Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas

Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

హీరో రోహిత్ "కళాపాన్ ఇండియా స్టార్
ప్రభాస్ విడుదల చేసిన కార్" టీజర్

ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రోహిత్ వరుస హిట్లు కొట్టేశారు. 6 టీన్స్‌, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ అంటూ సూపర్ హిట్లను అందుకున్నారు. శంక‌ర్‌దాదా MBBS, నవ వసంతం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా హీరో రోహిత్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఆయ‌న‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కళాకార్‌. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. మొదటిసారి రోహిత్‌ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మద్యే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీజర్ ని విడుదల చేసారు.

హీరో రోహిత్ మాట్లాడుతూ .. హీరో ప్రభాస్ గారు టీజర్ విడుదల చేసినందుకు చాల హ్యాపీగా ఉంది. నిజంగా ఇది మరచిపోలేని అనుభూతి. టీజర్ చూసి చాలా బాగుందని చెప్పారు. టీజర్ విడుదల చేసినందుకు ప్రభాస్ గారికి థాంక్స్ చెబుతున్నాను. తప్పకుండా ఈ టీజర్, అలాగే సినిమా కూడా మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ .. ఈ రోజు చాల ఆనందంగా ఉంది ప్రభాస్ గారు టీజర్ లాంచ్ చేసినందుకు ఆయనకు చాలా థాంక్స్. నాకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. నిజంగా మా సినిమాకు సపోర్ట్ చేసినందుకు ప్రభాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ .. మా ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో ఇది రెండో సినిమా. ఈ సినిమా టీజర్ ని ప్రభాస్ లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్న సినిమాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్. సినిమా మొత్తం పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ కాపీ వస్తుంది. అలాగే త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తీ చేసి దసరాకు విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాం అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలా ఓ చిన్న సినిమాకు సపోర్ట్ ఇవ్వడంతో ఈ సినిమా పెద్ద రేంజ్ హిట్ అవుతుంది. 16 టెన్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ హీరోనా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. టీజర్ బాగుందని ప్రభాస్ మెచ్చుకున్నారు. తప్పకుండా కళాకార్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత: వెంకటరెడ్డి జాజాపురం
దర్శకత్వం : శ్రీను బందెల.

Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Rohit’s Kalakhar Movie Teaser Released By Prabhas (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%