RGV’s new movie Kondaa based on Konda Murali and Konda Surekha’s life Launched

RGV’s new movie Kondaa based on Konda Murali and Konda Surekha’s life Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
RGV’s new movie Kondaa based on Konda Murali and Konda Surekha’s life Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
RGV’s new movie Kondaa based on Konda Murali and Konda Surekha’s life Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
RGV’s new movie Kondaa based on Konda Murali and Konda Surekha’s life Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
RGV’s new movie Kondaa based on Konda Murali and Konda Surekha’s life Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

"కొండా" చిత్రం ప్రారంభం

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకం పై మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలు గా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నిర్మించబడుతున్నచిత్రం "కొండా". వరంగల్ లోని కొండా మురళి మరియు కొండా సురేఖ గార్ల జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్న చిత్రం "కొండా". . ఈ చిత్రం వరంగల్ లో కొండా మురళి సొంతఊరు వంచనగిరి లో ఘనంగా ప్రారంభం అయింది. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయం లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. వరంగల్ ప్రజలు ఈ చిత్రం ఓపెనింగ్ కి తండోపతండాలుగా విచ్చేసి హర్షద్వానాలతో ముహూర్తపు సన్నివేశాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. విజయవాడ లో చదువుకున్నాను, ఆంధ్ర లో జరిగిన చరిత్ర అంత తెలుసు కానీ తెలంగాణ చరిత్ర అంతగా తెలీదు. కొండా మురళి గారి చరిత్ర చాలా గొప్పగా నచ్చింది. వాళ్ళ జీవిత కథని అందరికి తెలియాలి అని కొండా చిత్రాని నిర్మిస్తున్నాము. కొండా మురళి మామూలు మనిషి కాదు అని చాలా చెప్పారు. ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్తుతులలో పుడతారు. ఎవరేం చేసిన పుట్టిన పరిస్థితి ,పెరిగిన పరిస్థితి అన్నీ కలిసి ఒక కలెక్టివ్ మైండ్ మీద ఎఫెక్ట్ ఇచ్చి అప్పుడు వారి కున్న ధైర్యం తో మంచి కోసం, న్యాయం కోసం ఎదురు తిరిగే దమ్ము చాలా తక్కువ మందికి ఉండగా మిగిలిన వారంతా కూడా బానిసలుగా వుంటారు. నేను వీరి కథ, జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత మహా దమ్మున్నోడు కొండ మురళి అని నేను తెలుసుకున్నాను.నేను ఒక ఫిల్మ్ మేకర్ ని ఎవరో జీవించిన వ్యక్తి గురించి నేను కొంతమంది ద్వారా తెలుసుకొని దాంట్లో నుంచి నాకు అర్థం అయిన సారాంశాన్ని తీయడం జరుగుతుంది. నాకు ఒక కొండ మురళి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏ డైరెక్టర్ కైనా తన కథ ఎంత ఫెంటాస్టిక్ ఉందనేది ముఖ్యం. కథ బాగా లేకపోతే ఏమి చేయలేడు.నేను శివ నుంచి స్టార్ట్ అయ్యి బాంబే నుంచి తీసిన సినిమాల నుంచి కావచ్చు నా సినీ చరిత్రలో విన్న మోస్ట్ ఎక్స్ట్రార్డినరీ కథ కొండా . కొండా మురళి, కొండా సురేఖ గార్ల కథను నేను నా టాలెంట్ తో వారి జీవిత చరిత్ర ను టెన్ పర్సెంట్ సినిమాలో పెట్ట గలిగినా కూడా నా ప్రయత్నం సక్సెస్ అయి కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. కొండ మురళి తో కలిసి నేను తిరిగిన తర్వాత నేను సురేఖమ్మ గారి కంటే మురళిని ఎక్కువ ఇష్టపడుతున్నాను. నేను చూసిన అందరిలో కంటే వీరు బెస్ట్ కపుల్స్. కొండ గారి కపుల్స్ ది చాలా యూనిక్ థింగ్ ఇలాంటి రిలేషన్ షిప్ తో ఉన్న ఫ్యామిలీ నేను ఇప్పటి వరకు చూడలేదు.అందుకే వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. కొండా అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాకూడదని యూనివర్సల్ కావాలని ఈ సినిమా తీస్తున్నాను. కొండా లాంటి సినిమా ఇప్పటివరకు మీరు లైఫ్ లో చూసి ఉండరని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ముకుంద్ మాట్లాడుతూ కొండా అభిమానులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు వర్మ గారు చరిత్ర సృష్టించే సినిమాలు తీశాడు.తన సినీ చరిత్రలో ఇంకో చరిత్ర సృష్టించే సినిమా కొండా అవుతుంది. కొండా అనే స్టోరీ వర్మ గారు ఒక్కసారి టేకింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈసారి చూడబోతున్నాం. 30 సంవత్సరాల కింద వచ్చిన శివ ఒక లెవల్ అయితే ఇది వేరే లెవెల్ అవుతుంది. ఈ సినిమాతో ఊరిలో తిరిగే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ఇది కొండన్న మూవీ అని కచ్చితంగా చెప్పుకునే సినిమా అవుతుంది. వర్మ గారు ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఇంకొక సినిమా తీస్తున్నాం అంటున్నారు కానీ ఇది సినిమా కాదు నిజజీవితంలో మీ మధ్యలో ఉన్న కొండా దంపతులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని దేనికి భయపడకుండా ఎలా దైర్యంగా నిల్చున్నారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు .ఈ సినిమాతో కొండా దంపతులు సెన్సేషన్ క్రియేట్ చేయబో తున్నారని మేము చెప్పబో తున్నాను. అంతే కాదు ఆర్.జీ.వి మురళి ఇద్దరూ ఒకే దగ్గర చేరితే ఎలా ఉంటుందో మీకు ఈ సినిమా నిరూపిస్తుంది.అలాగే ఈ రెండు సునామీలు ఒక దగ్గర చేరినసపుడు ఇందులో ఒక సునామి చరిత్ర సృష్టించ బోతున్నారు అది రాబోయే ఎలక్షన్లలో చూడాలా..? థియేటర్లలో.. చూడాలా..? లేకపోతే మన మధ్యలో చూడాలా.. ఏంటి అనేది త్వరలో వర్మ గారు ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ప్రజల మధ్యలో చూపేట్టడానికి చూస్తున్నారు. వర్మ గారు చూపించే ఈ "యదార్థగాథ" ఏ విధంగా ఉంటుంది, రాజకీయంగా ఉంటుందా లవ్ స్టోరీ గా ఉంటుందా లేకపోతే మరో రక్త చరిత్ర క్రియేట్ అవుతుందా అనేది త్వరలో తెలుస్తుంది. ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి మాఫియాడాన్ ల దగ్గర నుంచి గల్లీ లో ఉండే రౌడీ వరకు ఎన్నో కథలను చిత్రీకరించిన ఆర్.జీ.వి గారికి ఇలాంటి సినిమాలు తీయడం వెన్నతో పెట్టిన విద్య . సాధారణంగా ఒక మగ వాడి వెనక మహిళ ఉంటుంది అంటారు.కానీ ఒక మహిళ వెనక కొండన్న ఉన్నాడు.ఈ సినిమా విడుదల తర్వాత ప్రతి మహిళ ధైర్యంగా మా వెంట కొండన్న ఉన్నాడు అనే విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది.దీన్ని మల్లారెడ్డి గారు నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యోయో టాకీస్ తో నిర్మించడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఈ సినిమాలో మరో కొత్త వర్మను చూడబోతున్నారు అన్నారు.

