Social News XYZ     

Doordarshan Movie First Look Released

సువిక్షిత్ బొజ్జ హీరోగా ‘దూరదర్శని’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..

సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్ జంటగా V9 విజువల్స్ బ్యానర్‌పై బేబీ రియాంషిక సమర్పణలో వస్తున్న సినిమా దూరదర్శని. మారెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నాన్నపనేని, కేటేశ్వర రావు బొమ్మిన సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ కొమ్మి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా దూరదర్శని సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. రెట్రో లుక్‌లో ఉన్న ఓ పోస్టర్‌కు మంచి స్పందన వస్తుంది. చేతిలో పుస్తకాలు, టిఫిన్ బాక్స్ పట్టుకుని హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతికా రథన్ అలా నడుకుంటూ వెళ్తున్న పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆనంద్ గుర్రాన సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. మురళీ మోహన్ రెడ్డి B సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. SR శేఖర్ ఎడిటర్. నారాయణ ఆవుల దూరదర్శని సినిమాకు రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలపనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్

 

టెక్నికల్ టీం:
దర్శకుడు: కార్తికేయ బొమ్మి
నిర్మాతలు: మారెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నాన్నపనేని, కేటేశ్వర రావు బొమ్మిన
బ్యానర్: V9 విజువల్స్
సమర్పణ: బేబీ రియాంషిక
సంగీత దర్శకుడు: ఆనంద్ గుర్రాన
DOP: బి మురళీ మోహన్ రెడ్డి
ఎడిటర్: SR శేఖర్
రైటర్: నారాయణ ఆవుల
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Facebook Comments
Doordarshan Movie First Look Released

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: