గురించి?
ఈ సినిమాకు సుభాని నిర్మాత, సుభాని దర్శకుడు అప్సర్ సోదరుడు. కథ వినేటైంలోకూడా అందరం చర్చించుకుని విన్నాం. నిర్మాతగా సుభానిగారికి మంచి నిర్ణయాలు తీసుకునే అవగాహన వుంది. -
ఎస్.కె. ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ కావడం ఎలా అనిపిస్తుంది?
మాకు ఎస్.కె. ఫిలిమ్స్ బాగా హెల్ప్ అయింది. కొత్త దర్శకుడు కాబట్టి సురేష్ కొండేటిగారు రావడంతో మాకు పిల్లర్‌గా అనిపించింది. జనాలకు కూడా బాగా రీచ్ అయింది. -
సెన్సార్ సభ్యులు స్పందన ఎలా వుంది?
సెన్సార్ అయ్యాక వారికి బాగా నచ్చిందని ప్రశంసించారు. కొత్తపాయింట్ చెప్పారు. న్యూజనరేషన్ మూవీ ఇది అని కితాబిచ్చారు. -
హీరోయిన్ గురించి?
గాయత్రి సురేష్‌గారు అందగత్తె. మిస్ కేరళ. ఆమెకు అందంతోపాటు పెర్‌ఫార్మెన్స్ కళ్ళతో బాగా ఇస్తుంది. క్లయిమాక్స్‌లో నన్నే డామినేట్ చేసిందనిపించింది. -
పూరీ జగన్నాథ్, రామ్‌గోపాల్ వర్మ దగ్గర చేశారు కదా? వారి నుంచి ఏం నేర్చుకున్నారు?
ఇద్దరికీ 24 గంటలు సినిమానే ప్రపంచం. అలా వుంటేనే వర్క్ ఆటోమేటిక్‌గా బెటర్‌గా వస్తుందని తెలుసుకున్నాను. సహజంగా సాయంత్రానికి అలసిపోతుంటాం. కానీ వర్మ, పూరీ ఇద్దరూ చాలా ఎనర్జిటిక్‌గా వుంటారు. నటుడిగా పూరీ నుంచి చాలా నేర్చుకున్నా. పెర్‌ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ ఎలా చెప్పాలనేది గ్రహించాను. వర్మగారి దగ్గర ఆర్టిస్ట్ లుక్ ఎలా వుండాలి. నలుగురు వుంటే ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకున్నా. -
ఈ సినిమాకు కథ, మాటలు ఎవరు రాశారు?
ఇదంతా దర్శకుడి విజనే. ఆయనే సెట్లో కామెడీ చేస్తుంటారు. అతని కోడైరెక్టర్లు ప్రకాష్ పచ్చల, మహీధర్ గుంటుపల్లి.. మాటలకు హెల్ప్ చేశారు. -
సినిమాలో విలన్ ఎవరు?
పరిస్థితులే విలన్. -
ఈ మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని మీ ఫీలింగ్?
ఇది యూత్‌ఫుల్ సినిమాకాదు. కుటుంబమంతా కలిసి చూసే సినిమా. ఆనందించే సినిమా అందరికీ బాగా నచ్చుతుంది. ఇంతకుముందు శ్రీకాంత్, జగపతిబాబు ఇలాంటివి చేశారు. ఈ జనరేషన్‌కు ఇది నాకు మంచి అవకాశం అనిపించింది. థియేటర్‌కు కేవలం యూత్‌ను బేస్ చేసుకునే సినిమాలు వస్తున్నాయి. అందుకు ఫ్యామిలీ తగ్గిపోయారు. ఇది వారిని తీసుకువచ్చే సినిమా అవుతుంది. -
కెమెరామెన్ జవహర్ రెడ్డి జర్నీ గురించి?
తను టాలెంటెడ్. చాలా కూల్ పర్సన్. నన్ను అందంగా చూపించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఆయన అనుభవం నాకు చాలా ఉపయోగపడింది. దర్శకుడు చెబితే వెంటనే గ్రహించేవారు. అలా అందరికీ హెల్ప్ అయింది. -
మీ కెరీర్ చాలా స్లోగా వెళుతున్నట్లుంది?
అవును స్లోగానే వెళుతున్నా. మధ్యలో కరోనా వల్ల గేప్ తీసుకున్నా. ఆ తర్శాత కథలు సెట్ చేసుకోవడంలో గేప్ వచ్చింది. ఇప్పుడు ఫాస్ట్‌గా చేస్తున్నాను. వంగీవీటి, జార్జిరెడ్డి చేశాక ఏది బడితే అది చేయడంలేదు. నాకు సూటయ్యేవి చేస్తున్నా. -
మీకు ఏ తరహా కథలు ఇష్టం?
నాకు సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంటే ఇష్టం. వ్యక్తిగతంగా కామెడీ ఇష్టం.
తదుపరి చిత్రాలు?
మాస్ మహరాజ్ అనే సినిమా చేస్తున్నా. రాజ్‌తరుణ్ కూడా వున్నాడు. అందులో కూడా 50 ఏళ్ళ వ్యక్తిగా చేస్తున్నా. అసీఫ్‌ఖాన్, ప్రదీప్ రాజు నిర్మాతలు. కోతలరాయుడు చేసిన సుధీర్ రాజా దర్శకుడు. ఇది పెద్ద కమర్షియల్ సినిమా అవుతుంది.
- ఓటీటీవైపు వెళుతున్నారా?
చాలా వచ్చాయి. సరైన అవకాశం కోసం చూస్తున్నాను. అని ముగించారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.