కొండా సురేఖ మాట్లాడుతూ .. మురళి గారు సైకిల్ మీద టమోటాలు పెట్టుకొని వరంగల్ మార్కెట్ కెళ్ళి అమ్మిన వ్యక్తి . అటువంటి వ్యక్తి ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఆయన ప్రజాభిమానం తోటే స్వతహాగా ఎదిగాడానేది మన అందరికీ తెలుసు. బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి మా పైన విమర్శలు చేసే వారిని నేను ఒక్కటే సవాల్ చేస్తున్న మీకు ధైర్యం ఉంటే మీ బయోపిక్ లు తీసుకోండి మీ సొంత పైసలు పెట్టే చేయించుకోండి అర్జీవి అన్న లాంటి డైరెక్టర్ తో తీసుకోండి మేము కాదనము.మా కథ వెనుక ఒక చరిత్ర ఉంది .మా జీవితాల వెనుక ఒక చరిత్ర ఉంది .మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరందరూ కూడా పెత్తందార్లు , భూస్వాములు, బడుగు బలహీన వర్గాల లను అణగదొక్కే టటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు , ఎంతసేపు పక్క వాళ్ళను ఎదగనీయకుండా చేసేటటువంటి గుణం ఉన్న వాళ్ళు కానీ.. పేదవాడిని ప్రేమించే టటువంటి మనసున్న వ్యక్తి మురళి గారు పేదవాడికి పైకి తీసుకువచ్చే గొప్ప వ్యక్తి వ్యక్తి మురళి గారు .ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా దానమిచ్చే వ్యక్తి మురళీ గారు. ఈ గ్రామంలో మన అందరికీ తెలుసు స్కూలు ,జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్ భూములు గాని ఇవన్నీ ఆయన ఆయన ప్రజల కోసం ఇవ్వకపోతే కోట్ల రూపాయలను సొమ్ముచేసుకొనే వాడు.డబ్బుకు ఆశించకుండా తన భూమిని కూడా ఇచ్చేసి నటువంటి వ్యక్తి మురళి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాత్రం కబ్జాలు చేసి కోట్ల రూపాయల దండుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే అందుకే వారికి బయోపిక్ లు తీసే దమ్ము ధైర్యం లేదు. ఆర్.జి.వి గారు మమ్మల్ని గుర్తించి ముందుకొచ్చి కొండా సినిమా చేస్తానని ధైర్యంగా చెప్తున్నారు. అన్నిటికంటే మంచి కథను ఇస్తున్నాం అని చెబుతున్నాడు. అటువంటి లక్షణాలు మురళి గారు లో ఉన్నాయి కాబట్టి ఆర్జివి గారు ముందుకు వచ్చారు అని నేను ఆశిస్తున్నాను అని అన్నారు

సినిమా పేరు - కొండా

బ్యానర్ - కంపెనీ ప్రొడక్షన్ మరియు యో యో టాకీస్

నటి నటులు : అదిత్ అరుణ్, ఇర్రా మోర్ మరియు తదితరులు

కెమెరా మాన్ - మల్హర్భట్ జోషి

ప్రొడక్షన్ కంట్రోలర్ - జక్కుల వెంకటేష్, వై రమేష్ బాబు

పి అర్ ఓ - పాల్ పవన్

నిర్మాతలు - మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి

దర్శకుడు - రామ్ గోపాల్ వర్మ

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%