Social News XYZ     

Heroine Muskan Sethi Says She Took Maro Prasthanam Role As A Challenge

నేను ఛాలెంజ్ గా తీసుకుని చేసిన సినిమా "మరో ప్రస్థానం" - హీరోయిన్ ముస్కాన్ సేథి

"పైసా వసూల్", "రాగల 24 గంటల్లో" చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి. సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ముస్కాన్ సేథి "మరో ప్రస్థానం" సినిమాలో తనీష్ సరసన నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని జానీ తెరకెక్కించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. "మరో ప్రస్థానం" చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న "మరో ప్రస్థానం" మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..

హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ... మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అయితే.. డైరెక్టర్ జానీ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. డైలాగుల విషయంలో ప్రామిటింగ్ చెప్పడం.. కొన్ని సీన్స్ లో ఎలా నటించాలో యాక్ట్ చేసి చూపించడం.. జరిగింది.

 

జానీ సార్ అలా ప్రతిదీ డీటైల్ గా చెప్పడం వలనే నేను ఈ క్యారెక్టర్ ను చేయగలిగాను. ఈ సందర్భంగా జానీ సార్ కి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్ గా ఉంటుంది. ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ చాలా బాగా గైడ్ చేశారు. టోటల్ గా చెప్పాలంటే.. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అన్నారు.

Facebook Comments
Heroine Muskan Sethi Says She Took Maro Prasthanam Role As A Challenge

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.