Social News XYZ     

Bhagat Singh Nagar Movie Ready Be Censored

పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న "భగత్ సింగ్ నగర్" చిత్రం

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను ప్రకాష్ రాజ్ గారు విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి హైప్ రావడం జరిగింది..అలాగే భగత్ సింగ్ నగర్ నుంచి విడుదల అయిన మొదటి 'చరిత చూపని' లిరికల్ సాంగ్ కు 1మిలియన్ + వ్యూస్ సాదించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాము..అతి త్వరలో మిగిలిన పాటలతో పాటు ఈ సినిమాను ఈ నెలలొనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భంగా.

చిత్ర నిర్మాతలు రమేష్ వుడుత్తు, వాలాజా గౌరి లు మాట్లాడుతూ.. దేశం కోసం,స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఎక్కడో పుట్టి పెరిగిన బ్రిటీష్ వారు మన దేశంలో అడుగుపెట్టి వారి సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్న వారి కలను చెదరగొట్టి వారిని, వారి సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయం లోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉంది..పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల చేస్తాం అన్నారు.

 

చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ .. బెనర్జీ గారి హెల్ప్ తో లెజండరీ ప్రకాష్ రాజ్ గారు మా చిత్రం టీజర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.అప్పటి నుండి ప్రేక్షకులనుండి మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. "భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. నాకు భగతసింగ్ అంటే ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునే వాన్ని. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో... సాటి మనిషికి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలనుకునే గొప్ప వ్యక్తి. అలాంటి మంచి ఆలోచనతో ఈ సినిమా తీస్తున్నాము. భగత్ సింగ్ నగర్ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పటి నుండి ప్రకాష్ రాజ్ గారు టీజర్ ను విడుదల చేసిన తరువాత మా టీజర్,ట్రైలర్స్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. 'చరిత చూపని' లిరికల్ సాంగ్ కు 1మిలియన్ + వ్యూస్ సాదించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాము.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్నాము. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ గారి భావజాలాన్ని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో వస్తున్న మా ప్రయత్నాన్ని మీరంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు తీయడానికి మా లాంటి కొత్త దర్శకులకు అవకాశం వస్తుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు

నటీనటులు :
విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.

సాంకేతిక నిపుణులు :
ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్ : మునిచంద్ర,
నృత్యం : ప్రేమ్-గోపి,
నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,
ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.
పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

Facebook Comments
Bhagat Singh Nagar Movie Ready Be Censored

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.