Movie :- Corporator (2021) Review
నటీనటులు :- శకలక శంకర్ , సునీత
నిర్మాతలు :- పద్మనాభ రెడ్డి మరియు S.V. మాధురి
సంగీత దర్శకుడు :- MLP రాజ
డైరెక్టర్ :- సంజయ్ పోనూరి
కథ: పికె (షకలక శంకర్) తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటాడు, ఎలక్షన్ కు నామినేషన్ వేస్తాడు, ఈ క్రమంలో ముగ్గురు పార్టీ ల మధ్య ప్రచారాలు బలంగా జరుగుతాయి. ఎన్నో అడ్డంకులు ఎదురుకొని మొత్తానికి అప్పోజిషన్ పార్టీ పైన పీకే 15 ఓట్ల మెజారిటీ తో గెలిచి విజయవాడ 48 వ వార్డ్ కొత్త కార్పొరేటర్ గా నిలుస్తాడు. ఇప్పుడు పీకే చేయబోతున్నాడు ? అస్సలు నిజంగా మేయర్ ఇంట్లో 100 కోట్లు పోయాయా ? పీకే నిజంగా ఒక అమ్మాయిని రేప్ చేశాడా ? ఈ కుట్రలను ఎవ్వరూ చేస్తున్నారు ? వీటన్నిటినీ ఎదురుకొని పీకే ఎలా నిలబడ్డాడు ? చివరికి ఏం జరగబోతోంది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
విశ్లేషణ:
శంకర్ హీరో గా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కార్పొరేటర్ గా మరియు కామెడీ చేస్తూనే ప్రేక్షకులని చాలా బాగా అలరిస్తారు. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో శంకర్ నటన చాల బాగుంటుంది. మిగితా పాత్రధారులు కూడా వారి వారి పాత్రకి తగ్గట్టు బాగా చేశారు.
నూతన దర్శకుడు అయిన సంజయ్ పునూరి రాజకీయ నేపథ్యంలో మంచి కథ రాసుకున్నారు. షకలక శంకర్ పొలిటీషియన్ పాత్రలో బాగా నటించాడు. ముగ్గురు హీరోయిన్స్ వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు కెమెరామెన్ జగదీష్ కుమారి కెమెరా వర్క్ బాగుంది. ఎమ్ఎల్పి రాజా సంగీతం, నేపధ్య సంగీతం బాగుంది. శివ శర్వాని ఎడిటింగ్ నీట్ గా ఉంది. సినిమా ఎక్కడ బోరింగ్ లేకుండా చక్కగా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్స్ అలాగే డైలాగ్స్ బాగున్నాయి. షకలక శంకర్ నుండి ప్రేక్షకులు ఆశించే హాస్యం తో పాటు చక్కటి పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాయి, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ సెకండ్ హాఫ్ లో ఉన్నాయి.
- కథ మరియు కధనం చాల బాగుంది. షకలక శంకర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
- మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టే బాగా కొట్టారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- ఎడిటింగ్ బాగుంది.
*సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. - దర్శకుడు సినిమా మొదటినుంచి తాను చూపెట్టాలనుకుంది చూపిస్తూనే వెళ్ళారు ఎటువంటి అనవసరపు సన్నివేశాలు లేకుండా ఉంది.
మొత్తానికి కార్పొరేటర్ అనే సినిమా శంకర్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం గా నిలుస్తుంది అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. సినిమా మొదటి నుంచి శంకర్ తన నటనతో ప్రేక్షకులని అలరిస్తారు. కథ మరియు కధనం బాగుంది. దర్శకుడు చెప్పాలనుకుంది ఎక్కడ అనవసరపు సన్నివేశాలు లేకుండా దర్శకత్వం వహించారు. మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి శంకర్ నటన కోసం ఈ కార్పొరేటర్ సినిమా హ్యాపీ గా కుటుంబం అంత కలిసి ఓసారి చూసేయచ్చు.
చివరిగా: కార్పొరేటర్ గెలిచాడు
రేటింగ్: 3/5