తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంది అనిపించింది. సినీ ప్రముఖులను సైతం ట్రైలర్ తో మెప్పించిన మరో ప్రస్థానం మూవీ ఈరోజు విడుదలైంది. మరి.. మరో ప్రస్థానం.. ఫలితం ఏంటి..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిందే.
కథ
ముంబైలో వరుస నేరాలకు పాల్పడుతుంటుంది రాణె భాయ్ (కబీర్ దుహాన్ సింగ్) గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో సభ్యుడు శివ (తనీష్). ఒక రోజు నైని (అర్చనా సింగ్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నైని కూడా శివను ప్రేమిస్తుంది. నైనిని పెళ్లి చేసుకుని తన క్రిమినల్ వృత్తిని వదిలేద్దామనుకుంటాడు శివ. నైనితో కొత్త జీవితం ప్రారంభిద్దామనుకుంటాడు. తన జీవితంలో ఒక పెద్ద ట్రాజెడీకి లోనైన శివ...రాణె భాయ్ నేర సామ్రాజ్యాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటాడు. ఈ గ్యాంగ్ నేరాలను కెమెరాలో చిత్రీకరిస్తుంటాడు. రాణె భాయ్ చేయబోయే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. శివ జీవితంలో ఎదురైన ట్రాజెడీ ఏంటి, బాంబ్ బ్లాస్ట్ ఆపాలని అతను చేసిన ఈ ప్రయత్నాలు ఫలించాయా, ఈ కథలో యువిధ (ముస్కాన్ సేథి) పాత్ర ఏంటి, ఈ గ్యాంగ్ నేరాలను బయటపెట్టాలనుకున్న శివ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్
కథ, కథనం
తనీష్ యాక్టింగ్
వన్ షాట్ పాటర్న్
మైనస్ పాయింట్స్
వయలెన్స్
ఎంటర్ టైన్ మెంట్ తగ్గడం
విశ్లేషణ
తనీష్ కెరీర్ లో చాలా సినిమాలు లవర్ బాయ్ గానో, పక్కింటి కుర్రాడిగానో కనిపించాడు. మరో ప్రస్థానం మూవీ తనీష్ మొత్తం కెరీర్ లో డిఫరెంట్ సినిమా. ఇప్పటిదాకా తనీష్ ఇలాంటి ఎమోషనల్ కిల్లర్ క్యారెక్టర్ చేయలేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే వన్ షాట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టికల్ గా షూటింగ్ చేయడం చాలా కష్టం. ప్రతి సీన్ ఒక సీక్వెన్స్ లో వెళ్లాలి. సింగిల్ టేక్ లో ఓకే అవ్వాలి. ఈ సీన్ మేకింగ్ ప్రాక్టీస్ లో దర్శకుడు జాని సక్సెస్ అయ్యారు. మరో ప్రస్థానం సినిమా ప్రారంభం ఎండ్ దాకా..ఒక ఫ్లోలో సీన్స్ అన్నీ సాగుతుంటాయి. ఎక్కడా కథలో, స్క్రీన్ ప్లేలో డీవీయేషన్ కనిపించదు. హీరో క్యారెక్టర్ లో ఎదురైన ట్రాజెడీ నుంచి టేకాఫ్ అయిన కథ క్లైమాక్స్ వరకు ఇంటెన్స్ గా ప్రేక్షకులను కథలో లీనం చేస్తూ సాగుతుంది. రాణె భాయ్ గా కబీర్ దుహాన్ సింగ్ సెటిల్ట్ గా పర్మార్మ్ చేశాడు.
యువిధ క్యారెక్టర్ లో ముస్కాన్ సేథి గ్లామర్ యాడ్ చేసింది. ఆమె అందం, పాటల్లో చూపించిన గ్లామర్ ప్రేక్షకులకు రిలీఫ్ ఇస్తుంది. నైని క్యారెక్టర్ లో అర్చనా సింగ్ బబ్లీగా అందంగా కనిపించింది. ఆమె సీన్స్ కొన్ని సినిమాలో ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి క్రాఫ్ట్ లు మరో ప్రస్థానం చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి. ఎంఎన్ బాల సినిమాటోగ్రఫీ, సునీల్ కశ్యప్ సంగీతం సినిమాకు బలన్నిచ్చాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కొంత ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే కథ ఫ్లోకు అడ్డువస్తుందని దర్శకుడు అలాంటి ఆలోచన చేయలేదనిపిస్తుంది.
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన మరో ప్రస్థానం సినిమా కొత్తదనం కోరుకునే ఆడియెన్స్ ను మెప్పిస్తుందనడంలో డౌట్ లేదు.
రేటింగ్ - 3/5
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.